త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bandi Sai Bhagirath | ఏ త‌ప్పు చేయ‌క‌పోతే రూ. 50 వేలు ఎందుకు ఇచ్చిన‌ట్టు..?

Bandi Sai Bhagirath | కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భ‌గీర‌థ్ ప్రేమ వ్య‌వ‌హారం రాజ‌కీయంగా దుమారం రేగుతోంది. ఆయా పార్టీల‌కు చెందిన నాయ‌కులు, మేధావులు ఈ వ్య‌వ‌హారంపై తీవ్రంగా స్పందిస్తున్నారు. సాయి భగీర‌థ్ పోలీసుల‌కు చేసిన ఫిర్యాదుపై అనేక అనుమానాలను రాజ‌కీయ నాయ‌కులు లేవనెత్తుతున్నారు.

S

Telangana | Published On May 9, 2026, 3.52 pm IST

Bandi Sai Bhagirath | ఏ త‌ప్పు చేయ‌క‌పోతే రూ. 50 వేలు ఎందుకు ఇచ్చిన‌ట్టు..?
Advertisement

Bandi Sai Bhagirath | త్రినేత్ర‌.న్యూస్ : కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భ‌గీర‌థ్ ప్రేమ వ్య‌వ‌హారం రాజ‌కీయంగా దుమారం రేగుతోంది. ఆయా పార్టీల‌కు చెందిన నాయ‌కులు, మేధావులు ఈ వ్య‌వ‌హారంపై తీవ్రంగా స్పందిస్తున్నారు. సాయి భగీర‌థ్ పోలీసుల‌కు చేసిన ఫిర్యాదుపై అనేక అనుమానాలను రాజ‌కీయ నాయ‌కులు లేవనెత్తుతున్నారు.

పోలీసుల ఫిర్యాదులో సాయి భ‌గీర‌థ్ వ‌ర్ష‌న్ ఇలా..

కామ‌న్ ఫ్రెండ్ ద్వారా ఆ అమ్మాయి ప‌రిచ‌య‌మైన మాట వాస్త‌వ‌మే. క‌లిసి తిరిగాం.. కానీ మెలమెల్లగా వారి కుటుంబ స‌భ్యులతో పాటు ఆమె ప్రవర్తనలో మార్పులొచ్చాయి. ఆ అమ్మాయిని వివాహం చేసుకోవాలని ఆమె తల్లిదండ్రులు నాపై ఒత్తిడి తీసుకొచ్చారు. నేను ఆ అమ్మాయిని తిరస్కరించేసరికి నాపై తప్పుడు కేసులు నమోదు చేస్తామని బెదిరించారు. డబ్బులివ్వమని కూడా బెదిరించేవారు. నేను కూడా వాళ్ల మాటలకు భయపడి ఆ అమ్మాయి తండ్రికి రూ. 50 వేలు ఇచ్చాను. ఇక నన్ను వదిలిపెట్టమని వారిని బతిమిలాడాను. అయినా వినలేదు. నన్ను రూ. 5 కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. లేదంటే.. తాను చనిపోతానని ఆ అమ్మాయి తల్లి నన్ను బెదిరించింది అని సాయి భ‌గీర‌థ్ త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు.

రాజ‌కీయ నేత‌లు సంధిస్తున్న ప్ర‌శ్న‌లు ఇవే..

రూ. 5 కోట్లు డిమాండ్ చేస్తే.. రూ. 50 వేలు ఇచ్చాన‌ని సాయి భ‌గీర‌థ్ చెబుతున్నాడు. అస‌లు ఏం త‌ప్పు చేయ‌క‌పోతే రూ. 50 వేలు ఇవ్వాల్సి వ‌చ్చింది..? రూ. 5 కోట్లు వాళ్ళు ఏ ఆధారంతో అడిగారు..? మీరు 50 వేలు ఎందుకిచ్చారు..? రూ. 50 వేలు ఇవ్వకముందే కేసు ఎందుకు పెట్టలేదు..? హనీట్రాప్‌లో బ్లాక్‌మెయిల్ చేయడానికి వల్ల దగ్గర వీడియోస్ ప్రూఫ్స్ ఉండాలి.. ఉన్నాయి కాబట్టే రూ. 50 వేలు ఇచ్చారు.. మరి అ వీడియోలో ఏముంది..? అని ప‌లువురు రాజ‌కీయ నేత‌లు, మేధావులు ప్ర‌శ్నిస్తున్నారు.

Advertisement
Advertisement