త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Free MMTS Travel | ఎంఎంటీఎస్‌ రైళ్లలో ఉచిత ప్రయాణం.. ఆ ష‌ర‌తుల‌కు అంగీక‌రిస్తేనే!

Free MMTS Travel | హైద‌రాబాద్‌లో (Hyderabad) రోజురోజుకు ట్రాఫిక్ ర‌ద్దీ, కాలుష్యం పెరిగిపోతున్నాయి. ఈ స‌మ‌స్య‌ల‌కు ఫుల్‌స్టాప్ పెట్టేందుకు ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌తిపాద‌న చేసింది. ప్ర‌జార‌వాణా వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేయ‌డంలో భాగంగా ఎంఎంటీఎస్​ రైళ్ల‌లో (Free MMTS Travel) మహిళలు, పురుషులు సహా అందరికీ ఉచిత ప్రయాణం క‌ల్పించాలని నిర్ణ‌యించింది.

G

Telangana | Published On Jun 5, 2026, 6.23 am IST

Free MMTS Travel | ఎంఎంటీఎస్‌ రైళ్లలో ఉచిత ప్రయాణం.. ఆ ష‌ర‌తుల‌కు అంగీక‌రిస్తేనే!
Advertisement

Free MMTS Travel | త్రినేత్ర‌.న్యూస్‌: హైద‌రాబాద్‌లో (Hyderabad) రోజురోజుకు ట్రాఫిక్ ర‌ద్దీ, కాలుష్యం పెరిగిపోతున్నాయి. ఈ స‌మ‌స్య‌ల‌కు ఫుల్‌స్టాప్ పెట్టేందుకు ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌తిపాద‌న చేసింది. ప్ర‌జార‌వాణా వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేయ‌డంలో భాగంగా ఎంఎంటీఎస్​ రైళ్ల‌లో (Free MMTS Travel) మహిళలు, పురుషులు సహా అందరికీ ఉచిత ప్రయాణం క‌ల్పించాలని నిర్ణ‌యించింది. ఈ మేర‌కు రైల్వే శాఖ‌కు ప్ర‌తిపాద‌న‌లు పంపింది. అయితే దీనిని రైల్వే బోర్డు తిర‌స్క‌రించింది. ప్రస్తుతం ఎంఎంటీఎస్‌కు భారీ నష్టాలు వస్తున్నాయ‌ని, దీంతో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఆర్థిక భారం, భవిష్యత్ నష్టాలను భరిస్తేనే ఉచిత ప్రయాణ పథకాన్ని పరిశీలిస్తామ‌ని రైల్వే బోర్డు షరతు విధించింది.

తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వ‌మైన జూన్ 2 నుంచి ఈ పథకాన్ని ప‌ట్టాలెక్కించాల‌ని ప్ర‌భుత్వం భావించింది. దీంతో రవాణా ఖర్చులు తగ్గి ప్రజలకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుంద‌ని ఆశించింది. అయితే రాష్ట్ర‌ ప్ర‌భుత్వ ఆలోచ‌న‌కు రైల్వే బోర్డు మోకాల‌డ్డిన‌ట్ల‌యింది. మ‌రి ప్ర‌భుత్వం ఏ నిర్ణ‌యం తీసుకుంటుందో వేచి చూడాలి.

ఏడాదికి రూ.10 కోట్లు..

జూన్‌ 2వ తేదీ నుంచి ఏడాది పాటు ఈ పథకాన్ని అమలుచేయాలని ప్రభుత్వం యోచించింది. వచ్చిన ఫలితాలు ఆధారంగా కొనసాగింపుపై నిర్ణయం తీసుకోవాలని నిర్ణ‌యించింది. దీనికి సీఎం రేవంత్ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు ఇటీవల దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్‌కుమార్‌ శ్రీవాస్తవతో చర్చలు కూడా జ‌రిపారు. ప్రస్తుతం ఎంఎంటీఎస్ రైళ్ల‌ ప్రయాణికుల సంఖ్య ఆధారంగా ఏడాదికి దక్షిణ మధ్య రైల్వేకు (SCR) సుమారు రూ.10 కోట్ల ఆదాయం వ‌స్తున్న‌ట్లు అంచనా. ఉచిత ప్రయాణ పథకం అమల్లోకి వ‌స్తే పెరిగే ప్రయాణికుల సంఖ్యతో నిమిత్తం లేకుండా ప్రస్తుత ఆదాయాన్ని తాము ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం రైల్వేకు స్పష్టం చేసిన విష‌యం తెలిసిందే.

Advertisement
Advertisement