త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chamala Kirankumar Reddy | కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు నీటి మ‌ళ్లింపుపై విచార‌ణ జ‌ర‌పండి: ఇరిగేష‌న్ శాఖ కార్య‌ద‌ర్శికి ఎంపీ చామ‌ల లేఖ‌

Chamala Kirankumar Reddy | కొండపోచ‌మ్మ సాగ‌ర్ ప్రాజెక్టు (Kondapochamma Sagar Project) నుంచి కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు మ‌ళ్లించిన నీటిపై పూర్తి స్థాయిలో విచార‌ణ జ‌ర‌పాల‌ని భువ‌న‌గిరి ఎంపీ చామ‌ల కిర‌ణ్‌కుమార్‌రెడ్డి (Chamala Kirankumar Reddy) కోరారు.

S

Telangana | Published On Oct 22, 2026, 4.28 pm IST

Chamala Kirankumar Reddy | కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు నీటి మ‌ళ్లింపుపై విచార‌ణ జ‌ర‌పండి: ఇరిగేష‌న్ శాఖ కార్య‌ద‌ర్శికి ఎంపీ చామ‌ల లేఖ‌
Advertisement

Chamala Kirankumar Reddy | త్రినేత్ర న్యూస్‌: కొండపోచ‌మ్మ సాగ‌ర్ ప్రాజెక్టు (Kondapochamma Sagar Project) నుంచి కేసీఆర్ (KCR) ఫామ్‌హౌస్‌కు మ‌ళ్లించిన నీటిపై పూర్తి స్థాయిలో విచార‌ణ జ‌ర‌పాల‌ని భువ‌న‌గిరి ఎంపీ చామ‌ల కిర‌ణ్‌కుమార్‌రెడ్డి (Chamala Kirankumar Reddy) కోరారు. ప్రాజెక్టు రికార్డుల‌ను పూర్తి స్థాయిలో ప‌రిశీలిస్తే ప్ర‌జా ధ‌నం ఎంత దుర్వినియోగం అయిందో లెక్క బ‌య‌ట‌కు వ‌స్తుంద‌న్నారు. ఈమేర‌కు ఇరిగేష‌న్ శాఖ కార్య‌ద‌ర్శి శ్రీ‌ధ‌ర్‌కు గురువారం చామ‌ల లేఖ రాశారు.

2016 తర్వాత కొండపోచమ్మ సాగర్ నుంచి పాండురంగ చెరువు వరకు ప్రత్యేక కాలువను నిర్మించినట్లు వెలుగు ప‌త్రిక‌ వార్తలో ఆరోపణలు వచ్చాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చెందిన ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో సుమారు మూడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బావి విస్తీర్ణానికి నీటిని పాండురంగ చెరువు నుంచి పంపింగ్ చేసినట్లు కూడా ఆ వార్తలో పేర్కొన్నారు.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు కొండపోచమ్మ సాగర్ నీళ్ల మళ్లింపుపై విచారణ జరపాలి. ప్రజల అవసరాల కోసం ఉపయోగించే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంను వ్యక్తిగత అవసరాల కోసం ఫామ్‌హౌస్‌కు వాడుకోవడంపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. కొండపోచమ్మ సాగర్ నుంచి పాండురంగ చెరువుకు, అక్కడి నుంచి కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు నీళ్లు తరలింపుపై వీలైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేయాలి. బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి అని చామ‌ల ఆ లేఖ‌లో డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement