త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Yadadri MMTS | యాదాద్రికి ఎంఎంటీఎస్.. ఏప్రిల్‌లో శంకుస్థాప‌న చేయ‌నున్న మోదీ..!

Yadadri MMTS | ఎన్నో ఏళ్ల క‌ల ఫ‌లించ‌నుంది. యాదాద్రి ఎంఎంటీఎస్ ప‌నులు త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్క‌నున్నాయి. రెండున్న‌రేండ్ల‌లో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి యాదాద్రి భ‌క్తుల‌కు అందుబాటులోకి తీసుకురావాల‌ని రైల్వే అధికార యంత్రాంగం సంక‌ల్పించింది.

S

Telangana | Published On Mar 26, 2026, 6.21 pm IST

Yadadri MMTS | యాదాద్రికి ఎంఎంటీఎస్.. ఏప్రిల్‌లో శంకుస్థాప‌న చేయ‌నున్న మోదీ..!
Advertisement

Yadadri MMTS | త్రినేత్ర‌.న్యూస్ : ఎన్నో ఏళ్ల క‌ల ఫ‌లించ‌నుంది. యాదాద్రి ఎంఎంటీఎస్ ప‌నులు త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్క‌నున్నాయి. రెండున్న‌రేండ్ల‌లో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి యాదాద్రి భ‌క్తుల‌కు అందుబాటులోకి తీసుకురావాల‌ని రైల్వే అధికార యంత్రాంగం సంక‌ల్పించింది. ఈ క్ర‌మంలో ఏప్రిల్ నెల‌లో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ యాదాద్రి ఎంఎంటీఎస్ ప్రాజెక్టుకు శంకుస్థాప‌న చేసే అవ‌కాశం ఉంద‌ని స్థానిక రైల్వే అధికారులు పేర్కొన్నారు. శంకుస్థాప‌న అయితే ప్ర‌ధాని కార్యాల‌యం నుంచి అధికారిక స‌మాచారం రావాల్సి ఉంద‌ని తెలిపారు.

ఎంఎంటీఎస్ రెండో ద‌శ‌లో భాగంగా ఉన్న ఈ ప్రాజెక్టును దక్షిణ మధ్య రైల్వే చేప‌డుతోంది. మూడేండ్ల‌లో ప‌నుల‌ను పూర్తి చేసి ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ కాంట్రాక్టును ఇటీవల రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (RVNL)కు అప్పగించగా, రాయగిరి వరకు భూసేకరణ ఇప్పటికే పూర్తయింది. ఈ ప్రాజెక్టును తొలుత 2016-17లో రైల్వే, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ప్రాజెక్టుగా మంజూరు చేశారు. ఆ తర్వాత, కేంద్ర ప్రభుత్వం దశలవారీగా మంజూరు చేసిన నిధులతో ఈ ప్రాజెక్టును స్వతంత్రంగా చేపట్టాలని రైల్వే సంస్థ‌ నిర్ణయించింది.

సికింద్రాబాద్ నుంచి చర్లపల్లి, ఘట్‌కేసర్ మీదుగా రాయగిరి వరకు ప్రతిపాదిత 33 కిలోమీటర్ల మార్గాన్ని సుమారు రూ. 430 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి చేయ‌నున్నారు. ఇందులో కొత్త రైల్వే లైన్ల నిర్మాణం, అవసరమైన విభాగాలలో ట్రాక్‌ల డబ్లింగ్, విద్యుదీకరణ, కొత్త స్టేషన్ల నిర్మాణం, ప్రస్తుత మౌలిక సదుపాయాల ఆధునీకరణ వంటి పనులు చేప‌ట్ట‌నున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement