Pregnant Woman | కడుపులోని బిడ్డకు డీఎన్ఏ టెస్ట్.. భర్త, అత్త వేధింపులతో గర్భిణి ఆత్మహత్య
Pregnant Woman | మెదక్ జిల్లా అల్లాదుర్గం (Alladurg) మండలం గడిపెద్దాపూర్‌లో దారుణం చోటుచేసుకున్నది. కడుపులోని బిడ్డకు డీఎన్ఏ (DNA) టెస్టు చేయించాలంటూ అత్తింటివారు వేధిస్తుండటంతో ఐదు నెలల గర్భిణి (Pregnant Woman) ఆత్మహత్య చేసుకున్నది.
Pregnant Woman | త్రినేత్ర.న్యూస్: మెదక్ జిల్లా అల్లాదుర్గం (Alladurg) మండలం గడిపెద్దాపూర్‌లో దారుణం చోటుచేసుకున్నది. కడుపులోని బిడ్డకు డీఎన్ఏ (DNA) టెస్టు చేయించాలంటూ అత్తింటివారు వేధిస్తుండటంతో ఐదు నెలల గర్భిణి (Pregnant Woman) ఆత్మహత్య చేసుకున్నది.
వికారాబాద్ జిల్లా కోటపల్లి మండలం మొత్తుకపల్లికి చెందిన సుష్మిత (23)కు గడిపెద్దాపూర్‌కు చెందిన గాజుల అభిలాష్‌తో ఏడాదిన్నర క్రితం వివాహం అయింది. ప్రస్తుతం సుష్మిత ఐదు నెలల గర్భిణి. అయితే ఆమెపై అనుమానం పెంచుకున్న భర్త.. తన తల్లి శశిరేఖతో కలిసి వేధిస్తున్నాడు. గర్భంలోని శిశువుకు డీఎన్ఏ పరీక్ష (DNA Test) చేయించాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. దీంతో తరచూ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన సుష్మిత ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు.
అయితే మృతురాలి తల్లి జానాబాయి తన కుమార్తెను భర్త అభిలాష్, అత్త శశిరేఖలే హత్య చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని సంగారెడ్డి దవాఖానకు తరలించారు.
సంబంధిత వార్తలు

Surat Man Euthanasia | భార్య వేధింపులు.. పోలీసుల నిర్లక్ష్యం: నాకు ‘కారుణ్య మరణం’ ప్రసాదించండి అంటూ సూరత్ వాసి ఆవేదన
మే 30, 2026

DNA Test | దివ్యాంగురాలిపై అత్యాచారం.. తండ్రే నిందితుడని తేల్చిన డీఎన్ఏ
ఫిబ్రవరి 5, 2026

Domestic Violence | మల్లెపూలతో ఆకర్షిస్తుందని.. భార్యకు గుండు గీసిన భర్త
ఫిబ్రవరి 4, 2026
తాజావార్తలు
- ●VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే
- ●Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి
- ●Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..
- ●NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు
- ●Horoscope | ఆగస్టు 20 రాశిఫలాలు.. గురుడి ప్రభావంతో వారికి శుభ ఖర్చులు ఉంటాయి!
- ●Yash | టాక్సిక్ మూవీ పిల్లలు చూడొచ్చా..? హీరో యశ్ ఏమన్నాడంటే..?

VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే

Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి

Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..

NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు



