Pochampally Srinivas Reddy | కాంగ్రెస్ ప్రభుత్వ పాలన తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి
Pochampally Srinivas Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం పాలన తీరుపై ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. రైతు సంక్షేమం, విద్యార్థుల భోజన సమస్యలు, నిరుద్యోగ హామీలు తదితర అంశాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కారు అంబేద్కర్‌ను గౌరవించలేదని ఆరోపించారు.
Pochampally Srinivas Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం పాలన తీరుపై ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. రైతు సంక్షేమం, విద్యార్థుల భోజన సమస్యలు, నిరుద్యోగ హామీలు తదితర అంశాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కారు అంబేద్కర్‌ను గౌరవించలేదని ఆరోపించారు. దేశంలోనే అత్యంత ఎత్తయిన భారీ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున ఏర్పాటు చేసి గత కేసీఆర్ ప్రభుత్వం సమున్నతంగా గౌరవించిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సంకెళ్లు వేసి, జైల్లో పెట్టినట్లు ఆ విగ్రహాన్ని బంధించారన్నారు. ఆ మహనీయుడి విగ్రహానికి జయంతి, వర్ధంతి రోజున కనీసం ప్రభుత్వం ఒక దండ వేయలేని దౌర్భాగ్య స్థితి ఈ రాష్ట్రంలో నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ పేరుతో బద్నాం చేస్తూ.. కనీసం మానవత్వం లేకుండా పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు పంపిస్తున్నారని ఆరోపించారు.
మూసీ సుందరీకరణ పేరుతో ఏ రాత్రి జేసీబీలు ఇండ్లపైకి వస్తాయో తెలియక సామాన్యలు వణికిపోతున్నారన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం రాష్టంలో అమలుకావడం లేదని, ఇక్కడ కేవలం ఎనుముల రాజ్యంగం, కాంగ్రెస్ కమీషన్ల భాగోతం నడుస్తోందని ఆరోపించారు. ఈ దారుణాలు ఢిల్లీలో ఉన్న అధిష్టానికి తెలియవా? ఎందుకు నోరు మెదపడం లేదు? విధ్వంసాన్ని ఆపడం లేదంటూ నిలదీశారు. గాంధీ మనవడు తుషార్ గాంధీ స్పందిస్తూ కూల్చివేతలను వ్యతిరేకించారని, నెహ్రూ మునిమనవడు రాహుల్ నుంచి స్పందన మాత్రం కనిపించడం లేదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ పంపే కమీషన్ల కోసం.. ఢిల్లీ పెద్దలు కళ్లు, చెవులు మూసుకున్నారని, నోళ్లు కుట్టుకున్నారని విమర్శించారు. బడ్జెట్‌లో సర్కారు మాటలు కోటలు దాటుతున్నాయని.. కానీ కాళ్లు తంగెళ్లు దాటడం లేదన్నారు. డిప్యూటీ సీఎం ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తే బాధగా ఉందన్నారు.
పెద్దల సభలో రాజకీయాలు మాట్లాడాలని లేదని, కానీ ఒక్క మాటలో చెప్పాలంటే ఇది బర్ఖత్ లేని బడ్జెట్ అన్నారు. ప్రజల ఎదురుచూపులకు ఈసారైనా ముగింపు దొరుకుతుందేమోనని ఆశపడ్డా.. ఆడియాలయ్యాయన్నారు. వంద, 800 రోజులు దాటిపాయే.. ఇంకెప్పుడు అని అసంతృప్తి, ఆగ్రహంతో ప్రశ్నిస్తున్న జనాలకు సంజాయిషీలు, సమాధానాలు లేవని మండిపడ్డారు. మూడు బడ్జెట్లో ముగిసిపోయినా.. మిగిలింది ఒక్కటే పూర్తి బడ్జెట్ కాలం కరిగిపోయిందన్నారు. సినిమా పేరేమో అభయహస్తం.. కథ చూస్తే భస్మాసుర హస్తం అంటూ సెటైర్లు వేశారు. మూడు ముక్కల్లో కాంగ్రెస్ పాలన గురించి చెప్పాలంటే ఏ గొట్టు కూలగొట్టు చెడగొట్టు.. హామీలు ఎగొట్టు కట్టిన వాటిని కూలగొట్టు.. ఉన్న పథకాలను చెడగొట్టు అన్నట్లుగా ఉందని విమర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులులు, నిరుద్యోగ సమస్యలు, మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు తదితర అంశాలను ప్రస్తావించారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






