Harish Rao | పోలవరం ముంపు సమస్యను పరిష్కరిస్తాం.. హరీశ్ రావు లేఖకు పీపీఏ జవాబు
Harish Rao | పోలవరం (Polavaram) ముంపు సమస్యను అత్యంత ప్రధానమైనదిగా గుర్తించి, సమస్యను తప్పకుండా పరిష్కరిస్తామని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (PPA) హామీ ఇచ్చింది. గోదావరి పరివాహక ప్రాంతంలోని తెలంగాణ (Telangana) ప్రజల ప్రాణాలు, జీవనోపాధి, వ్యవసాయ భూములను కాపాడేందుకు హరీశ్ రావు (Harish Rao) తీసుకున్న చొరవను పీపీఏ అభినందించింది.
Harish Rao | త్రినేత్ర.న్యూస్: పోలవరం (Polavaram) ముంపు సమస్యను అత్యంత ప్రధానమైనదిగా గుర్తించి, సమస్యను తప్పకుండా పరిష్కరిస్తామని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (PPA) హామీ ఇచ్చింది. పోలవరం ముంపు వల్ల తెలంగాణ గ్రామాలకు పొంచి ఉన్న ముప్పుపై బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్ రావు (Harish Rao) పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంతంలోని తెలంగాణ (Telangana) ప్రజల ప్రాణాలు, జీవనోపాధి, వ్యవసాయ భూములను కాపాడేందుకు హరీశ్ రావు తీసుకున్న చొరవను పీపీఏ అభినందించింది.
2025 ఏప్రిల్ 8న తెలంగాణ, ఏపీ అధికారుల మధ్య జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఈ లేఖలో పీపీఏ మరోసారి గుర్తుచేసింది. పోలవరం గరిష్ట నీటిమట్టం (45.72 మీటర్లు) వల్ల తెలంగాణలో ముంపునకు గురయ్యే ప్రతి ప్రాంతాన్ని పటిష్టమైన ఇంజినీరింగ్ పద్ధతుల్లో రక్షిస్తామని స్పష్టం చేసింది. ఒకవేళ అలా రక్షించడం సాధ్యం కాకపోతే, నిబంధనల ప్రకారం ఆ భూమిని సేకరించి నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తామని రికార్డుపూర్వకంగా మాట ఇచ్చింది.
ప్రాజెక్టును త్వరగా వాడుకలోకి తెచ్చేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం మేరకు ప్రస్తుతం మొదటి దశలో 41.15 మీటర్ల వరకే నీటిని నిల్వ చేస్తున్నామని పీపీఏ వివరించింది. తెలంగాణలోని ఎగువ ప్రాంతాలపై ఎలాంటి ప్రభావం పడకుండా ఉండేందుకు అన్ని రకాల సైంటిఫిక్ అంచనాలు, వరద నివారణ చర్యలు తప్పకుండా తీసుకుంటామని పీపీఏ సభ్య కార్యదర్శి ఎం. రఘురామ్ ఆ లేఖలో స్పష్టం చేశారు.
హామీలను మాటలకే పరిమితం చేయొద్దు: హరీశ్ రావు
పీపీఏ ఇచ్చిన లేఖపై హరీశ్ రావు స్పందిస్తూ.. పోలవరం ముంపుపై తెలంగాణ మొదటి నుంచీ పడుతున్న ఆందోళన నిజమేనని ఈ లేఖతో తేలిపోయిందన్నారు. కేంద్రం రాతపూర్వకంగా ఇచ్చిన ఈ హామీలను మాటలకే పరిమితం చేయకుండా అమలు చేయాలని ఆయన కోరారు. పోలవరం వల్ల తెలంగాణలోని ఏ ఒక్క ఊరికి, రైతుకు, కుటుంబానికి నష్టం జరగకుండా కేంద్ర, ఏపీ ప్రభుత్వాలు, పీపీఏ వెంటనే తగిన వరద నివారణ, పునరావాస చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
సంబంధిత వార్తలు

Harish Rao | పదవులను వదిలేసిన త్యాగాలు బీఆర్ఎస్వి.. జిరాక్స్ కాపీలతో గద్దెనెక్కిన మోసాలు రేవంత్‌వి : హరీశ్‌రావు
జూన్ 17, 2026

Niranjan Reddy | రైతుబీమాను నిలిపేయడం కాంగ్రెస్ చారిత్రక ద్రోహం : నిరంజన్ రెడ్డి
జూన్ 17, 2026

Rythu Bharosa | అన్నదాతలకు గుడ్ న్యూస్.. జూన్ 26 నుంచి రైతు భరోసా!
జూన్ 17, 2026
తాజావార్తలు
- ●Telegram Ban India | దొంగను వదిలేసి బాధితుడి ఇంటికి తాళం వేశారు : టెలిగ్రామ్ బ్యాన్పై రాహుల్, కేజ్రీవాల్ ఫైర్
- ●Social Media | సోషల్ మీడియా కంటెంట్‌తో 12 ఏళ్ల బాలిక కథ విషాదాంతం.. మెటా, టిక్‌టాక్‌పై కుటుంబాల న్యాయ పోరాటం..
- ●Alpha Trailer | అదిరిన ‘ఆల్ఫా’ ట్రైలర్.. యాక్షన్ మోడ్‌లో అలియా
- ●Kalvakuntla Kavitha | తల్లి కాంగ్రెస్‌తోనే పోరాటం చేశాం.. ఈ పిల్ల కాంగ్రెస్ ఎంత..? : కల్వకుంట్ల కవిత
- ●Dehradun Student Suicide | కన్నీరు పెట్టిస్తున్న క్లాస్ 12 టాపర్ సూసైడ్ నోట్.. నీట్ ఎగ్జామ్ టెన్షన్‌తో కార్గిల్ వీరుడి కూతురు ఆత్మహత్య
- ●MP Sanjay Raut | నమ్మక ద్రోహులు వెళ్లిపోనీ.. నా మాటలను బీప్ చేయొద్దు : సంజయ్ రౌత్

Telegram Ban India | దొంగను వదిలేసి బాధితుడి ఇంటికి తాళం వేశారు : టెలిగ్రామ్ బ్యాన్పై రాహుల్, కేజ్రీవాల్ ఫైర్

Social Media | సోషల్ మీడియా కంటెంట్‌తో 12 ఏళ్ల బాలిక కథ విషాదాంతం.. మెటా, టిక్‌టాక్‌పై కుటుంబాల న్యాయ పోరాటం..

Alpha Trailer | అదిరిన ‘ఆల్ఫా’ ట్రైలర్.. యాక్షన్ మోడ్‌లో అలియా

Kalvakuntla Kavitha | తల్లి కాంగ్రెస్‌తోనే పోరాటం చేశాం.. ఈ పిల్ల కాంగ్రెస్ ఎంత..? : కల్వకుంట్ల కవిత



