Ponguleti Srinivas Reddy | భూ సమస్యల్లో ఫలితాలు కనిపిస్తలేవ్.. పనితీరు మారకుంటే కఠిన చర్యలే
Ponguleti Srinivas Reddy | భూ సమస్యల పరిష్కారంపై ఉమ్మడి మెదక్ జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy) ఏం ఆదేశాలిచ్చారంటే?
- క్షేత్రస్థాయిలో సర్వేను పరిశీలించి రైతులకు భూమి విస్తీర్ణంపై వివరంగా చెప్పాలి
- రైతులను ఇబ్బంది పెడితే సహించం
- పెండింగ్ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించండి
- ఉమ్మడి మెదక్ జిల్లా సమీక్షా సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశం
Ponguleti Srinivas Reddy | త్రినేత్ర న్యూస్: రైతులకు సంబంధించిన భూ తగాదాల పరిష్కారం (Resolution of Land Disputes)లో ఫలితాలు కనిపిస్తలేవని.. రెవెన్యూ ఉద్యోగులు తమ పనితీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy) హెచ్చరించారు. రెవెన్యూ ఉద్యోగులు సక్రమంగా, బాధ్యతాయుతంగా పనిచేసినప్పుడే రైతుల సమస్యలు తీరుతాయన్నారు. మంగళవారం ఉమ్మడి మెదక్ జిల్లాలోని రెవెన్యూ, రిజిస్ట్రేషన్, హౌసింగ్ శాఖల పనితీరుపై సంగారెడ్డి కలెక్టరేట్‌లో మంత్రి సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు భూ రికార్డుల్లో పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం రీ సర్వే చేపట్టింది. తహసీల్దార్లు, సర్వేయర్లు సర్వే సమయంలో సంబంధిత రైతుకు తన భూమి ఎంత విస్తీర్ణంలో ఉందో స్పష్టంగా తెలియజేయాలి. భూమి విస్తీర్ణం, సరిహద్దులకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, రైతులకు ఎలాంటి సందేహాలు లేకుండా వివరించాలి.
తహసీల్దార్ నుంచి జిల్లా కలెక్టర్ వరకు రెవెన్యూ అధికారులు సర్వే ప్రక్రియను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో సర్వే పనుల పురోగతిని స్వయంగా పరిశీలిస్తూ, రైతుల సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకోవాలని ఆదేశించారు. భూ సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా, రైతులకు ఇబ్బందులు కలగకుండా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఏడాదిన్నరలోపు వ్యవసాయ భూములతో పాటు ఆబాదీ ఆస్తుల రీ సర్వేను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. తొలి దశలో ప్రతి జిల్లాలో 70 గ్రామాల్లో రీ సర్వే కొనసాగుతోందని, రీ సర్వే జరుగుతున్న గ్రామాల్లో జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలని సూచించారు.
రూ.230కే సిమెంట్ బ్యాగ్
రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల సాకారమయ్యే వరకు విడతలవారీగా ఇళ్ల మంజూరు కొనసాగుతుందని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులపై నిర్మాణ వ్యయ భారాన్ని తగ్గించేందుకు సిమెంట్ బ్యాగ్‌ను కేవలం రూ.230కే అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపులు వేగవంతంగా, పూర్తి పారదర్శకంగా, అర్హత ప్రాతిపదికన జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
సమీక్షకు ముందు పలువురు ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల్లో నెలకొన్న భూ సమస్యలు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులకు సంబంధించిన అంశాలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఆయా సమస్యలను పరిశీలించి పరిష్కరించేందుకు సంబంధిత జిల్లా కలెక్టర్లకు మంత్రి పలు సూచనలు చేశారు. ప్రజాప్రతినిధులు అందించిన సలహాలు, సూచనలను స్వీకరించారు.
ఈ సమావేశంలో ఎంపీ రఘునందన్ రావు, సురేశ్ షెట్కర్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, సునీతా లక్ష్మారెడ్డి, మాణిక్‌రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, సంజీవరెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లు ప్రతీక్ జైన్, హైమావతి, ప్రతిమా సింగ్‌లతో పాటు అదనపు కలెక్టర్లు, సబ్ కలెక్టర్, రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Priyanka Chopra | బయోపిక్‌లో చూపించినవన్నీ అబద్దాలే - ప్రియాంక చోప్రా సినిమాపై దిగ్గజ బాక్సర్ ఆరోపణలు
- ●Cyclone Arnab | అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే..
- ●Karnataka SIR | కర్ణాటక తుది ఓటర్ల జాబితా విడుదల.. 99.32 లక్షల మంది పేర్లు ఔట్
- ●Errabelli Dayakar Rao | సిగ్గు లేకుండా ఫొటోలకు ఫోజులా..!
- ●Apple | ఐఫోన్ డ్యుయో వినియోగదారులకు షాక్.. డిస్ప్లేలో సమస్య..
- ●Assembly Elections 2027 | 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ నగారా: అధికారుల బదిలీలపై కీలక ఆదేశాలు.. ఆ డిక్లరేషన్ తప్పనిసరి!

Priyanka Chopra | బయోపిక్‌లో చూపించినవన్నీ అబద్దాలే - ప్రియాంక చోప్రా సినిమాపై దిగ్గజ బాక్సర్ ఆరోపణలు

Cyclone Arnab | అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే..

Karnataka SIR | కర్ణాటక తుది ఓటర్ల జాబితా విడుదల.. 99.32 లక్షల మంది పేర్లు ఔట్

Errabelli Dayakar Rao | సిగ్గు లేకుండా ఫొటోలకు ఫోజులా..!






