Pochampally Srinivas Reddy | ప్రజాస్వామ్య విలువలను కాలరాసేలా కాంగ్రెస్ సర్కార్ తీరు: ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి
Pochampally Srinivas Reddy | బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సుకు హాజరుకాకుండా పార్టీ కార్యకర్తలు, యువతను అడ్డుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి (Pochampally Srinivas Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కార్ (Congress Govt) ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నదని మండిపడ్డారు.
Pochampally Srinivas Reddy | త్రినేత్ర.న్యూస్: బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సుకు హాజరుకాకుండా పార్టీ కార్యకర్తలు, యువతను అడ్డుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి (Pochampally Srinivas Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కార్ (Congress Govt) ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నదని మండిపడ్డారు. యువ సంగ్రామ సదస్సు (Yuva Sangrama Sadassu) విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు ప్రజాస్వామ్య విలువలను కాలరాసే విధంగా ఉందని ధ్వజమెత్తారు. సదస్సుకు తొలుత అనుమతి నిరాకరించినప్పటికీ, హైకోర్టు జోక్యంతో అనుమతి లభించిందన్నారు. అయినప్పటికీ, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్‌ని సభకు హాజరుకాకుండా పోలీసులు గృహ నిర్బంధం (House Arrest) చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. న్యాయస్థానం అనుమతి ఇచ్చిన కార్యక్రమానికి హాజరయ్యే నాయకులను అడ్డుకోవడం కోర్టు ఆదేశాల స్ఫూర్తిని అవమానపరచడమే కాకుండా, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను హరించే చర్యగా పేర్కొన్నారు.
ఎందుకంత అసహనం..
చట్టాన్ని అమలు చేయాల్సిన ప్రభుత్వమే ప్రజాస్వామ్య వ్యవస్థపై విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించడం దురదృష్టకరమని చెప్పారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా సమావేశాలు నిర్వహించడం, ప్రజల సమస్యలను ప్రస్తావించడం ప్రతి రాజకీయ పార్టీకి ఉన్న హక్కని స్పష్టం చేశారు. అలాంటి కార్యక్రమాలను పోలీసు బలంతో అడ్డుకోవడం తగదని హితవుపలికారు. యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగం, విద్య, ఉపాధి వంటి సమస్యలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన యువ సంగ్రామ సదస్సు పట్ల ప్రభుత్వం ఇంత అసహనం ఎందుకు ప్రదర్శిస్తోందని ప్రశ్నించారు.
సమాధానం చెప్పలేక..
యువత ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు వ్యవస్థను అడ్డంగా పెట్టుకుని ప్రతిపక్ష స్వరాన్ని అణిచివేయాలని ప్రయత్నిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి నిరంకుశ వైఖరి ప్రజాస్వామ్య స్ఫూర్తికి ప్రమాదకరమని హెచ్చరించారు. హైకోర్టు అనుమతి ఉన్నప్పటికీ నాయకులను గృహ నిర్బంధం చేసిన ఘటనపై ప్రభుత్వం వెంటనే ప్రజలకు వివరణ ఇవ్వాలన్నారు. అక్రమంగా నిర్బంధించిన నాయకులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
- ●Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?
- ●Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి
- ●Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల
- ●Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు
- ●Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!
- ●Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన

Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?

Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి

Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల

Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు






