Telangana | అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు
Telangana | రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు జారీ చేస్తామని మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్డుల జారీలో ఎలాంటి లోపం ఉండదని ఆయన పేర్కొన్నారు.
Telangana | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు జారీ చేస్తామని మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్డుల జారీలో ఎలాంటి లోపం ఉండదని ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని ఎఫ్‌డీసీ బోర్డు రూమ్‌లో రాష్ట్ర మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమావేశమైంది. ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఐ అండ్ పీఆర్ కమిషనర్ సీహెచ్ ప్రియాంక ఆధ్వర్యంలో అక్రిడిటేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం సందర్భంగా అక్రిడిటేషన్ కోసం జర్నలిస్టులు సమర్పించిన దరఖాస్తులను కమిటీ సభ్యులు సమగ్రంగా పరిశీలించారు. జర్నలిస్టుల నుంచి అందిన ప్రతి దరఖాస్తును కమిటీ సభ్యులు క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులను మంజూరు చేశారు.
ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం అర్హులైన వారికి అక్రిడిటేషన్ కార్డులు జారీ చేస్తామని, అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకు కార్డు మంజూరులో ఎలాంటి లోపం ఉండదని స్పష్టం చేశారు. అక్రిడిటేషన్ కమిటీ సమావేశాన్ని వచ్చే నెల మొదటివారంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇంకా దరఖాస్తు చేసుకోని అర్హులైన జర్నలిస్టులు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. జిల్లాల వారీగా కలెక్టర్లు పంపే ‘జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ (డీఎంఏసీ)’ ప్రతిపాదనలను కూడా పరిశీలించి ఆమోదం తెలుపుతుందని వెల్లడించారు. ఈ మేరకు జిల్లా స్థాయిలో అక్రిడిటేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్లను కోరారు.
ఈ సమావేశంలో సమాచార–పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ కిషోర్ బాబు, అదనపు డైరెక్టర్ డి.ఎస్. జగన్‌తో పాటు ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



