త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PCC Chief | పీసీసీ చీఫ్‌గా భార‌త హాకీ మాజీ కెప్టెన్‌.. అమ‌రీంద‌ర్ రాజీనామాతో ప‌ర్గ‌త్‌కు అవ‌కాశం

PCC Chief | అసెంబ్లీ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న‌ వేళ పంజాబ్ కాంగ్రెస్‌లో (Punjab Congress) కీల‌క మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రెండు రోజుల క్రితం పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ (PCC Chief ) అమ‌రీంద‌ర్ సింగ్ రాజా వ‌రంగ్ రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే.

G

National | Published On Oct 3, 2026, 7.13 am IST

PCC Chief | పీసీసీ చీఫ్‌గా భార‌త హాకీ మాజీ కెప్టెన్‌.. అమ‌రీంద‌ర్ రాజీనామాతో ప‌ర్గ‌త్‌కు అవ‌కాశం
Advertisement

PCC Chief | త్రినేత్ర న్యూస్‌: అసెంబ్లీ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న‌ వేళ పంజాబ్ కాంగ్రెస్‌లో (Punjab Congress) కీల‌క మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రెండు రోజుల క్రితం పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ (PCC Chief ) అమ‌రీంద‌ర్ సింగ్ రాజా వ‌రంగ్ రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. దీంతో ఆయ‌న స్థానంలో నూతన అధ్యక్షుడిగా పర్గత్ సింగ్‌ను (Pargat Singh) పార్టీ అధిష్ఠానం నియమించింది.

భార‌త హాకీ జ‌ట్టు మాజీ కెప్టెన్‌, ఒలింపియ‌న్ అయిన ప‌ర్గ‌త్ సింగ్‌.. క్రీడా రంగంలో తన కెరీర్ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. గ‌త కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో క్రీడలు, విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం జలంధర్ కంటోన్మెంట్ ఎమ్మ‌మెల్యేగా ఉన్నారు. పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నాలుగేండ్లకు పైగా కొనసాగిన అమరీందర్ సింగ్ (Amarinder Singh Raja Warring) ఈ నెల 1న త‌న పదవికి రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్ నేత అగ్ర‌నేత‌ రాహుల్ గాంధీని కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. పంజాబ్‌లో పార్టీ ఎదుర్కొంటున్న సవాళ్లు, బలాలు, రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై రాహుల్ గాంధీతో చర్చించినట్లు వరంగ్ తెలిపారు. రాజీనామా అనంతరం పార్టీకి ఎప్పుడు తన సేవలు అవసరమైనా అందుబాటులో ఉంటానని వరంగ్ చెప్పారు.

పార్టీలో అంతర్గత విభేదాల నేపథ్యంలో రాజా వరంగ్ రాజీనామా చేయాల్సి వ‌చ్చింది. పంజాబ్ కాంగ్రెస్‌లో చాలాకాలంగా వ‌ర్గ పోరు కొన‌సాగుతున్న‌ది. ముఖ్యంగా వరింగ్‌ వర్గానికి, మాజీ సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ (Charanjit Singh Channi) వర్గానికి మధ్య విభేదాలు ఉన్నాయి. పార్టీ కార్యక్రమాలు, సమావేశాల్లోనూ వ‌ర్గ పోరు చాలాసార్లు బ‌య‌ట‌ప‌డింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు కాంగ్రెస్‌ (Congress) గతంలో వరింగ్‌ను రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగిస్తూ.. చన్నీకి పార్టీ ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగించింది. అయిన‌ప్ప‌టికీ స‌మ‌స్య స‌మ‌సిపోలేదు. ఈ అంతర్గత విభేదాలే రాజా వరింగ్ రాజీనామాకు ప్ర‌ధాన కార‌ణంగా తెలుస్తోంది.

Advertisement
Advertisement