త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Niranjan Reddy | రైతుబీమాను నిలిపేయడం కాంగ్రెస్ చారిత్రక ద్రోహం : నిరంజ‌న్ రెడ్డి

Niranjan Reddy | రైతుబీమాను నిలిపివేయ‌డం కాంగ్రెస్ చారిత్ర‌క ద్రోహం అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి అన్నారు. మట్టిని నమ్ముకున్న రైతు ఏ కారణం చేత మరణించినా ఆ కుటుంబానికి రూ. 5 లక్షల సాయం అందే బృహత్తర పథకానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారు. బీఆర్ఎస్ హయాంలో 1,11,320 మంది రైతు కుటుంబాలకు సాయం అందిందని నిరంజ‌న్ రెడ్డి గుర్తు చేశారు.

S

Telangana | Published On Jun 17, 2026, 3.06 pm IST

Niranjan Reddy | రైతుబీమాను నిలిపేయడం కాంగ్రెస్ చారిత్రక ద్రోహం : నిరంజ‌న్ రెడ్డి
Advertisement

Niranjan Reddy | త్రినేత్ర‌.న్యూస్ : రైతుబీమాను నిలిపివేయ‌డం కాంగ్రెస్ చారిత్ర‌క ద్రోహం అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి అన్నారు. మట్టిని నమ్ముకున్న రైతు ఏ కారణం చేత మరణించినా ఆ కుటుంబానికి రూ. 5 లక్షల సాయం అందే బృహత్తర పథకానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారు. బీఆర్ఎస్ హయాంలో 1,11,320 మంది రైతు కుటుంబాలకు సాయం అందిందని నిరంజ‌న్ రెడ్డి గుర్తు చేశారు.

అంతర్జాతీయంగా యూఎన్ఓ ప్రశంసలు అందుకున్న రైతుబీమా పథకాన్ని నిలిపివేయడం కాంగ్రెస్ సర్కారు దుర్మార్గానికి పరాకాష్ట. ఎకరానికి ఏడాదికి రూ.10 వేల బదులు రూ.15 వేలు ఇస్తానని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. ఇప్పుడు రైతుబీమా పథకానికి చెల్లించాల్సిన ప్రీమియం రూ.441 కోట్లు చెల్లించకపోవడంతో వివిధ కారణాలతో 7606 మంది రైతులకు రూ.5 లక్షల చొప్పున రావాల్సిన సాయం ఆగిపోయింది. రైతుబీమాకు ధీటుగా ప్రతి కుటుంబానికి బీమా అని జూన్ 2న ప్రకటనలు చేశారు. రాష్ట్రంలోని సుమారు 1.15 కోట్ల కుటుంబాలకు రూ. 5 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ అని ఊదరగొట్టారు. ఆరు గ్యారంటీల మాదిరిగానే ఈ పథకాన్ని ప్రభుత్వం అటకెక్కించింది అని నిరంజ‌న్ రెడ్డి మండిప‌డ్డారు.

రాత్ గయా.. బాత్ గయా అన్న తరహాలో కాంగ్రెస్ సర్కారు పాలన సాగిస్తోంది. రైతుబీమా పథకాన్ని యధాతథంగా కొనసాగించాలి. కాంగ్రెస్ పార్టీ చేసిన రైతుద్రోహం చరిత్రలో నిలిచిపోతుంది అని నిరంజ‌న్ రెడ్డి ధ్వ‌జ‌మెత్తారు.

Advertisement
Advertisement