త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar | ఒక్క ప‌ట్ట‌భ‌ద్రుని ఓటు మిస్స‌వ్వొద్దు.. కొత్త ఓట‌ర్ల‌పై ప్ర‌త్యేక దృష్టి పెడ‌దాం

Ponnam Prabhakar | ఒక్క ప‌ట్ట‌భ‌ద్రుని ఓటు (Graduates Voters) మిస్ కాకుండా చూడాల‌ని.. కొత్తగా అర్హ‌త పొందిన యువ‌త‌పై ప్ర‌త్యేక దృష్టి పెట్టాల‌ని ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ (Ponnam Prabhakar) సూచించారు.

S

Telangana | Published On Oct 22, 2026, 5.02 pm IST

Ponnam Prabhakar | ఒక్క ప‌ట్ట‌భ‌ద్రుని ఓటు మిస్స‌వ్వొద్దు.. కొత్త ఓట‌ర్ల‌పై ప్ర‌త్యేక దృష్టి పెడ‌దాం
Advertisement
  • పురోగ‌తిని ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షించుకోవాలి
  • పార్టీ అభ్య‌ర్థి గెలుపున‌కు బాట‌లు వేయాలి
  • హైదరాబాద్ జిల్లా ముఖ్య నేతల సన్నాహక సమావేశంలో పొన్నం ప్ర‌భాక‌ర్‌

Ponnam Prabhakar | త్రినేత్ర న్యూస్‌: ఒక్క ప‌ట్ట‌భ‌ద్రుని ఓటు (Graduates Voters) మిస్ కాకుండా చూడాల‌ని.. కొత్తగా అర్హ‌త పొందిన యువ‌త‌పై ప్ర‌త్యేక దృష్టి పెట్టాల‌ని ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ (Ponnam Prabhakar) సూచించారు. హైదరాబాద్ జంట నగరాల్లో ఉన్న పట్టభద్రులందరూ వెంటనే తమ ఓటు హక్కును న‌మోదు చేసుకునేలా నియోజకవర్గ ఇంచార్జిలు అవగాహన కల్పించాలని చెప్పారు. న‌గ‌ర పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అర్హులైన పట్టభద్రులందరినీ గుర్తించి ఓటరుగా నమోదు చేయించేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో డివిజన్ స్థాయి నాయకులు, కార్యకర్తలు బాధ్యత తీసుకోవాలని కోరారు. నాంపల్లి రెడ్‌రోజ్ గార్డెన్‌లో హైదరాబాద్-రంగారెడ్డి- మ‌హబూబ్‌నగర్ జిల్లాల పట్టభద్రుల ఎన్నికలపై గురువారం నిర్వ‌హించిన‌ హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల సన్నాహక సమావేశంలో ఆయ‌న ముఖ్య అతిథిగా హాజ‌రై ప్ర‌సంగించారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ఓటు నమోదు చేపట్టాలి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలంటే అర్హులైన పట్టభద్రులు తప్పనిసరిగా ఓటు న‌మోదు చేసుకోవాలి. గతంలో ఓటరుగా నమోదైనవారు కూడా ఎన్నికల నిబంధనల ప్రకారం తమ నమోదు వివరాలను పరిశీలించుకోవాలి. కొత్తగా అర్హత పొందిన పట్టభద్రులు, యువత ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలి.

విద్యా సంస్థలు, యువజన, ఉద్యోగ సంఘాలు పట్టభద్రులతో సమన్వయం చేసుకుంటూ నమోదు ప్రక్రియను విస్తృతంగా చేపట్టాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యంతో తీసుకోవాలి. నియోజకవర్గాల వారీగా బాధ్యతలు అప్పగించి, ఓటరు నమోదు పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలి. అర్హులైన ఒక్క పట్టభద్రుడు కూడా ఓటరు నమోదుకు దూరం కాకుండా చూడాలి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.

సామా రామ్మోహ‌న్‌రెడ్డిని గెలిపించుకోవాలి

ఓటరు నమోదు కార్యక్రమాన్ని సమష్టి బాధ్యతగా భావించి, సమయం తక్కువగా ఉన్నందున వేగవంతంగా పూర్తి చేయాలి. పార్టీ శ్రేణులంతా ఐక్యంగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ విజయానికి బాటలు వేయాలి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సామాజిక కార్యకర్తలు పట్టభద్రులను కలిసి ఓటు నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలి. ప్రతి శాసనసభ నియోజకవర్గం పరిధిలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని నిర్ణయించాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి, పట్టభద్రుల సమస్యలను శాసనమండలిలో బలంగా వినిపించడానికి పట్టభద్రుల ఓటు హక్కు ఎంతో కీలకం. పట్టభద్రుల సమస్యలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా సామా రామ్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిపించేందుకు పార్టీ శ్రేణులంతా సమష్టిగా కృషి చేయాలి అని పొన్నం కోరారు.

ఈ సమావేశంలో మంత్రి అజారుద్దీన్, ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు నవీన్ యాదవ్, శ్రీ గణేష్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఖైరతాబాద్, సికింద్రాబాద్, హైదరాబాద్ జిల్లాల అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్ లు, 15 అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జిలు, పీసీసీ కోఆర్డినేటర్ లు, పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ లు, అనుబంధ సంఘాల నేతలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement