Petrol Bunks | హైదరాబాద్‌లో మళ్లీ పెట్రోల్ బంకులు మూసివేత..!
Petrol Bunks | రాష్ట్ర రాజధాని హైదరాబాద్( Hyderabad ) నగరంలో ఇంధన కొరత( Fuel Shortage ) మళ్లీ మొదలైంది. రెండు, మూడు వారాల క్రితం చోటు చేసుకున్న పరిణామాలు మళ్లీ కనిపిస్తున్నాయి. నగరంలోని పలు పెట్రోల్ బంకుల్లో( Petrol Bunks ) నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.
Petrol Bunks | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్( Hyderabad ) నగరంలో ఇంధన కొరత( Fuel Shortage ) మళ్లీ మొదలైంది. రెండు, మూడు వారాల క్రితం చోటు చేసుకున్న పరిణామాలు మళ్లీ కనిపిస్తున్నాయి. నగరంలోని పలు పెట్రోల్ బంకుల్లో( Petrol Bunks ) నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కొన్ని పెట్రోల్ బంకులు ఇప్పటికే మూతపడగా, కొన్ని బంకుల్లో డీజిల్ నో స్టాక్ బోర్డులు వెలుస్తున్నాయి. మరికొన్ని బంకుల్లో కేవలం పెట్రోల్ మాత్రమే ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఆదివారం ఉదయం భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలో పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల వాహనదారులు నిల్చున్నారు. ఉదయం నుండే పెట్రోల్, డీజిల్ కోసం క్యాన్లతో బారులు తీరారు. పెట్రోల్ బంకు సిబ్బందితో వాహనదారులకు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో ఉద్రిక్త వాతావరణం సద్దుమణిగింది. పోలీసుల పర్యవేక్షణలో బంకు సిబ్బంది డీజిల్ నింపి పంపించారు.

రెండు, మూడు వారాల క్రితం వాహనదారులు ప్రతి పెట్రోల్ బంకు వద్ద బారులు తీరారు. గంటల తరబడి పెట్రోల్ కోసం నిలబడ్డారు. ఆ పరిస్థితి ఒకట్రెండు రోజులు మాత్రమే ఉంది. ఆ తర్వాత మళ్లీ సాధారణ పరిస్థితి ఏర్పడింది. మళ్లీ నేటి నుంచి ఇంధన కొరత ఏర్పడిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో వాహనదారులు మరింత ఆందోళనకు గురవుతున్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




