త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

N Ramchander Rao | జీహెచ్ఎంసీలో గెలిస్తే.. తెలంగాణ‌ను గెలిచిన‌ట్టే : ఎన్ రామ‌చంద‌ర్ రావు

N Ramchander Rao | గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో బీజేపీ గెలిస్తే.. తెలంగాణ‌ను గెలిచిన‌ట్టే అని ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎన్ రామ‌చంద‌ర్ రావు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ కార్పొరేష‌న్ల‌లో మెజార్టీ స్థానాలు గెలిచి మేయ‌ర్ పీఠాల‌ను కైవ‌సం చేసుకోవాల‌ని ఆయ‌న బీజేపీ శ్రేణుల‌కు పిలుపునిచ్చారు.

S

Hyderabad | Published On May 19, 2026, 4.07 pm IST

N Ramchander Rao | జీహెచ్ఎంసీలో గెలిస్తే.. తెలంగాణ‌ను గెలిచిన‌ట్టే : ఎన్ రామ‌చంద‌ర్ రావు
Advertisement

N Ramchander Rao | త్రినేత్ర‌.న్యూస్ : గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో బీజేపీ గెలిస్తే.. తెలంగాణ‌ను గెలిచిన‌ట్టే అని ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎన్ రామ‌చంద‌ర్ రావు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ కార్పొరేష‌న్ల‌లో మెజార్టీ స్థానాలు గెలిచి మేయ‌ర్ పీఠాల‌ను కైవ‌సం చేసుకోవాల‌ని ఆయ‌న బీజేపీ శ్రేణుల‌కు పిలుపునిచ్చారు. బ‌ర్క‌త్‌పురాలోని బీజేపీ సిటీ కార్యాల‌యంలో కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి రామ‌చంద‌ర్ రావు ప్ర‌సంగించారు.

ఇప్ప‌టికే జీహెచ్ఎంసీకి ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉండే. కానీ ప్ర‌భుత్వం హైద‌రాబాద్ న‌గ‌రాన్ని మూడు మున్సిప‌ల్ కార్పొరేష‌న్లుగా విభ‌జించింది. డివిజ‌న్లు పెరిగే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. అందుకే కొన్ని డివిజ‌న్ల‌కు పేర్లు ప్ర‌క‌టించ‌లేదు. కొంత‌మేర మార్పులు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

తెలంగాణ‌లో మ‌నం గెలిచిన‌ట్టే..

గ‌తంలో జీహెచ్ఎంసీలో 48 డివిజ‌న్ల‌లో గెలిచాం. 48 సీట్లు గెల‌వ‌డం అంటే మామూలు మాట కాదు.. బీఆర్ఎస్, మ‌జ్లిస్ క‌ల‌యిక‌తో వారు ఎక్కువగా గెలిచారు. మ‌నం ఒంట‌రిగా పోటీ చేసి 48 గెలిచాం. ప్ర‌స్తుతం ఈమూడు కార్పొరేష‌న్ల ప‌రిధిలో మ‌న ఎంపీలే అధికంగా ఉన్నారు. ఒక హైద‌రాబాద్ మిన‌హాయించి. మ‌ల్కాజ్‌గిరి, సికింద్రాబాద్, చేవెళ్ల మ‌నమే ఉన్నాం. ఇవ‌న్నీ మ‌న‌కు మెజార్టీ వ‌చ్చిన ప్రాంతాలు.. దీన్ని కాపాడుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. ఈ మూడు మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో గెలిస్తే తెలంగాణ‌లో మ‌నం గెలిచిన‌ట్టే.. మ‌న‌ ప్ర‌భుత్వం వ‌స్త‌ది అని రామ‌చంద‌ర్ రావు దీమా వ్య‌క్తం చేశారు.

ప్ర‌జ‌ల్లో బీఆర్ఎస్ లేనే లేదు..

గ్రూపు రాజ‌కీయాలు బంద్ చేయండి.. ప‌ని చేసే వారికే టికెట్లు. గ‌తంలో మ‌నస్ప‌ర్థ‌ల‌తో కొన్ని సీట్లు కోల్పోయాం. హైద‌రాబాద్ ఎన్నిక‌ల‌తో పాటు తెలంగాణ రాజ‌కీయాల‌ను కేంద్ర పార్టీ మానిట‌రింగ్ చేస్తుంది. మేం గొప్పొళ్లం అంటే న‌డ‌వ‌దు. స్టేట్ పార్టీ, సెంట్ర‌ల్ పార్టీ క‌లిసి టికెట్ నిర్ణ‌యాలు అవుతాయి. క‌ష్ట‌ప‌డితేనే గెలుస్తాం.. బెంగాల్ ఎట్ల గెలిచాం.. అక్క‌డ క్ర‌మ‌శిక్ష‌ణ‌తో గెలిచాం. ఇక్క‌డ కూడా మ‌నం క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ఉండాలి. రాష్ట్ర ప్ర‌జ‌ల్లో బీజేపీకి బ‌లం ఉంది.. మొన్న‌టి మోదీ స‌భ‌కు ప్ర‌జ‌లు స్వ‌చ్ఛందంగా వ‌చ్చారు. ఒక్క పైసా కూడా ఇవ్వ‌లేదు జ‌నాల‌కు. ప్ర‌జ‌ల్లో బీఆర్ఎస్ లేనే లేదు.. వాళ్ల నాయ‌కులు మ‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. కానీ బీఆర్ఎస్ అధి నాయ‌క‌త్వం ఆపుతుంది. 100 శాతం మూడు మున్సిపాలిటీలు గెలుస్తాం అని రామ‌చంద‌ర్ రావు విశ్వాసం వ్య‌క్తం చేశారు.

Advertisement
Advertisement