Harish Rao | మియాపూర్ 550 ఎకరాల భూమిని కాపాడింది బీఆర్ఎస్ ప్రభుత్వమే
Harish Rao | బీఆర్ఎస్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పోరాడి కాపాడిన విలువైన ప్రభుత్వ భూమిని.. ఈ రోజు తాము అమ్ముకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగంగా ప్రకటించడం సిగ్గుచేటు అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
అమ్ముకోబోతున్నది నేటి కాంగ్రెస్ ప్రభుత్వం..
మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు
Harish Rao | త్రినేత్ర న్యూస్ : బీఆర్ఎస్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పోరాడి కాపాడిన విలువైన ప్రభుత్వ భూమిని.. ఈ రోజు తాము అమ్ముకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగంగా ప్రకటించడం సిగ్గుచేటు అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ధ్వజమెత్తారు. మియాపూర్ 550 ఎకరాల వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత, ముఖ్యమంత్రి మీడియా సమావేశం పెట్టి చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని సుప్రీంకోర్టు రికార్డులే స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు.
మియాపూర్ భూ వివాదం 2003లోనే ఎస్ఎల్పీగా సుప్రీంకోర్టుకు చేరింది. 2013లో అది సివిల్ అప్పీల్‌గా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఈ విలువైన భూమి ప్రభుత్వం చేజారిపోకూడదని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ దృఢ నిశ్చయంతో వ్యవహరించారు. 2015లోనే దేశంలోనే అత్యుత్తమ న్యాయవాదుల్లో ఒకరైన సీనియర్ న్యాయవాది సీ.ఎస్. వైద్యనాథన్‌ను ప్రత్యేకంగా నియమించారు. ఈ వివరాలన్నీ సుప్రీంకోర్టు రికార్డుల్లో స్పష్టంగా నమోదై ఉన్నాయి. ప్రజలందరికీ అందుబాటులోనూ ఉన్నాయని పేర్కొన్నారు.
సీనియర్ న్యాయవాది సీ.ఎస్. వైద్యనాథన్ 2015 ఏప్రిల్ 7 నుంచి తెలంగాణ ప్రభుత్వం తరపున మియాపూర్ భూముల రక్షణ కోసం సుప్రీంకోర్టులో వాదిస్తూ వచ్చారు. 2015 నుంచి 2023 వరకు దాదాపు 8 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ భూముల పరిరక్షణ కోసం అలుపెరగని న్యాయపోరాటం చేసింది. మియాపూర్ భూమికి సంబంధించిన ప్రతి పిటిషన్, ప్రతి అఫిడవిట్, సమగ్ర ఆధారాలను సుప్రీంకోర్టు ముందు ఉంచింది నాటి బీఆర్ఎస్ ప్రభుత్వమే.
గౌరవ సుప్రీంకోర్టు మియాపూర్ భూముల తీర్పులో ఈ క్రింది విధంగా పేర్కొంది.
"It is apposite to discuss the relevant expressions and regulations under the A.P. Abolition of Jagirs Regulations and the Atiyat Inquiries Act. Certain relevant terminologies are being extracted from paragraph 93 of the judgment of this Court in Trinity Infraventures Ltd. v. M.S. Murthy, 2023 SCC OnLine SC 738, for the said purpose."
అంటే, మియాపూర్ తీర్పుకు అసలు పునాది 'ట్రినిటీ ఇన్‌ఫ్రావెంచర్స్' కేసు తీర్పే. గోల్డ్‌స్టోన్ ప్రసాద్‌కు సంబంధించిన ఆ కేసు 2023 జూన్ 15న తెలంగాణ ప్రభుత్వం విజయం సాధించింది. ఆనాడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఆ కేసులోనూ ప్రభుత్వం తరఫున వాదించింది అదే వైద్యనాథన్ గారు. నాడు మేము సాధించిన ఆ విజయమే, ఆ తీర్పులోని చట్టపరమైన అంశాలే నేడు మియాపూర్ భూముల తుది తీర్పుకు బలమైన ఆధారమయ్యాయని తెలిపారు.
ఈ రికార్డులన్నీ సుప్రీంకోర్టు వెబ్సైట్లో బహిరంగంగా ఉన్నప్పటికీ, తానే ఏదో సాధించినట్లు ముఖ్యమంత్రి ప్రెస్ మీట్లు పెట్టి సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదం, సిగ్గుచేటు. ప్రెస్ మీట్ పెట్టి అబద్ధాలు ప్రచారం చేసినంత మాత్రాన అవి నిజాలు అయిపోవు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన నిరంతర పోరాటం వల్లే నేడు మియాపూర్ భూములు పరిరక్షించబడ్డాయి. ఈ మీడియా సమావేశం వెనుక ఉన్న అసలు కుట్ర వేరే ఉంది. మియాపూర్‌లో ఉన్న ఈ 550 ఎకరాల భూమి విలువ రూ. 60 వేల కోట్ల పైమాటేనని స్వయంగా ముఖ్యమంత్రే ప్రకటించారు. ఈ విలువైన భూములను అమ్ముకోవడానికే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు హరీశ్‌రావు మండిపడ్డారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●IND Vs NZ T20 | ఫిలిప్స్ విధ్వంసం.. నాల్గో టీ20లో భారత్‌కు భారీ ఓటమి
- ●Uttam Kumar Reddy | బియ్యం ధరల దోపిడీపై ఉక్కుపాదం
- ●Chamala Kirankumar | రైల్వే అండర్‌పాస్ కోసం రైల్వే మంత్రికి ఎంపీ చామల వినతి
- ●IIFA Awards 2026 | ఐఫా అవార్డ్స్ విన్నర్స్ వీళ్లే - ధురంధర్‌కు 12 అవార్డులు - టాప్ ప్లేస్‌లో షారుఖ్ తనయుడి వెబ్‌సిరీస్
- ●Indian Railway | రైల్వే ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. ఇక ప్రీమియం రైళ్లలో హయ్యర్ క్లాస్‌లో ప్రయాణం!
- ●Yellamma Movie | వంద మంది జానపద కళాకారులతో "ఎల్లమ్మ" ఆటపాట

IND Vs NZ T20 | ఫిలిప్స్ విధ్వంసం.. నాల్గో టీ20లో భారత్‌కు భారీ ఓటమి

Uttam Kumar Reddy | బియ్యం ధరల దోపిడీపై ఉక్కుపాదం

Chamala Kirankumar | రైల్వే అండర్‌పాస్ కోసం రైల్వే మంత్రికి ఎంపీ చామల వినతి

IIFA Awards 2026 | ఐఫా అవార్డ్స్ విన్నర్స్ వీళ్లే - ధురంధర్‌కు 12 అవార్డులు - టాప్ ప్లేస్‌లో షారుఖ్ తనయుడి వెబ్‌సిరీస్




