త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rangareddy | విక‌లాంగుడే కానీ.. కూర‌గాయ‌లు విక్ర‌యిస్తూ జీవ‌నోపాధి పొందుతూ..

Rangareddy | ఈ పాటలోని ప్ర‌తి ప‌దం ఈ దివ్యాంగుడి జీవితానికి సరిపోలుతుంది. ఎందుకంటే దివ్యాగుండిన‌ని చెప్పి.. ఇంటికే ప‌రిమితం కాలేదు.. కుటుంబ స‌భ్యుల‌పై కూడా ఆధార‌ప‌డ‌లేదు. స్వ‌తహాగా స్వయం ఉపాధి పొందాల‌నుకున్నాడు. ఇంకేముంది.. ఓ సాధార‌ణ మ‌నిషిలా బ‌తుకుదెరువు కోసం బ‌య‌ల్దేరాడు.

S

Telangana | Published On Jun 28, 2026, 3.54 pm IST

Rangareddy | విక‌లాంగుడే కానీ.. కూర‌గాయ‌లు విక్ర‌యిస్తూ జీవ‌నోపాధి పొందుతూ..
Advertisement

ఒకటే జననం ఒకటే మరణం
ఒకటే గమనం ఒకటే గమ్యం
గెలుపు పొందె వరకూ అలుపు లేదు మనకు
బ్రతుకు అంటె గెలుపూ గెలుపు కొరకె బ్రతుకు
కష్టాలురానీ కన్నీళ్లురానీ ఏమైనాగానీ ఎదురేదిరానీ
ఓడిపోవద్దు రాజీపడొద్దు నిద్రే నీకొద్దు నీకేది హద్దు
ఒకటే జననం ఒకటే మరణం
ఒకటే గమనం ఒకటే గమ్యం
గెలుపు పొందె వరకూ అలుపు లేదు మనకు
బ్రతుకు అంటె గెలుపూ గెలుపు కొర‌కే బ్రతుకు

Rangareddy | ఈ పాటలోని ప్ర‌తి ప‌దం ఈ దివ్యాంగుడి జీవితానికి సరిపోలుతుంది. ఎందుకంటే దివ్యాగుండిన‌ని చెప్పి.. ఇంటికే ప‌రిమితం కాలేదు.. కుటుంబ స‌భ్యుల‌పై కూడా ఆధార‌ప‌డ‌లేదు. స్వ‌తహాగా స్వయం ఉపాధి పొందాల‌నుకున్నాడు. ఇంకేముంది.. ఓ సాధార‌ణ మ‌నిషిలా బ‌తుకుదెరువు కోసం బ‌య‌ల్దేరాడు. అన్ని అవ‌య‌వాలు స‌క్ర‌మంగా ఉన్న‌వారితో స‌మానంగా.. నిత్యం శ్ర‌మిస్తూ.. కూర‌గాయ‌లు విక్ర‌యిస్తూ జీవ‌నోపాధి పొందుతున్నాడు. మ‌రి ఈ దివ్యాంగుడి గురించి తెలుసుకోవాలంటే.. రంగారెడ్డి జిల్లా ఇబ్ర‌హీంప‌ట్నం ప‌రిధిలోని తుర్క‌యంజాల్ క‌మ్మ‌గూడ‌కు బ‌య‌ల్దేరాల్సిందే.

క‌మ్మ‌గూడ‌కు చెందిన సునీల్.. పుట్టుక‌తోనే విక‌లాంగుడు. దీంతో అత‌నికి కుటుంబ స‌భ్యులు ట్రై సైకిల్ స‌మ‌కూర్చారు. అయితే త‌ను కుటుంబ స‌భ్యుల‌పై ఆధార‌ప‌డ‌లేదు. సొంతంగా తానే జీవ‌నోపాధి పొందాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. అనుకున్న‌దే ఆల‌స్యం.. కూర‌గాయ‌ల వ్యాపారం క‌ళ్ల ముందు క‌ద‌లాడింది. త‌న ట్రై సైకిల్‌పై ఆకుకూర‌ల‌తో పాటు వివిధ కూర‌గాయ‌ల‌ను విక్ర‌యిస్తూ ఏడాదిగా జీవ‌నోపాధి పొందుతున్నాడు. కూర‌గాయలు విక్ర‌యిస్తూ నాలుగు పైస‌లు సంపాదించ‌డంతో త‌న‌లో ఆత్మ‌స్థైర్యం పెరిగింద‌ని, ఆర్థికంగా ఎదుగుతున్నాన‌ని సునీల్ పేర్కొన్నాడు.

సునీల్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం

క‌మ్మ‌గూడ‌తో పాటు స‌మీప గ్రామాల ప్ర‌జ‌లు సునీల్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఏ పనికైనా సాకులు వెతికే యువత.. సునీల్‌ను ఆద‌ర్శంగా తీసుకోవాల‌ని ప‌లువురు సూచిస్తున్నారు. సంక‌ల్పం ఉంటే.. ఏది కూడా అడ్డురాద‌ని.. జీవితంలో గొప్ప‌గా ఎద‌గొచ్చ‌ని అందుకు నిద‌ర్శ‌నం సునీల్ అని స్థానికులు ప్ర‌శంసిస్తున్నారు.

Advertisement
Advertisement