త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Road Accident | నియో పోలీస్ వ‌ద్ద‌ బ్రిడ్జి పిల్ల‌ర్‌ను ఢీకొట్టిన కారు.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం

Road Accident | ఔటర్ రింగ్ రోడ్డు (ORR) సర్వీస్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. అతివేగంగా దూసుకొచ్చిన కారు అదుపుత‌ప్పి బ్రిడ్జి పిల్ల‌ర్‌ను ఢీకొట్టింది. దీంతో ఇద్ద‌రు అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించారు. ఈ ఘ‌ట‌న శుక్రవారం అర్థరాత్రి దాటిన త‌ర్వాత గ‌చ్చిబౌలి ప‌రిధిలోని నియో పోలీస్ (Neo Police) వ‌ద్ద జ‌రిగింది.

G

Hyderabad | Published On Aug 8, 2026, 10.11 am IST

Road Accident | నియో పోలీస్ వ‌ద్ద‌ బ్రిడ్జి పిల్ల‌ర్‌ను ఢీకొట్టిన కారు.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం
Advertisement

Road Accident | త్రినేత్ర‌.న్యూస్‌: ఔటర్ రింగ్ రోడ్డు (ORR) సర్వీస్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. అతివేగంగా దూసుకొచ్చిన కారు అదుపుత‌ప్పి బ్రిడ్జి పిల్ల‌ర్‌ను ఢీకొట్టింది. దీంతో ఇద్ద‌రు అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించారు. ఈ ఘ‌ట‌న శుక్రవారం అర్థరాత్రి దాటిన త‌ర్వాత గ‌చ్చిబౌలి ప‌రిధిలోని నియో పోలీస్ (Neo Police) వ‌ద్ద జ‌రిగింది.

రాజ‌స్థాన్‌కు (Rajasthan) చెందిన క‌నైయాలాల్, దేరామ్ కొల్లూరు ప‌రిధిలోని ఇంద్రారెడ్డి న‌గ‌ర్‌లో ఉంటున్నారు. టైల్స్ ప‌నిచేసుకుంటూ జీవ‌నం సాగిస్తున్నారు. శుక్ర‌వారం అర్ధ‌రాత్రి ఇద్ద‌రు క‌లిసి కారులో (AP01AB2232) ఇంద్రారెడ్డి న‌గ‌ర్ నుంచి నాన‌క్‌రామ్‌గూడ బ‌య‌ల్దేరారు. ఈ క్ర‌మంలో నియోపోలీస్ బ్రిడ్జి స‌మీపంలో కారు అదుపుత‌ప్పి రోడ్డుప‌క్క‌నే ఉన్న బ్రిడ్జి పిల్ల‌ను ఢీకొట్టింది. దీంతో కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. తీవ్రంగా గాయ‌ప‌డిన ఇద్ద‌రు ఘ‌ట‌నా స్థ‌లంలోనే మ‌ర‌ణించారు. ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. ప్ర‌మ‌దానికి అతివేగ‌మే కార‌ణ‌మ‌ని నిర్ధారించారు. కేసు న‌మోదుచేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

బంజారాహిల్స్ రోడ్‌ నం.10లో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌లో బంజారాహిల్స్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రోడ్‌ నం.10లో ఉన్న ఓ భవనం సెల్లార్‌లో మంటలు చేల‌రేగాయి. దీంతో ఆ ప్రాంతంలో ద‌ట్ట‌మైన పొగ క‌మ్ముకున్న‌ది. స‌మాచారం అందుకున్న ఫైర్​ సిబ్బంది ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని.. నాలుగు ఫైర్ ఇంజిన్ల‌తో మంట‌లు ఆర్పేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. భ‌వ‌నంలోని 11 మందిని కాపాడారు. భ‌వ‌నం సెల్లార్‌లో వైన్‌షాప్ గోదాము నిర్వ‌హిస్తున్న‌ట్లు గుర్తించారు.

Advertisement
Advertisement