RS Praveen Kumar | గురుకుల అవినీతిపై సీఎంకు ఫిర్యాదా?.. కుంభకోణం సూత్రధారే రేవంత్ రెడ్డి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
RS Praveen Kumar | గురుకులాల్లో జరుగుతున్న అవినీతిపై సీఎం రేవంత్ రెడ్డికి (Revanth Reddy) ఫిర్యాదు చేస్తారా అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) ప్రశ్నించారు. అసలు కుంభకోణం సూత్రధారే ముఖ్యమంత్రి, రాడిసన్ బ్లూ గ్యాంగ్ అని చెప్పారు.
RS Praveen Kumar | త్రినేత్ర న్యూస్: గురుకులాల్లో జరుగుతున్న అవినీతిపై సీఎం రేవంత్ రెడ్డికి (Revanth Reddy) ఫిర్యాదు చేస్తారా అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) ప్రశ్నించారు. అసలు కుంభకోణం సూత్రధారే ముఖ్యమంత్రి, రాడిసన్ బ్లూ గ్యాంగ్ అని చెప్పారు. రేవంత్ రెడ్డి అమలు చేసే ప్రతి స్కీం వెనక ఒక స్కాం ఉంటుందని తెల్వదా అని ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణను నిలదీశారు.
`సంక్షేమ హాస్టళ్ల విద్యార్థుల కోసం నాణ్యతతో కూడిన నిత్యావసర సరుకులను తక్కువ ధరకే సరఫరా చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం.. కమీషన్ల కారణంగా మసకబారే పరిస్థితి నెలకొందని, రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సంస్థకు కేంద్రీకృత టెండర్ ద్వారా కాంట్రాక్టు అప్పగించినా.. నిబంధనలకు విరుద్ధంగా ఆ సంస్థ సబ్ కాంట్రాక్టులు ఇచ్చి కమీషన్లు దండుకుంటోంది. సబ్ కాంట్రాక్టు పొందిన సంస్థలు తిరిగి సబ్ కాంట్రాక్టులు ఇవ్వడం.. వారంతా ఎక్కడికక్కడ కమీషన్లు ఇస్తుండడంతో చివరికి హాస్టళ్లకు నాసిరకం సరుకుల సరఫరా జరుగుతున్నదంటూ.. ఈ మొత్తం వ్యవహారం వెనుక ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి ఉన్నాడని` ఆంధ్రజ్యోతి పత్రిక సోమవారం ఒక వార్తను ప్రచురించింది. ఈ కథనంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. ఆంధ్రజ్యోతి కాదు మీరు అంధజ్యోతి అంటూ ధ్వజమెత్తారు.
గతంలోనే గురుకుల అవినీతిని బీఆరెస్ (BRS) పార్టీ ఆధారాలతో సహా బయటపెట్టిందని గుర్తుచేశారు. బహిరంగ చర్చకు రమ్మని సవాలు కూడా విసిరిందన్నారు. అయినా సీఎం రేవంత్ నుంచి స్పందన లేదు. అసలు పీయంయూ (PMU) జీవో 17 ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు. కేరళ ఎన్నికల (Kerala Elections) ఖర్చును భరించడానికి కాదా? అని ఆరోపించారు. మీ విలాసాల కోసం తెలంగాణ పసి పిల్లల పొట్ట కొడతారా? అని నిలదీశారు. స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ సచివాలయ ఘోస్ట్ వెనక ఉన్న దుష్టచతుష్టయం ఎవరన్నారు. మీ దోపిడిని మరిన్ని ఆధారాలతో బయటపెడతామని స్పష్టించారు. తెలంగాణ పై పడ్డ మీ మహా ‘మచ్చ’ల భరతం పడతామని చెప్పారు. చర్లపల్లి జైలు మెనూను ఇప్పటి నుంచే తినడం అలవాటు చేసుకోవాలని, దిండు లేకుండా పడుకోవడం మర్చిపోవద్దంటూ ఎక్స్ వేదికగా హెచ్చరించారు.
గురుకుల అవినీతిపై సీయం కు ఫిర్యాదా?
ఆంధ్రజ్యోతి కాదు మీరు అంధజ్యోతి🤣..అసలు ఈ కుంభకోణ సూత్రధారే రేవంత్
అండ్ రాడిసన్ బ్లూ గ్యాంగ్ 💉💊🥃🚬రేవంత్ ప్రతి స్కీం వెనకాల ఒక స్కాం ఉంటదని తెల్వదా రాధాకృష్ణ కు?
గతంలోనే గురుకుల అవినీతిని బీఆరెస్ పార్టీ ఆధారాలతో సహా బయటపెట్టింది..
బహిరంగ చర్చకు రమ్మని సవాలు కూడా విసిరింది..
అయినా సీయం నుండి స్పందన లేదు
అసలు పీయంయూ (PMU) జీవో 17 ఎందుకు తీసుకొచ్చారు? కేరళ ఎన్నికల ఖర్చును భరించడానికి కాదా?
మీ విలాసాల కోసం తెలంగాణ పసి పిల్లల పొట్ట కొడతారా?
స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ సచివాలయ ఘోస్ట్ వెనక ఉన్న దుష్టచతుష్టయం ఎవరు?
మీ దోపిడిని మరిన్ని ఆధారాలతో బయటపెడతాం. తెలంగాణ పై పడ్డ మీ మహా ‘మచ్చ’ల భరతం పడతాం.
చర్లపల్లి జైలు మెనూ ను ఇప్పటి నుండే తినడం అలవాటు చేసుకోండి..దిండు లేకుండా పడుకోవడం మరవకండి ..🥱
జై తెలంగాణ 👊
@brsparty @ktrbrs @brsharish @cmotelangana
#TelanganaSinking
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) October 12, 2026
సంబంధిత వార్తలు

Dasoju Sravan Kumar | విద్యావంతుల మౌనంతోనే అనర్హులకు అధికారం : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
అక్టోబర్ 11, 2026

Revanth Reddy Goa Speech | 2026లో కేరళ.. 2027లో గోవా.. నైరుతి రుతుపవనాల్లా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చుడే
అక్టోబర్ 11, 2026

Nagarigari Preetham | కేటీఆర్! మేం బ్లడ్ శాంపిల్స్ ఇస్తున్నం.. డాక్టర్లను మీ ఇంటికీ పంపుతున్నం
అక్టోబర్ 11, 2026
తాజావార్తలు
- ●IPO | ఈ వారం నాలుగు ఐపీఓలు.. సబ్స్క్రిప్షన్ ఎప్పుడంటే..
- ●Bathukamma | తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటేలా.. దుబాయ్లో ఘనంగా బతుకమ్మ సంబురాలు
- ●Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో కొనసాగుతున్న అస్థిరత.. పెట్టుబడి పెట్టాలా, వేచి చూడాలా..?
- ●Nagarjuna Sagar | తాగునీటి అవసరాలకు.. నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల
- ●Stock Markets | చమురు ధరల తగ్గుదల ఎఫెక్ట్.. లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ..
- ●RTC Metro Common Pass | ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్ ధరలపై పునఃపరిశీలన.. ప్రజలకు అందుబాటులో ఉండేలా చూస్తామన్న మంత్రి పొన్నం ప్రభాకర్

IPO | ఈ వారం నాలుగు ఐపీఓలు.. సబ్స్క్రిప్షన్ ఎప్పుడంటే..

Bathukamma | తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటేలా.. దుబాయ్లో ఘనంగా బతుకమ్మ సంబురాలు

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో కొనసాగుతున్న అస్థిరత.. పెట్టుబడి పెట్టాలా, వేచి చూడాలా..?

Nagarjuna Sagar | తాగునీటి అవసరాలకు.. నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల



