Dasyam Vinay Bhasker | వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు అండగా ఉంటా
Dasyam Vinay Bhasker | వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, పేదల పొట్టగొట్టాలని చూస్తే సహించేది లేదని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ స్పష్టం చేశారు.
పేదలు ఉంటున్న భూములపై పెద్దల కన్ను పడింది
సీలింగ్ యాక్ట్‌లో ఉన్న భూముల్లో నిర్మాణాలు
ఈ ప్రభుత్వంలోనే పర్మిషన్లు వచ్చాయి
వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు పట్టాలిచ్చి
పక్కా ఇండ్లు కట్టించి ఇవ్వాలి
గుడిసెవాసులను బెదిరిస్తున్నారు
స్థలాన్ని కొందరు కబ్జా చేయాలని చూస్తున్నారు
మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్
Dasyam Vinay Bhasker | త్రినేత్ర న్యూస్ : వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, పేదల పొట్టగొట్టాలని చూస్తే సహించేది లేదని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ స్పష్టం చేశారు. బుధవారం నాడు హన్మకొండ వడ్డేపల్లిలోని ఆయన నివాసంలో వైఎస్సార్ నగర్ గుడిసెవాసులు వినయ్ భాస్కర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి, తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. ఈ మేరకు కాంగ్రెస్ నాయకులు తమను బెదిరిస్తున్నారంటూ బాధితులు ఆయనకు ఒక లిఖితపూర్వక వినతిపత్రాన్ని అందజేసి, న్యాయం చేయాలని వేడుకున్నారు.
ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్సార్ నగర్‌లో పేద ప్రజలు నివాసముంటున్న భూములపై కొందరు బడా బాబులు, పెద్దల కన్ను పడిందని విమర్శించారు. సీలింగ్ యాక్ట్‌లో ఉన్న ఈ భూముల్లో జరిగిన నిర్మాణాలకు గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి అనుమతులు రాలేదని, ఇప్పడు ఈ కాంగ్రెస్ పాలనలో కొన్ని నిర్మాణాలకు అనుమతులు వచ్చాయంటే ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు అవినీతి పరులతో ములాఖత్ అయ్యారని అర్థమవుతోందని ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో పేదలకు మేలు చేయడం పక్కనబెట్టి, వారి గుడిసెలను దౌర్జన్యంగా కూల్చుతూ వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు గుడిసెవాసులను నిరంతరం భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, ఆ విలువైన స్థలాన్ని అక్రమంగా కబ్జా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. పేదలను బెదిరిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. గుడిసెవాసులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
వైఎస్సార్ నగర్‌లో నివసిస్తున్న అర్హులైన గుడిసెవాసులందరికీ తక్షణమే ప్రభుత్వ పట్టాలు పంపిణీ చేయాలని, వారందరికీ అక్కడే పక్కా ఇండ్లను నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పేద ప్రజల హక్కుల కోసం, వారి ఆత్మగౌరవం కోసం బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో పోరాడుతుందని, బాధితులకు న్యాయం జరిగే వరకు తాము విశ్రమించబోమని దాస్యం వినయ్ భాస్కర్ ఈ సందర్భంగా గుడిసెవాసులకు పూర్తి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ నగర్ కాలనీవాసులు, మహిళలు, స్థానిక బీఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●UN | దావూద్ పాకిస్థాన్‌లోనే ఉన్నాడు.. ఐరాసలో భారత్
- ●KTR | విప్లవ సూర్యుడు కుమ్రం భీం : కేటీఆర్
- ●RS Praveen Kumar | మేడిగడ్డది సిట్ వేయాల్సిన కేసు.. డీజీపీకి లేఖ రాస్తం
- ●RBI Bank Locker Gold Limits | బ్యాంకు లాకర్లో ఎంత బంగారం దాచుకోవచ్చు? ఈ ఆర్బీఐ రూల్స్ తెలుసుకోండి.. లేదంటే భారీ నష్టం!
- ●PHP Vulnerability | పీహెచ్పీలో తీవ్ర భద్రతా లోపాలు.. వెబ్సైట్లకు సైబర్ ముప్పు..
- ●Rashmika Mandanna | జాన్వీకపూర్ పెద్ది వివాదంపై రష్మిక రియాక్షన్ - "నో" చెప్పడం తప్పుకాదన్న విజయ్ దేవరకొండ

UN | దావూద్ పాకిస్థాన్‌లోనే ఉన్నాడు.. ఐరాసలో భారత్

KTR | విప్లవ సూర్యుడు కుమ్రం భీం : కేటీఆర్

RS Praveen Kumar | మేడిగడ్డది సిట్ వేయాల్సిన కేసు.. డీజీపీకి లేఖ రాస్తం

RBI Bank Locker Gold Limits | బ్యాంకు లాకర్లో ఎంత బంగారం దాచుకోవచ్చు? ఈ ఆర్బీఐ రూల్స్ తెలుసుకోండి.. లేదంటే భారీ నష్టం!




