Telangana Elections | ప్రీ ఫైనల్ పోల్స్..
Telangana Elections | ఖైరతాబాద్ ఉప ఎన్నిక.. హైదరాబాద్, మేడ్చల్, సైబరాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు.. మరో 6 మున్సిపాలిటీలు.. రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల ఎన్నికలు.. ఇలా.. 2027 జనవరి నుంచి ప్రీ ఫైనల్ పోల్ సందడి ప్రారంభం కానున్నది. అయితే.. శాసనసభ ఎన్నికలు 2028లో ఆఖరులో గనుక జరిగే అవకాశం ఉంటే.. 2027లో జరిగే ఈ పోల్స్‌ను రాష్ట్రంలోని అధికార, విపక్షాలు ప్రీఫైనల్‌గా భావించే అవకాశం ఉన్నది.
వచ్చే జనవరి నుంచి.. ఎన్నికల సందడి
మార్చిలోపు ఖైరతాబాద్ బై పోల్
అదే నెలలో.. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికలు
ఆ తర్వాత లేదా ఆ లోపు
5 కార్పొరేషన్ల ఎన్నికలు
సర్ ప్రక్రియ పూర్తైతే..
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు మోక్షం
ఫైనల్ ఎన్నికలకు ముందు జరిగే
పోల్స్‌కు సిద్ధమవుతున్న ఆయా పార్టీలు
Telangana Elections | త్రినేత్ర న్యూస్ : ఖైరతాబాద్ ఉప ఎన్నిక.. హైదరాబాద్, మేడ్చల్, సైబరాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు.. మరో 6 మున్సిపాలిటీలు.. రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల ఎన్నికలు.. ఇలా.. 2027 జనవరి నుంచి ప్రీ ఫైనల్ పోల్ సందడి ప్రారంభం కానున్నది. అయితే.. శాసనసభ ఎన్నికలు 2028లో ఆఖరులో గనుక జరిగే అవకాశం ఉంటే.. 2027లో జరిగే ఈ పోల్స్‌ను రాష్ట్రంలోని అధికార, విపక్షాలు ప్రీఫైనల్‌గా భావించే అవకాశం ఉన్నది.
యూపీ ఎన్నికలతో పాటు ఖైరతాబాద్?
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటిస్తూ సుప్రీం కోర్టు కూడా తీర్పు ఇచ్చింది. దీంతో ఖైరతాబాద్ సీటు ఖాళీ అయ్యింది. అయితే.. ఈ స్థానానికి ఉపఎన్నిక జరగాలంటే.. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ (సర్) పూర్తి కావాలి. సర్ షెడ్యూల్ ప్రకారం.. నవంబరు 9న ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో ఎన్నిక నిర్వహణకు 6 నెలల సమయం ఉంటుంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల శాసన సభల పదవీకాలం 2027 ఫిబ్రవరి-మార్చిలో ముగియనుంది. ఈ 5 రాష్ట్రాలతో పాటు.. ఖైరతాబాద్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ కూడా వెలువడనుంది.
మార్చిలో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికలు
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్, వరంగల్-ఖమ్మం-నల్లగొండ జిల్లాల ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ల పదవీ కాలం 2027 మార్చితో ముగియనుంది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా మార్చిలోనే జరిగే అవకాశం ఉంది. ఈ రెండు స్థానాలకు సంబంధించి కొత్తగా ఓటు నమోదు ప్రక్రియ కూడా సెప్టెంబరు 28 నుంచి ప్రారంభం కానుంది. నవంబరు 6 వరకు ఓటరుగా నమోదు చేసుకునేలా రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటరు నమోదు షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మేరకు వరంగల్-ఖమ్మం-నల్లగొండ స్థానానికి కాంగ్రెస్ పార్టీ.. ప్రస్తుతం ఆర్టీఐ కమిషనర్గా పని చేస్తున్న పీవీ శ్రీనివాస రావు అభ్యర్థిత్వాన్ని దాదాపుగా ఖరారు చేసింది. బీఆర్ఎస్ కూడా ఏనుగుల రాకేశ్ రెడ్డిని పోటీలో నిలిపింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది.
5 కార్పొరేషన్లు.. జెడ్పీటీసీ.. ఎంపీటీసీ
ఇటీవలే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీని మూడు కొత్త కార్పొరేషన్లుగా విభజించిన విషయం తెలిసిందే. వీటితో పాటు వరంగల్, ఖమ్మం కలిపి మొత్తం 5 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అంతే కాదు.. చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న జెడ్పీటీసీ..ఎంపీటీసీ ఎన్నికలకు సైరన్ ఇంకా మోగలేదు. సర్ ప్రక్రియ పూర్తైతే తప్ప సరికొత్త ఓటరు జాబితా సిద్ధం కాదు కాబట్టి.. ఈ ఎన్నికలన్నీ అప్పటివరకు వాయిదా పడ్డాయి. వీటితో పాటు.. కోర్టు కేసుల కారణంగా.. వాయిదా పడిన మణగూరు, మందమర్రి, అచ్చంపేట, నకిరేకల్, కొత్తూరు, సిద్ధిపేట మున్సిపాలిటీలకు కూడా వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి.
కంటోన్మెంట్.. జూబ్లీహిల్స్.. ఖైరతాబాద్
శాసన సభ ఎన్నికలు 2028 డిసెంబరులో గానీ 2029 మార్చిలో గానీ జరిగే అవకాశం ఉన్నందున.. 2027లో జరిగే ఈ ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నాయి. ప్రధానంగా అందరి చూపు ఖైరతాబాద్ పైనే ఉంది. బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ 5 చోట్ల, బీజేపీ 2 చోట్ల విజయం సాధించాయి. 2016 నుంచి 2022 మధ్య నారాయణ్ ఖేడ్ (2016), పాలేరు (2016), హుజూర్ నగర్ (2019), దుబ్బాక (2020), నాగార్జున సాగర్ (2021), హుజూరాబాద్ (2021), మునుగోడు (2022) స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. దుబ్బాక, హుజూరాబాద్‌లలో బీజేపీ గెలిస్తే మిగిలిన స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకున్నది. కాగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కంటోన్మెంట్, జూబ్లీహిల్స్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలను కోల్పోయింది. వాటిని కాంగ్రెస్ దక్కించుకున్నది. ఇదే క్రమంలో ప్రస్తుతం రానున్న ఖైరతాబాద్ ఉప ఎన్నికలో విజయం కోసం బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Pitru Paksha 2026 | పితృపక్షం 2026.. ఈ 15 రోజులు ఇవి పాటించాలి..
- ●CM Revanth Reddy | ఐలమ్మ స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం.. సామాజిక న్యాయమే లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి
- ●Anumana pakshi Review | అనుమాన పక్షి రివ్యూ - డీజే టిల్లు డైరెక్టర్ తీసిన కామెడీ మూవీ ఎలా ఉందంటే?
- ●Junior Civil Courts | తెలంగాణలో కొత్తగా 200 జూనియర్ సివిల్ కోర్టులు.. ఆమోదం తెలిపిన సర్కారు..
- ●Revanth Reddy | గాంధీ పరివార్ కోసం ప్రాణం కూడా త్యాగం చేస్తా
- ●హాఫ్‌టైమ్ ముగిసింది.. కేసీఆర్ సైలెంట్ మోడ్ పార్టీకి ప్లస్సా? మైనస్సా?

Pitru Paksha 2026 | పితృపక్షం 2026.. ఈ 15 రోజులు ఇవి పాటించాలి..

CM Revanth Reddy | ఐలమ్మ స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం.. సామాజిక న్యాయమే లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి

Anumana pakshi Review | అనుమాన పక్షి రివ్యూ - డీజే టిల్లు డైరెక్టర్ తీసిన కామెడీ మూవీ ఎలా ఉందంటే?

Junior Civil Courts | తెలంగాణలో కొత్తగా 200 జూనియర్ సివిల్ కోర్టులు.. ఆమోదం తెలిపిన సర్కారు..






