Bhadrachalam | భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక
Bhadrachalam | గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో నదికి వరద పోటెత్తింది. ఎగువ నుంచి వస్తున్న వరదలతో భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి నది ఉగ్రరూపం (Godavari River) దాల్చింది.
Bhadrachalam | త్రినేత్ర.న్యూస్: గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో నదికి వరద పోటెత్తింది. ఎగువ నుంచి వస్తున్న వరదలతో భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి నది ఉగ్రరూపం (Godavari River) దాల్చింది. శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలకు నదీ ప్రవాహం 53 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మూడో ప్రమాద (చివరి) హెచ్చరిక జారీ చేశారు. శనివారం ఉదయానికి అది 55.1 అడుగులకు చేరింది. వరద మరింత పెరిగే అవకాశం ఉండటతో అధికారులు అప్రమత్తమయ్యారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. వరద నీటిమట్టం పెరగటంతో దుమ్ముగూడెం-భద్రాచలం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల వద్ద స్నానఘట్టాలు నీట మునిగాయి. సీతవాగు వద్ద సీతమ్మ నారచీరలు, స్వామివారి సింహాసనం, ఐరన్ ఫుట్ బ్రిడ్జి నీటమునిగాయి. చర్లలోని తూరుబాక ఆర్‌అండ్‌బీ ప్రధాన రహదారిపై ఇటీవల నిర్మించిన హైలెవల్ వంతెన ఇరువైపులా అప్రోచ్‌లు కోతకు గురై ప్రమాదకరంగా తయారయ్యాయి. వరద ఉద్ధృతితో పలు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు, కూనవరం, వీఆర్‌పురం మండలాలకు రాకపోకలు స్తంభించాయి.
తాజావార్తలు
- ●LPG Cylinder Price | వరుసగా రెండో నెల.. తగ్గిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర
- ●BRS USA | పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం.. బీఆర్ఎస్ యూఎస్ఏ దిగ్భ్రాంతి
- ●PM KISAN | ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి మరో ఐదేండ్లు పొడిగింపు..
- ●Horoscope | ఆగస్టు 1 రాశి ఫలాలు.. ఈ రాశివారు నష్టపోయే ప్రమాదం ఉంది!
- ●Malayalam OTT | ఓటీటీలోకి లోకేష్ కనగరాజ్ మలయాళం మూవీ - అల్లు అర్జున్ పుష్ప తో కంపేరిజన్స్
- ●Godavari Floods | గోదావరి వరద ఉద్ధృతిపై అప్రమత్తం.. కలెక్టర్‌కు మంత్రి పొంగులేటి ఆదేశాలు..

LPG Cylinder Price | వరుసగా రెండో నెల.. తగ్గిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర

BRS USA | పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం.. బీఆర్ఎస్ యూఎస్ఏ దిగ్భ్రాంతి

PM KISAN | ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి మరో ఐదేండ్లు పొడిగింపు..

Horoscope | ఆగస్టు 1 రాశి ఫలాలు.. ఈ రాశివారు నష్టపోయే ప్రమాదం ఉంది!






