DNA Test | దివ్యాంగురాలిపై అత్యాచారం.. తండ్రే నిందితుడని తేల్చిన డీఎన్ఏ
DNA Test | మహారాష్ట్ర ముంబై (Mumbai)లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. దివ్యాంగురాలిపై అత్యాచారం జరగడంతో ఆమె గర్భం దాల్చింది.
DNA Test | మహారాష్ట్ర ముంబై (Mumbai)లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. దివ్యాంగురాలిపై అత్యాచారం జరగడంతో ఆమె గర్భం దాల్చింది. ఈ కేసులో నిందితుడిని గుర్తించేందుకు 17 మందికి డీఎన్ఏ పరీక్షలు (DNA Test) చేయగా షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె తండ్రే నిందితుడని తేలింది. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
ముంబైలోని కఫీ పరేడ్ ప్రాంతంలో ఉండే 20 ఏళ్ల దివ్యాంగురాలు (మూగ, చెవిటి) గతేడాది సెప్టెంబర్‌లో అనారోగ్యానికి గురైంది. కడుపులో ఇబ్బందిగా అనిపించడంతో కుటుంబ సభ్యులకు తెలియజేసింది. దీంతో వారు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల్లో యువతి గర్భం దాల్చినట్లు వైద్యులు గుర్తించారు. ఈ విషయంపై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు యువతి స్టేట్‌మెంట్ రికార్డు చేసేందుకు ఆసుపత్రి వద్దకు వెళ్లారు. అయితే సదరు యువతికి మాటలు రాకపోవడంతో పోలీసులు ఆమె తండ్రితో మాట్లాడారు.
ఈ సందర్భంగా లైంగిక వేధింపుల గురించి ప్రశ్నలను అతడు తోసిపుచ్చాడు. అంతేకాదు, ఫిర్యాదు చేసేందుకు కూడా నిరాకరించాడు. దీంతో యువతి చెప్పిన ఆధారాలతో ఓ 17 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడితోపాటూ ఆమెతో సన్నిహితంగా మరో 16 మందిని అనుమానితులుగా చేర్చారు. యువతి తండ్రి సహా 17 మంది డీఎన్ఏను యువతి గర్భంలో పెరుగుతున్న శిశువు డీఎన్ఏతో పోల్చగా.. రిపోర్ట్‌లో షాకింగ్ నిజం బయటపడింది. యువతిని గర్భవతిని చేసింది ఆమె తండ్రే అని తేలింది. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
సంబంధిత వార్తలు

Rhiya Yadav | ముంబై యువతి తెగువ.. పోలీసు వాహనాన్ని అడ్డుకుని.. ఎవరీ రియా యాదవ్..?
జులై 23, 2026

WhatsApp | వ్యాపార సంస్థలకు గుడ్ న్యూస్.. వాట్సాప్‌లోనే మెటా బిజినెస్ ఏజెంట్.. కస్టమర్ సర్వీస్ ఇక ఈజీ..
జులై 8, 2026

Mumbai airport | రన్‌వేపైకి ఎదురెదురుగా వచ్చిన విమానాలు.. ముంబైలో షాకింగ్ ఘటన
జులై 8, 2026
తాజావార్తలు
- ●Helicopter Crash | కెన్యాలో హెలికాప్టర్ ప్రమాదం.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్ సహా ఏడుగురు దుర్మరణం
- ●Harish Rao | మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
- ●VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే
- ●Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి
- ●Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..
- ●NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు

Helicopter Crash | కెన్యాలో హెలికాప్టర్ ప్రమాదం.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్ సహా ఏడుగురు దుర్మరణం

Harish Rao | మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ

VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే

Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి



