త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rajiv Swagruha | 137 రాజీవ్ స్వ‌గృహ ఓపెన్ ప్లాట్ల బ‌హిరంగ వేలం

Rajiv Swagruha | గ్రేట‌ర్ హైద‌రాబాద్ (Greater Hyderabad) ప‌రిధిలోని 137 రాజీవ్ స్వ‌గృహ (Rajiv Swagruha) ఓపెన్ ప్లాట్ల‌ను బ‌హిరంగ వేలం వేయ‌నున్నారు. దీనికి సంబంధించి తెలంగాణ రాజీవ్ స్వ‌గృహ కార్పొరేష‌న్ లిమిటెడ్ నోటిఫికేష‌న్ లో తొర్రూర్, బ‌హ‌దూర్‌ప‌ల్లి, కుర్మ‌ల్‌గూడ ప్రాంతాల్లో ఉన్న ఓపెన్ ప్లాట్ల‌ను వేలం వేయ‌నున్న‌ట్లు తెలిపారు.

A

Telangana | Published On Jan 23, 2026, 5.47 pm IST

Rajiv Swagruha | 137 రాజీవ్ స్వ‌గృహ ఓపెన్ ప్లాట్ల బ‌హిరంగ వేలం
Advertisement

Rajiv Swagruha | త్రినేత్ర‌.న్యూస్‌ : గ్రేట‌ర్ హైద‌రాబాద్ (Greater Hyderabad) ప‌రిధిలోని 137 రాజీవ్ స్వ‌గృహ (Rajiv Swagruha) ఓపెన్ ప్లాట్ల‌ను బ‌హిరంగ వేలం వేయ‌నున్నారు. దీనికి సంబంధించి తెలంగాణ రాజీవ్ స్వ‌గృహ కార్పొరేష‌న్ లిమిటెడ్ ఎండీ వీపీ గౌత‌మ్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేశారు. తొర్రూర్, బ‌హ‌దూర్‌ప‌ల్లి, కుర్మ‌ల్‌గూడ ప్రాంతాల్లో ఉన్న ఓపెన్ ప్లాట్ల‌ను వేలం వేయ‌నున్న‌ట్లు తెలిపారు. త‌మ కార్పొరేష‌న్ ద్వారా అభివృద్ధి చేసిన లే అవుట్ల‌లో నివాస భ‌వ‌నాల నిర్మాణానికి అనుకూల‌మైన ప్లాట్ల‌ను ఈ బ‌హిరంగ వేలం ద్వారా విక్ర‌యించ‌నున్నారు. ఈ వేలాన్ని వ‌చ్చే నెల 7, 8 తేదీల‌లో పెద్ద అంబ‌ర్‌పేట‌లోని అవిక క‌న్వెన్ష‌న్‌లో నిర్వ‌హించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఆస‌క్తి ఉన్న‌వారు మీ సేవ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించారు.

ఎటువంటి చిక్కులు లేని, క్లియ‌ర్ టైటిల్ ఉన్న తెలంగాణ రాజీవ్ స్వ‌గృహ కార్పొరేష‌న్ లిమిటెడ్‌కు చెందిన ప్లాట్లు ప్ర‌ధాన ప్ర‌దేశాల‌లో మంచి క‌నెక్టివిటీతో పూర్తిగా అభివృద్ధి చెందిన ప్రాంతంలో ఉన్నాయ‌ని చెప్పారు. మూడు సైట్లు సైతం ఔట‌ర్ రింగ్‌రోడ్డుకు స‌మీపంలోనే ఉన్నాయ‌ని పేర్కొన్నారు. తొర్రూర్‌లో 105 ప్లాట్లు, బహుదూర్ పల్లిలో 12 ప్లాట్లు, కుర్మల్ గూడలో 20 ప్లాట్ల‌ను అందుబాటులో ఉంచిన‌ట్లు వివ‌రించారు. ఈ ప్లాట్లు 200 నుంచి వెయ్యి చ‌ద‌ర‌పు గ‌జాల విస్తీర్ణంలో ఉన్నాయ‌న్నారు.

మిగిలిన వివ‌రాలిలా ఉన్నాయి..

తొర్రూర్‌

మొత్తం ప్లాట్ల సంఖ్య : 105
విస్తీర్ణం: 200 నుంచి 500 చ‌ద‌ర‌పు గ‌జాల వ‌ర‌కు
చ‌ద‌ర‌పు గ‌జానికి క‌నీస ధ‌ర‌: రూ.25,000
కనీస బిడ్ పెంపుద‌ల చ‌ద‌ర‌పు గ‌జానికి : రూ.500
ధ‌రావ‌త్తు మొత్తం: రూ.2,00,000
ధ‌రావ‌త్తు చెల్లింపుకు చివ‌రి తేదీ: 06.02.2026 సాయంత్రం అయిదు గంట‌ల వ‌ర‌కు
వేలం తేదీ: 07.02.2026 ఉద‌యం ప‌దిన్న‌ర గంట‌ల నుంచి సాయంత్రం అయిదు గంట‌ల వ‌ర‌కు, 08.02.2026 ఉద‌యం ప‌దిన్న‌ర గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం ఒక‌టిన్న‌ర‌ గంట‌ల వ‌ర‌కు

బ‌హ‌దూర్‌ప‌ల్లి

మొత్తం ప్లాట్ల సంఖ్య : 12
విస్తీర్ణం: 200 నుంచి 1000 చ‌ద‌ర‌పు గ‌జాల వ‌ర‌కు
చ‌ద‌ర‌పు గ‌జానికి క‌నీస ధ‌ర‌: కార్న‌ర్ ప్లాట్ల‌కు రూ.30,000, ఇత‌ర ప్లాట్ల‌కు రూ.27,000
కనీస బిడ్ పెంపుద‌ల చ‌ద‌ర‌పు గ‌జానికి : రూ.500
ధ‌రావ‌త్తు మొత్తం: రూ.3,00,000
ధ‌రావ‌త్తు చెల్లింపుకు చివ‌రి తేదీ: 07.02.2026 సాయంత్రం అయిదు గంట‌ల వ‌ర‌కు
వేలం తేదీ: 08.02.2026 మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల నుంచి మూడు గంట‌ల వ‌ర‌కు

కుర్మ‌ల్‌గూడ‌

మొత్తం ప్లాట్ల సంఖ్య : 20
విస్తీర్ణం: 200 నుంచి 300 చ‌ద‌ర‌పు గ‌జాల వ‌ర‌కు
చ‌ద‌ర‌పు గ‌జానికి క‌నీస ధ‌ర‌: రూ.20,000
కనీస బిడ్ పెంపుద‌ల చ‌ద‌ర‌పు గ‌జానికి : రూ.500
ధ‌రావ‌త్తు మొత్తం: రూ.2,00,000
ధ‌రావ‌త్తు చెల్లింపుకు చివ‌రి తేదీ: 07.02.2026 సాయంత్రం అయిదు గంట‌ల వ‌ర‌కు
వేలం తేదీ: 08.02.2026 మ‌ధ్యాహ్నం మూడు గంట‌ల నుంచి

Advertisement

తాజావార్తలు

Advertisement