Tummala Nageshwar Rao | నేల తల్లిని సంరక్షించుకోవాలి
Tummala Nageshwar Rao | నేల తల్లిని సంరక్షించుకుంటేనే భవిష్యత్ తరాలకు ఆహార భద్రత కల్పించగలమని, భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోకుండా వ్యవసాయంలో ఆశించిన దిగుబడులు సాధించడం సాధ్యం కాదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
పంటల సాగులో మార్పులు చేసుకోవాలి
సేంద్రీయ సేద్యం వైపు రైతులను ప్రోత్సహించాలి
పంట వ్యర్థాలను కాల్చొద్దు.. మల్చింగ్‌కు వినియోగించాలి..
నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు
Tummala Nageshwar Rao | త్రినేత్ర న్యూస్ : నేల తల్లిని సంరక్షించుకుంటేనే భవిష్యత్ తరాలకు ఆహార భద్రత కల్పించగలమని, భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోకుండా వ్యవసాయంలో ఆశించిన దిగుబడులు సాధించడం సాధ్యం కాదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నేల సారాన్ని పరిరక్షించడం, పంట భూములను సంరక్షించడం, ప్రకృతి వనరులను సమర్థవంతంగా వినియోగించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలని పిలుపునిచ్చారు. రైతుల సంక్షేమంతో పాటు భవిష్యత్ వ్యవసాయాన్ని దృష్టిలో పెట్టుకొని భూసార పరిరక్షణకు ప్రాధాన్యతనివ్వాలని స్పష్టం చేశారు.

గురువారం నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఖేత్ బచావో అభియాన్’ (సాగు భూమి సంరక్షణ) కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వ్యవసాయ భూముల పరిరక్షణ, భూసార పరీక్షలు, నీటి పొదుపు, వాతావరణ మార్పులకు అనుగుణంగా పంటల ఎంపిక, సేంద్రీయ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం, పంట వ్యర్థాల నిర్వహణ తదితర అంశాలపై రైతులకు కీలక సూచనలు చేశారు. భవిష్యత్ తరాలకు సారవంతమైన భూములను అందించాలంటే వ్యవసాయ పద్ధతుల్లో శాస్త్రీయ మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక
ఎల్‌నినో ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉందని, రుతుపవనాల తగ్గుదల, భూతాపం పెరుగుదల, వర్షపాతం అసమానతలు, వర్షాలు సకాలంలో కురవకపోవడం వంటి పరిస్థితులు వ్యవసాయంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని వివరించారు. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు పంటల సాగులో ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని, అందుబాటులో ఉన్న నీటి వనరులు, భూమి స్వభావం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు.
వ్యవసాయ భూమికి భూసార పరీక్షలు
రైతులు రసాయన ఎరువులు, పురుగుమందులను అవసరానికి మించి వినియోగించకుండా వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించిన మోతాదుల్లోనే ఉపయోగించాలని మంత్రి స్పష్టం చేశారు. ప్రతి రైతు తప్పనిసరిగా తన వ్యవసాయ భూమికి భూసార పరీక్షలు చేయించుకోవాలని మంత్రి కోరారు. నేలలో ఉన్న పోషకాల స్థాయిని తెలుసుకొని, ఏ పంటకు ఎలాంటి ఎరువులు ఎంత మోతాదులో అవసరమో నిర్ధారించుకున్న తర్వాతే వాటిని వినియోగించాలని సూచించారు. రైతులను సేంద్రీయ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం వైపు ప్రోత్సహించడంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు కీలక పాత్ర పోషించాలని మంత్రి పేర్కొన్నారు.
ప్రతి నీటి చుక్కను సమర్థవంతంగా వినియోగించాలి
డ్రిప్ ఇరిగేషన్ వంటి సూక్ష్మ సేద్య పద్ధతులను విస్తృతంగా ప్రోత్సహించాలని, ప్రతి నీటి చుక్కను సమర్థవంతంగా వినియోగించే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. రైతులు పెట్టుబడి వ్యయం తగ్గించడం, నీటిని ఆదా చేయడం, పంటకు మార్కెట్‌లో లభించే ధర, నికర ఆదాయం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని వ్యవసాయం చేయాలని సూచించారు.
నేలలో తేమ నిల్వ ఉండేలా చర్యలు
పంట కోతల అనంతరం మిగిలే వ్యర్థాలను కాల్చివేయడం వల్ల నేలలోని ఉపయోగకరమైన సూక్ష్మజీవులకు నష్టం కలగడంతో పాటు గాలి కాలుష్యం పెరిగే ప్రమాదం ఉందని మంత్రి తెలిపారు. పంట వ్యర్థాలను కాల్చకుండా వాటిని మల్చింగ్‌కు వినియోగించాలని, నేలలో తేమ నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఖేత్ బచావో అభియాన్‌ను కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా, వ్యవసాయ భూముల పరిరక్షణకు నిరంతరం కొనసాగాల్సిన ఉద్యమంగా తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.
సంబంధిత వార్తలు

Chamala Kirankumar Reddy | కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు నీటి మళ్లింపుపై విచారణ జరపండి: ఇరిగేషన్ శాఖ కార్యదర్శికి ఎంపీ చామల లేఖ
అక్టోబర్ 22, 2026

Aadhaar Authentication to TDR Portal | టీడీఆర్ పోర్టల్‌కు ఆధార్ అథెంటికేషన్.. ఉత్తర్వులు జారీ
అక్టోబర్ 22, 2026

Harish Rao | అధికారులను కాదు.. సీఎంను సస్పెండ్ చేయాలి
అక్టోబర్ 22, 2026
తాజావార్తలు
- ●Raihan Vadra | ప్రియాంక గాంధీ కుమారుడి ఫొటో ఎగ్జిబిషన్‌పై వివాదం.. స్పందించిన బికనేర్ హౌస్
- ●Chamala Kirankumar Reddy | కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు నీటి మళ్లింపుపై విచారణ జరపండి: ఇరిగేషన్ శాఖ కార్యదర్శికి ఎంపీ చామల లేఖ
- ●Stock Markets | వరుసగా మూడో రోజూ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 460 పాయింట్లు డౌన్..
- ●Web Series | ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ - తల లేని డెడ్‌బాడీ మిస్టరీతో...
- ●Aadhaar Authentication to TDR Portal | టీడీఆర్ పోర్టల్‌కు ఆధార్ అథెంటికేషన్.. ఉత్తర్వులు జారీ
- ●Harish Rao | అధికారులను కాదు.. సీఎంను సస్పెండ్ చేయాలి

Raihan Vadra | ప్రియాంక గాంధీ కుమారుడి ఫొటో ఎగ్జిబిషన్‌పై వివాదం.. స్పందించిన బికనేర్ హౌస్

Chamala Kirankumar Reddy | కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు నీటి మళ్లింపుపై విచారణ జరపండి: ఇరిగేషన్ శాఖ కార్యదర్శికి ఎంపీ చామల లేఖ

Stock Markets | వరుసగా మూడో రోజూ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 460 పాయింట్లు డౌన్..

Web Series | ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ - తల లేని డెడ్‌బాడీ మిస్టరీతో...



