Chiranjeevi | సంకల్ప సాధకుడు కల్యాణ్ బాబు.. తమ్ముడిపై చిరంజీవి ప్రశంసల జల్లు
Chiranjeevi | పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పవన్ వ్యక్తిత్వం, నిబద్ధత, ప్రజాసేవపై ఉన్న తపనను ప్రస్తావిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు.
Entertainment | Published On Sep 2, 2026, 2.32 pm IST
Chiranjeevi | పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పవన్ వ్యక్తిత్వం, నిబద్ధత, ప్రజాసేవపై ఉన్న తపనను ప్రస్తావిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. ‘సంకల్ప సాధకుడు కళ్యాణ్‌బాబు’ అంటూ తమ్ముడిని సంబోధించిన చిరంజీవి.. ప్రజల కోసం పనిచేయాలనే తపన చిన్నప్పటి నుంచే ఆయనలో కనిపించేదని పేర్కొన్నారు. ‘‘నిబద్ధత నిండిన ప్రేమ, బాధ్యతతో కూడిన సంకల్పం, అనుక్షణం ప్రజలకు మంచి చేయాలనే చిత్తశుద్ధి.. ఇవన్నీ మా కళ్యాణ్‌బాబులో చిన్నప్పటి నుంచీ చూస్తున్నాను. తాను చేసే ప్రతి పనిలో పూర్తిగా నిమగ్నమవుతూ, ప్రతి అడుగూ పదిమందికి మేలు చేయాలనే తపనతో వేస్తాడు’’ అని చిరంజీవి తెలిపారు.
కుటుంబంపై చూపించే ప్రేమను తనను నమ్మిన ప్రజలపైనా పవన్ చూపిస్తారని అన్నారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గ్రామాల అభివృద్ధి, గిరిజన ప్రాంతాల అభ్యున్నతి, పర్యావరణ పరిరక్షణ, ప్రజల మౌలిక అవసరాల కల్పన కోసం అంకితభావంతో పనిచేస్తున్నారని ప్రశంసించారు. పాలనలో తనదైన ముద్ర వేస్తున్న తీరు తనకు ఆనందం, గర్వాన్ని కలిగిస్తోందని పేర్కొన్నారు. ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని పలు సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపిస్తూ అభివృద్ధిని మారుమూల ప్రాంతాలకూ తీసుకెళ్తున్నారని చిరంజీవి అన్నారు.
తనను గెలిపించిన పిఠాపురం ప్రజలకు ప్రజాప్రతినిధిగా మాత్రమే కాకుండా కుటుంబ సభ్యుడిలా పవన్ అండగా నిలుస్తున్నారని కొనియాడారు. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించే పవన్‌కల్యాణ్.. తెలుగు ప్రజలందరూ మెచ్చే నాయకుడిగా తన భవిష్యత్ లక్ష్యాలను చేరుకోవాలని చిరంజీవి ఆకాంక్షించారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవిస్తూ మరింత శక్తితో ప్రజాసేవకు పునరంకితం కావాలని ఇలవేల్పు శ్రీ ఆంజనేయస్వామిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. చివరగా ‘మా కళ్యాణ్‌బాబుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ తన సందేశాన్ని ముగించారు.
సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు..@PawanKalyan
నిబద్ధత నిండిన ప్రేమ, బాధ్యతతో కూడిన సంకల్పం, అనుక్షణం ప్రజలకు మంచి చేయాలనే చిత్తశుద్ధి, ఇవన్నీ మా కళ్యాణ్ బాబులో చిన్నప్పటి నుంచీ చూస్తున్నాను. తాను చేసే ప్రతి పనిలో పూర్తిగా నిమగ్నమవుతూ, తన ప్రతి అడుగూ పదిమందికి మేలు చేయాలనే తపనతో… pic.twitter.com/FEFdNToZ9a
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 2, 2026
సంబంధిత వార్తలు

Tollywood | మందమర్రి నుంచి చంద్రయాన్‌కు – తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో కామెడీ మూవీ
సెప్టెంబర్ 4, 2026

Rambha Oorvasi Menaka Review | రంభ ఊర్వశి మేనక రివ్యూ – విష్ణుప్రియ, రాశీసింగ్లతో అల్లరి నరేష్ చేసిన సినిమా ఎలా ఉందంటే?
సెప్టెంబర్ 4, 2026

Heavy Rain In Delhi | జన్మాష్టమి వేళ ఢిల్లీకి భారీ వర్షం.. ఎయిర్‌పోర్ట్‌లోకి నీరు.. తొమ్మిది విమానాలు దారి మళ్లింపు
సెప్టెంబర్ 4, 2026
తాజావార్తలు
- ●Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు
- ●Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..
- ●Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
- ●CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి
- ●KRMB | తాగు నీటి అవసరాలకే నీటిని వినియోగించాలి.. కేఆర్ఎంబీ ఆదేశాలు
- ●CM Revanth Reddy | హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు

Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..

Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి



