త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mahesh Goud | మీ ప‌దేండ్ల పాల‌న‌లో ఇచ్చిన‌ హామీలు.. వాటి అమ‌లుపై ఆత్మ‌ప‌రిశీల‌న చేసుకోండి.. కేటీఆర్‌కు పీసీసీ చీఫ్ చుర‌క‌

Mahesh Goud | తెలంగాణ ప్ర‌జ‌ల‌కు స‌మ‌స్య‌లు వ‌చ్చిన‌ప్పుడు ఎక్క‌డి పోయారంటూ కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీపై (Rahul Gandhi) ప్ర‌శ్న‌లు కురిపించిన బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ (Mahesh Goud) ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

G

Telangana | Published On Nov 13, 2026, 12.18 pm IST

Mahesh Goud | మీ ప‌దేండ్ల పాల‌న‌లో ఇచ్చిన‌ హామీలు.. వాటి అమ‌లుపై ఆత్మ‌ప‌రిశీల‌న చేసుకోండి.. కేటీఆర్‌కు పీసీసీ చీఫ్ చుర‌క‌
Advertisement

Mahesh Goud | త్రినేత్ర న్యూస్‌: తెలంగాణ ప్ర‌జ‌ల‌కు స‌మ‌స్య‌లు వ‌చ్చిన‌ప్పుడు ఎక్క‌డి పోయారంటూ కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీపై (Rahul Gandhi) ప్ర‌శ్న‌లు కురిపించిన బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ (Mahesh Goud) ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ముందు మీ పదేండ్ల‌ పాలనలో ఇచ్చిన హామీలు, వాటి అమలుపై ఆత్మపరిశీలన చేసుకోవాలంటూ కేటీఆర్‌కు (KTR) చుర‌క‌లంటించారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని హామీ ఇచ్చి.. దళితుడిని ఉప ముఖ్యమంత్రిగా చేసి రాత్రికి రాత్రే పదవి నుంచి తొలగించిన చరిత్ర బీఆర్ఎస్‌దని మండిప‌డ్డారు.

హైడ్రా (HYDRAA) పేరుతో ఇండ్ల‌ కూల్చివేతలంటూ కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వ‌జ‌మెత్తారు. ఒక్క ఇల్లు కూల్చినట్లు నిరూపించినా చర్చకు సిద్ధంగా ఉన్నాన‌ని ప్ర‌క‌టించారు. బీఆర్ఎస్‌కు ప్రజాదరణ తగ్గిపోతుందనడానికి ఇటీవల నిర్మల్‌లో జరిగిన సభే నిదర్శనమ‌ని చెప్పారు. భారత్ సమ్మిట్ విజయాన్ని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నేతలు రాజకీయాలు చేస్తున్నారని విమ‌ర్శించారు. భారత్ సమ్మిట్‌పై బీఆర్ఎస్ (BRS) నేతల విమర్శలు అసూయతో కూడుకున్నవని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం జర్నలిస్టుల వీసాలను రద్దు చేయడం ప్రపంచవ్యాప్తంగా ఖండించాల్సిన అంశమ‌న్నారు. జర్నలిస్టుల వీసాల రద్దును ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీడియా ప్రతినిధులు ఖండించాల‌న్నారు.

Advertisement
Advertisement