Honey Trap | మాజీ లవర్‌తో చేతులు కలిపి.. 12 మంది సీఐలు, ఇద్దరు అదనపు డీసీపీలను బురిడీ కొట్టించి
Honey Trap | అమ్మాయి ఖాతా నుంచి మెసేజ్ రాగానే హాయ్ అంటూ రిప్లై ఇచ్చారు. ఆ మాటల మాయలో పడి లక్షల్లో సమర్పించుకున్నారు. విచిత్రమేంటంటే ఇందులో పోలీసు అధికారులూ ఉండడం.
- 1000 మందికి పైగా బాధితులకు కుచ్చుటోపి
- డీఐ నుంచే రూ.10 లక్షలు కాజేసిన వైనం
- అమ్మాయి కాదని తెలిసినా చాటింగ్ కొనసాగించిన బాధితులు
- పవన్‌కుమార్ కేసు విచారణలో ఒక్కొక్కటిగా వెలుగులోకి షాకింగ్ విషయాలు
Honey Trap | త్రినేత్ర న్యూస్: అమ్మాయి ఖాతా నుంచి మెసేజ్ రాగానే హాయ్ అంటూ రిప్లై ఇచ్చారు. ఆ మాటల మాయలో పడి లక్షల్లో సమర్పించుకున్నారు. విచిత్రమేంటంటే ఇందులో పోలీసు అధికారులూ ఉండడం. సాధారణ జనానికి జాగ్రత్తలు సూచించే దాదాపు 12 మంది సీఐలు, ఇద్దరు అదనపు డీసీపీలే కేటుగాడి మాయలో పడ్డారు. స్వలింగ సంపర్కుడని తెలిసి కూడా ఇంకొందరు చాటింగ్ ఆపలేదు. చివరికి మోసపోయామని తెలిసి నెత్తిన చేతులేసుకోవడం వారి వంతైంది. కోల్‌కతాకు చెందిన చందన అనే అమ్మాయి పేరుతో నకిలీ ఖాతా సృష్టించిన పవన్‌కుమార్ ఆగడాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ హనీట్రాప్ రాకెట్ గుట్టును హైదరాబాద్ సిటీ పోలీసులు రట్టు చేసి, ప్రధాన సూత్రధారి కొండబత్తుల పవన్‌కుమార్ రావును అరెస్ట్ చేసిన విషయం విదితమే.
పవన్‌కుమార్ తన మాజీ ప్రియురాలితో చేతులు కలిపి ఈ వలపు సామ్రాజ్యాన్ని నడిపాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో 33, ఫేస్‌బుక్‌లో 14 నకిలీ ప్రొఫైల్స్ సృష్టించి, అందమైన అమ్మాయిల ఫోటోలను డిస్‌ప్లేగా ఉంచాడు. ముఖ్యంగా పోలీసు అధికారులను లక్ష్యంగా చేసుకుని ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపేవాడు. అవతలి వ్యక్తి స్పందించగానే శృంగార సంభాషణలు మొదలుపెట్టేవాడు.
వీడియో కాల్స్ మాట్లాడే సమయంలో బాధితుల ప్రైవేట్ వీడియోలను రికార్డ్ చేసి, వాటిని అసభ్యకరంగా మార్ఫింగ్ చేసేవాడు. ఇక “మీ బాగోతాన్ని సోషల్ మీడియాలో పెడతాం.. డిపార్ట్‌మెంట్‌కు ఫిర్యాదు చేసి ఉద్యోగం తీయిస్తాం” అంటూ బెదిరింపులకు పాల్పడి లక్షల రూపాయలు గుంజేవాడు. ఇక కొందరైతే చాట్ చేస్తున్నది అమ్మాయి కాదని తెలిసినా తర్వాత కూడా అతనితో చాటింగ్ సాగిస్తూ రావడం గమనార్హం.
రిమాండ్‌లోనే డీఐ బాలస్వామి
ఖైరతాబాద్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ (డీఐ) బాలస్వామి పవన్ మాయలో పడడం తీవ్ర చర్చనీయాంశమైంది. ‘చందన’ తన బంధువని, ఆమెతో పెళ్లి జరిపిస్తానని బాలస్వామిని మాటల్లోకి దింపాడు. అసలు చందన అనే వ్యక్తే లేనప్పటికీ.. ఆమెకు తీవ్ర అనారోగ్యంగా ఉందని నమ్మించి వైద్య ఖర్చుల పేరిట డీఐ నుంచి రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వసూలు చేశాడు. అంతటితో ఆగకుండా బాలస్వామిని భార్యాపిల్లల వద్దకు వెళ్లకుండా దాదాపు ఆరు నెలల పాటు ఓ లాడ్జిలోనే ఉంచి మానసికంగా వేధించాడు. ఇంటికి వెళితే అక్రమ కేసులు పెట్టి ఉద్యోగం ఊడేలా చేస్తానని బ్లాక్‌మెయిల్ చేశాడు. బాధితుడి భార్య గంజి హరిత ఖైరతాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు వ్యవహారం బయటపడింది. ప్రస్తుతం డీఐ బాలస్వామి రిమాండ్‌లో ఉన్నారు.
కవిత కోసం గాలింపు..
నిందితుడు పవన్‌కుమార్ చేతిలో మోసపోయిన వారి సంఖ్య వెయ్యి దాటినట్లు పోలీసులు గుర్తించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, కేరళ, తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాల్లోనూ బాధితులు ఉన్నారు. ఈ నెట్‌వర్క్ సరిహద్దులు దాటి యూఏఈ, ఒమన్, పాకిస్థాన్, కెన్యా దేశాల వరకు విస్తరించడం అధికారులను సైతం విస్తుపోయేలా చేసింది. మొత్తం బాధితుల్లో 82 మంది పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు చెందినవారే కావడం గమనార్హం. నిందితుడి బ్యాంక్ ఖాతాలు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు, ఈ దందాలో పవన్‌కు సహకరించిన కవితతో పాటు ఇతర ముఠా సభ్యుల కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు బాధితుల్లో ఉన్న పోలీసులు నకిలీ పోలీసులా, నిజమైన వారా? అనే కోణంలో ఆరా తీస్తున్నట్లు పేర్కొన్నారు.
తాజావార్తలు
- ●Acer TravelLite TL44-53M-G2 | ఏసర్ నుంచి కొత్త బిజినెస్ ల్యాప్‌టాప్.. తక్కువ ధర.. ఫీచర్లు ఎక్కువ..
- ●Jailer 2 | జైలర్ 2 టికెట్లు ఫ్రీ - విద్యుత్ కోతలపై తమిళనాడు కౌన్సిలర్ వెరైటీ నిరసన
- ●PM Modi Donald Tusk Meeting | భారత్‌తో పోలాండ్ కీలక డీల్.. ఈ 3 రంగాల్లో ఇక తిరుగుండదు!
- ●Adilabad CCI | ఇక ఆదిలాబాద్ సీసీఐ కనుమరుగు.. స్థానికుల ఆవేదన
- ●SIP | వేతనం పెరిగిన కొద్దీ ఏటా 10 శాతం ఎస్ఐపీ పెంచాలా..?
- ●Amit Shah | కాంగ్రెస్ పార్టీ 2030 నాటి ఎన్నికల్లోనూ గెలవలేదు : అమిత్ షా

Acer TravelLite TL44-53M-G2 | ఏసర్ నుంచి కొత్త బిజినెస్ ల్యాప్‌టాప్.. తక్కువ ధర.. ఫీచర్లు ఎక్కువ..

Jailer 2 | జైలర్ 2 టికెట్లు ఫ్రీ - విద్యుత్ కోతలపై తమిళనాడు కౌన్సిలర్ వెరైటీ నిరసన

PM Modi Donald Tusk Meeting | భారత్‌తో పోలాండ్ కీలక డీల్.. ఈ 3 రంగాల్లో ఇక తిరుగుండదు!

Adilabad CCI | ఇక ఆదిలాబాద్ సీసీఐ కనుమరుగు.. స్థానికుల ఆవేదన





