త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bhadrachalam | గ‌ర్భిణి ప్రాణం తీసిన మూఢ‌న‌మ్మ‌కం.. భూత‌వైద్యుడి నిర్వాకంతో క‌డుపులోని బిడ్డ మృతి

Bhadrachalam | మూఢ న‌మ్మ‌కానికి (Superstition) ఓ గ‌ర్భిణి బ‌లైంది. భూత‌వైద్యుడి (Faith Healer) నిర్వాకంతో లోకం చూడ‌కుండానే త‌ల్లి క‌డుపులోనే బిడ్డ మృతిచెందింది. ఈ ఘ‌ట‌న భ‌ద్రాచలంలో (Bhadrachalam) చోటుచేసుకున్న‌ది.

G

Telangana | Published On Jul 18, 2026, 7.19 am IST

Bhadrachalam | గ‌ర్భిణి ప్రాణం తీసిన మూఢ‌న‌మ్మ‌కం.. భూత‌వైద్యుడి నిర్వాకంతో క‌డుపులోని బిడ్డ మృతి
Advertisement

Bhadrachalam | త్రినేత్ర‌.న్యూస్‌: మూఢ న‌మ్మ‌కానికి (Superstition) ఓ గ‌ర్భిణి బ‌లైంది. భూత‌వైద్యుడి (Faith Healer) నిర్వాకంతో లోకం చూడ‌కుండానే త‌ల్లి క‌డుపులోనే బిడ్డ మృతిచెందింది. ఈ ఘ‌ట‌న భ‌ద్రాచలంలో (Bhadrachalam) చోటుచేసుకున్న‌ది. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని సుక్మా జిల్లా కుంట మండ‌లం మారాయిగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీ మ‌హిళ కుర‌సం హెన్కి (35) ఆరు నెల‌ల గ‌ర్భిణి. ఇటీవ‌ల ఆమె మెడ‌, ముఖంపై వాపు వ‌చ్చింది. దీంతో కుటుంబ స‌భ్యులు ఆమెను ఆ గ్రామ సమీపంలోని భూత వైద్యుడి (ఆదివాసీలు వీరిని వెజ్జి, బుగ్గి వడ్డే, వడ్డే అని పిలుస్తారు) వద్దకు తీసుకెళ్లారు.

మెడ వాపు తగ్గిస్తానని చెప్పిన అత‌డు (Exorcist) వైద్యం పేరుతో హెన్కీ మెడపై పళ్లతో గట్టిగా కొరికాడు. దీంతో ఆమె స్పృహ కోల్పోయింది. ఆందోళ‌న‌తో వెంటనే ఓ ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. అత‌డు పెద్దాసుప‌త్రికి తీసుకెళ్లాల‌ని సూచించ‌డంతో భద్రాచలం ప్రభుత్వ ద‌వాఖానలో చేర్చారు. అప్పటికే ఆమె పరిస్థితి విష‌మంగా ఉండ‌టంతో వైద్యులు ఇన్‌ట్యూబేషన్‌ పద్ధతి ద్వారా కృత్రిమ శ్వాస అందిస్తూ ఐసీయూలో చేర్చి వైద్యం అందించారు. బుధవారంనాడు వైద్యులు ఆమె కోలుకుంటోందన్నారు. కానీ గురువారం అర్ధరాత్రి దాటాక ఆరోగ్యం విషమించ‌డంతో హెన్కీ మృతి చెందింది.

Advertisement
Advertisement