త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rythu Bharosa | అన్న‌దాత‌ల‌కు గుడ్ న్యూస్‌.. జూన్ 26 నుంచి రైతు భ‌రోసా!

Rythu Bharosa | అన్న‌దాత‌ల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వానాకాలం (ఖరీఫ్) సీజన్‌కు సంబంధించిన పంట పెట్టుబ‌డి సాయాన్ని (Rythu Bharosa) ఈ నెల‌లో అందించాల‌ని నిర్ణ‌యించింది.

G

Telangana | Published On Jun 17, 2026, 7.28 am IST

Rythu Bharosa | అన్న‌దాత‌ల‌కు గుడ్ న్యూస్‌.. జూన్ 26 నుంచి రైతు భ‌రోసా!
Advertisement

Rythu Bharosa | త్రినేత్ర‌.న్యూస్‌: అన్న‌దాత‌ల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వానాకాలం (ఖరీఫ్) సీజన్‌కు సంబంధించిన పంట పెట్టుబ‌డి సాయాన్ని (Rythu Bharosa) ఈ నెల‌లో అందించాల‌ని నిర్ణ‌యించింది. రైతు భరోసా పథకం నిధుల విడుదలకు తక్షణమే సన్నాహాలు చేయాలని వ్యవసాయ, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆదేశించారు. దీంతో ఎకరానికి రూ.6 వేల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.50 కోట్ల ఎకరాల సాగు భూమికి గానూ మొత్తం రూ.9 వేల కోట్లను విడుదల చేయాలని వ్యవసాయ శాఖ ప్రతిపాదించారు. దీనికి సీఎం రేవంత్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నిధుల‌కు సంబంధించి జూన్ 18న జరగబోయే కేబినెట్ సమావేశంలో చ‌ర్చించ‌నున్నారు. మంత్రిమండ‌లి ఆమోదం పొందిన వెంటనే నిధుల పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది.

ప్ర‌భుత్వ వ‌ర్గాలు అందించిన స‌మాచారం మేర‌కు జూన్ 26న ఈ ప్ర‌క్రియ ప్రారంభం కానుంది. మొద‌టి రోజున రాష్ట్రంలోని మొత్తం 73 లక్షల మంది రైతులకు ఎకరం లోపు ఉన్న భూములకు నేరుగా లబ్ధి చేకూరేలా నిధులను వారి ఖాతాల్లో జమ చేస్తారు. ఆ తర్వాత మిగిలిన రైతులకు విడతల వారీగా.. బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. దీనికి సంబంధించి పూర్తి షెడ్యూల్ రావాల్సి ఉంది.

స‌న్నాలు ఏడు ర‌కాలే.. వాటికే బోన‌స్‌

బోనస్ ఇచ్చే 7 రకాల సన్న వడ్ల విత్తనాలను అందుబాటులో ఉంచాలని.. వాటినే సబ్సిడీపై ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. రైతు వేదికలో విత్తనాలు అందుబాటులో ఉంచాలని చెప్పారు. సన్న వడ్లు పండించే రైతుల డేటా సేకరించాలన్నారు. అన్ని ఫెర్టిలైజర్ల‌కు యాప్ పెట్టాలని.. యాప్ ద్వారా బుక్ చేసుకునే యూరియాను రైతు వేదిక ద్వారా పంపిణీ చేయాలని ఆదేశించారు. జిల్లా అదనపు కలెక్టర్‌కు యూరియా పంపిణీ బాధ్యతను అప్పగించాలన్నారు.

యూరియా, ఇతర ఎరువుల కేటాయింపులపైన ఎప్పటికప్పుడు కేంద్రానికి లేఖ లు రాయాలి. రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి అయిన ఎరువులు మొత్తం తెలంగాణకే ఇవ్వాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి. ధాన్యం దిగుబడిపైన వ్యవసాయ శాఖకు సంపూర్ణ అవగాహన ఉండాలి. భద్రాద్రి కొత్తగూడం దమ్మపేట మండలంలో ప్రారంభించిన‌ పైలెట్ ప్రాజెక్ట్ ను మరింతగా వినియోగించుకోవాలి అని రేవంత్‌రెడ్డి సూచించారు.

Advertisement
Advertisement