త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

New Pensions | చేయూత పింఛ‌న్ల‌కు ద‌ర‌ఖాస్తులు షురూ.. 15 నుంచి కొత్త పెన్ష‌న్లు

New Pensions | రాష్ట్రంలో కొత్త పింఛ‌న్ల (New Pensions) కోసం ఎదురుచూస్తున్న వారికి ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ నెల 15 నుంచి కొత్త పెన్ష‌న్లు మంజూరు చేయాలని స‌ర్కార్ నిర్ణ‌యించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో చేయూత పింఛన్ల (Cheyutha Pensions) కోసం శ‌నివారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న‌ట్లు ప్రకటించింది.

G

Telangana | Published On Aug 8, 2026, 8.45 am IST

New Pensions | చేయూత పింఛ‌న్ల‌కు ద‌ర‌ఖాస్తులు షురూ.. 15 నుంచి కొత్త పెన్ష‌న్లు
Advertisement

New Pensions | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో కొత్త పింఛ‌న్ల (New Pensions) కోసం ఎదురుచూస్తున్న వారికి ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ నెల 15 నుంచి కొత్త పెన్ష‌న్లు మంజూరు చేయాలని స‌ర్కార్ నిర్ణ‌యించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో చేయూత పింఛన్ల (Cheyutha Pensions) కోసం శ‌నివారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న‌ట్లు ప్రకటించింది. ఈమేర‌కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ద‌ర‌ఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, చివరి తేదీ లేదని స్పష్టం చేసింది. ఇప్ప‌టికే దరఖాస్తు చేసిన వారు మళ్లీ చేయాల్సిన అవసరం లేదని తెలిపింది. అయితే అధికారుల వద్ద ఒకసారి నిర్ధారించుకోవాలని సూచించింది.

ఒంటరి మహిళలు, వితంతువులు, గీత, చేనేత కార్మికులు, పైలేరియా అంటే బోదకాలు, డయాలసిస్ బాధితులు, దివ్యాంగుల కేటగిరీలో తలసేమియా, సికిల్ సెల్, హీమోఫీలియా బాధితులకు ప్రాధాన్య క్రమంలో పింఛన్లు మంజూరు చేయనుంది.

అర్హులు ఎవ‌రంటే..

ల‌బ్ధిదారుల అర్హ‌త‌ల‌ను కూడా తాజా ఉత్త‌ర్వుల్లో ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. గ్రామాల్లో రూ.లక్షా 50 వేలు, పట్టణాల్లో రూ.2 లక్షల కంటే తక్కువ వార్షికాదాయం ఉన్న వారు అర్హులని పేర్కొంది. అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారు, మూడెకరాల కంటే ఎక్కువ మాగాణి, 7.5 ఎకరాల కంటే ఎక్కువ మెట్ట పొలం ఉన్న వారు అనర్హులని స్ప‌ష్టం చేసింది. అదేవిధంగా ప్రభుత్వ రంగ, ప్రైవేటు, ఔట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్ట్ ఉద్యోగులు, డాక్టర్లు, కాంట్రాక్టర్లు, వృత్తి నిపుణులు, ఆయిల్, రైస్ మిల్లులు, పెట్రోల్ పంపులు, రిగ్ యజమానులు, వారి తల్లిదండ్రులు, 4 చక్రాల వాహనాలు, భారీ వాహనాలు ఉన్న వారు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అర్హులు కాద‌ని వెల్ల‌డించింది.

Advertisement
Advertisement