త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Acer TravelLite TL44-53M-G2 | ఏసర్ నుంచి కొత్త బిజినెస్ ల్యాప్‌టాప్.. త‌క్కువ ధ‌ర‌.. ఫీచ‌ర్లు ఎక్కువ‌..

Acer TravelLite TL44-53M-G2 | ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ ఏసర్‌ భారత మార్కెట్లోకి కొత్త బిజినెస్ ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చింది. ట్రావెల్‌లైట్‌ టీఎల్‌44-53ఎం-జీ2 పేరుతో విడుదల చేసిన ఈ ల్యాప్‌టాప్‌లో ఇంటెల్‌ కోర్‌ అల్ట్రా సిరీస్‌ 3 ప్రాసెసర్లు, ఇంటెల్‌ వీప్రో ప్లాట్‌ఫామ్‌ను అందిస్తోంది.

S

Technology | Published On Oct 22, 2026, 3.10 pm IST

Acer TravelLite TL44-53M-G2 | ఏసర్ నుంచి కొత్త బిజినెస్ ల్యాప్‌టాప్.. త‌క్కువ ధ‌ర‌.. ఫీచ‌ర్లు ఎక్కువ‌..
Advertisement

Acer TravelLite TL44-53M-G2 | ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ ఏసర్‌ భారత మార్కెట్లోకి కొత్త బిజినెస్ ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చింది. ట్రావెల్‌లైట్‌ టీఎల్‌44-53ఎం-జీ2 పేరుతో విడుదల చేసిన ఈ ల్యాప్‌టాప్‌లో ఇంటెల్‌ కోర్‌ అల్ట్రా సిరీస్‌ 3 ప్రాసెసర్లు, ఇంటెల్‌ వీప్రో ప్లాట్‌ఫామ్‌ను అందిస్తోంది. హార్డ్‌వేర్‌ ఆధారిత భద్రతా సదుపాయాలు, రిమోట్‌ నిర్వహణ సామర్థ్యాలు వీప్రో ప్లాట్‌ఫామ్‌ ప్రత్యేకతలు. వ్యాపార అవసరాలు, కార్యాలయ పనుల కోసం రూపొందించిన ఈ ల్యాప్‌టాప్‌ ప్రారంభ ధరను రూ.85,990గా నిర్ణయించింది. ఈ ల్యాప్‌టాప్‌లో 14 ఇంచుల ఎఫ్‌హెచ్‌డీ ఐపీఎస్‌ డిస్‌ప్లేను అందించారు. ఇది 300 నిట్స్ బ్రైట్‌నెస్, 16:10 ఆస్పెక్ట్‌ రేషియోతో వస్తుంది. స్క్రీన్‌ చుట్టూ సన్నని అంచులు ఉండడంతోపాటు, అల్యూమినియం బాడీని కలిగి ఉంటుంది. దీని మందం 18 మిల్లీమీటర్ల కంటే తక్కువ కాగా, బరువు 1.4 కిలోల లోపే ఉంటుంది. అందువ‌ల్ల ఈ ల్యాప్‌టాప్‌ను ప్ర‌యాణాల్లో తీసుకెళ్ల‌డం సుల‌భ‌త‌రం అవుతుంది. 180 డిగ్రీల వరకు పూర్తిగా తెరుచుకునే హింజ్‌ను అందించారు. మిలిటరీ ప్రమాణాలకు సంబంధించిన ఎంఐఎల్‌-ఎస్‌టీడీ 810హెచ్‌ ధ్రువీకరణ కూడా ఈ ల్యాప్‌టాప్‌కు ఉంది.

బ‌యోమెట్రిక్ లాగిన్ స‌దుపాయం..

వీడియో కాల్స్‌ కోసం 5 మెగాపిక్స‌ల్‌ ఐఆర్‌ కెమెరాను అందించారు. విండోస్‌ హలో బయోమెట్రిక్‌ గుర్తింపు సదుపాయంతో లాగిన్‌ కావచ్చు. డీటీఎస్‌ ఆడియో సాంకేతికతతో కూడిన స్టీరియో స్పీకర్లు, శబ్దాన్ని తగ్గించే మైక్రోఫోన్లు ఇందులో ఉన్నాయి. థండర్‌బోల్ట్‌, డిస్‌ప్లేపోర్ట్‌, యూఎస్‌బీ ఛార్జింగ్‌కు మద్దతిచ్చే రెండు యూఎస్‌బీ టైప్ సి పోర్టులను అందించారు. వీటి ద్వారా వేగవంతమైన డేటా బదిలీ, బాహ్య డిస్‌ప్లేల అనుసంధానం, ఒకే కేబుల్‌తో ఛార్జింగ్‌ వంటి పనులు చేసుకోవచ్చు. ఎంచుకునే మోడల్‌ను బట్టి ఇంటెల్‌ వైఫై 7 (బీఈ211) 2*2, బ్లూటూత్‌ 5.4 సదుపాయాలు ఉంటాయి. స్టోరేజ్‌ కోసం రెండు ఎం.2 పీసీఐఈ ఎన్‌వీఎంఈ ఎస్‌ఎస్‌డీ స్లాట్లను అందించారు. వీటిలో పీసీఐఈ 5.0 *4 మద్దతు కూడా ఉంది. కొన్ని కాన్ఫిగరేషన్లలో గరిష్ఠంగా 128 జీబీ డ్యుయల్‌ ఛానల్‌ డీడీఆర్‌5 మెమొరీకి మద్దతు లభిస్తుంది.

ఫీచ‌ర్లు ఇవే..

ఈ ల్యాప్‌టాప్‌లో 14 ఇంచుల డబ్ల్యూయూఎక్స్‌జీఏ ఐపీఎస్‌ డిస్‌ప్లే, 1920 *1200 పిక్స‌ల్స్‌ రిజల్యూషన్‌, గరిష్ఠంగా 300 నిట్స్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. ఇంటెల్‌ కోర్‌ అల్ట్రా 5 ప్రాసెసర్లలో 115యు, 125యు, 125హెచ్‌, 135యు, 225యు, 225హెచ్‌, 235యు మోడళ్లతోపాటు, ఇంటెల్‌ కోర్‌ అల్ట్రా 7 ప్రాసెసర్లలో 155యు, 265యు, 255యు మోడళ్లను కాన్ఫిగరేషన్‌ను బట్టి ఎంచుకోవచ్చు. గ్రాఫిక్స్‌ కోసం ఇంటెల్‌ గ్రాఫిక్స్‌ అందించారు. విండోస్‌ 11 హోమ్‌, విండోస్‌ 11 ప్రొ, లినక్స్‌ ఆప్షన్లు ఉన్నాయి. మెమొరీ విభాగంలో రెండు ఎస్‌ఓడీఐఎంఎం స్లాట్ల ద్వారా గరిష్ఠంగా 64 జీబీ డ్యుయల్‌ ఛానల్‌ డీడీఆర్‌5 ర్యామ్‌, 5600 మెగాహెడ్జ్‌ వేగానికి మద్దతు లభిస్తుంది. స్టోరేజ్‌ కోసం రెండు ఎం.2 ఎస్‌ఎస్‌డీ స్లాట్లు ఉన్నాయి. వీటిలో గరిష్ఠంగా 2 టెరాబైట్ల పీసీఐఈ జనరేషన్ 4 *4 ఎస్‌ఎస్‌డీతోపాటు, అదనంగా 1 టెరాబైట్‌ వరకు పీసీఐఈ జనరేషన్ 3 *4 లేదా సాటా ఎస్‌ఎస్‌డీని కాన్ఫిగరేషన్‌ను బట్టి పొందవచ్చు. ఇక సాధారణ మోడ‌ల్‌లో 720పి హెచ్‌డీ కెమెరా ఉంటుంది. అదనపు ఆప్షన్లుగా 1080పి ఎఫ్‌హెచ్‌డీ లేదా 5 మెగాపిక్స‌ల్‌ ఐఆర్‌ కెమెరాను ఎంచుకోవచ్చు. కెమెరా కోసం ప్రైవసీ షట‌ర్‌ కూడా ఉంది. ఆడియో విభాగంలో రెండు 2 వాట్ల స్టీరియో స్పీకర్లు, శబ్దాన్ని తగ్గించే డ్యుయల్‌-అరే మైక్రోఫోన్లు ఉన్నాయి.

11 గంట‌ల వ‌ర‌కు బ్యాట‌రీ బ్యాక‌ప్‌..

కనెక్టివిటీ కోసం గిగాబిట్‌ ఈథర్‌నెట్‌, ఆప్షనల్‌గా ఇంటెల్‌ వైఫై 6, వైఫై 6ఈ లేదా వైఫై 7, బ్లూటూత్‌ 5.2, 5.3 లేదా 5.4 సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. రెండు యూఎస్‌బీ 3.2 జనరేషన్‌ 1 టైప్ ఎ పోర్టులు, ఒక యూఎస్‌బీ 3.2 జనరేషన్‌ 2 టైప్ సి పోర్టు, ఒక యూఎస్‌బీ 3.2 జనరేషన్‌ 1 టైప్ సి పోర్టు, హెచ్‌డీఎంఐ 2.1, మైక్రోఎస్‌డీ కార్డ్‌ రీడర్‌, 3.5 మిల్లీమీటర్ల ఆడియో కాంబో జాక్‌ ఉన్నాయి. భద్రత కోసం టీపీఎం 2.0, బయోస్‌ పాస్‌వర్డ్‌లు, కెన్సింగ్టన్‌ లాక్‌ స్లాట్‌ వంటి సదుపాయాలను అందించారు. అలాగే ఫింగర్‌ప్రింట్‌ రీడర్‌ను ఎంచుకునే అవకాశం ఉంది. బ్యాటరీ సామర్థ్యం 60 వాట్ అవర్‌లు కాగా, మూడు సెల్‌ల లిథియం అయాన్‌ బ్యాటరీని ఉపయోగించారు. ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు మద్దతు ఉంది. హెచ్‌డీ వీడియో ప్లేబ్యాక్‌లో గరిష్ఠంగా 12 గంటల బ్యాటరీ బ్యాకప్‌ లభిస్తుందని కంపెనీ పేర్కొంది. మొబైల్‌మార్క్‌ 2025 పరీక్ష ప్రకారం బ్యాటరీ బ్యాకప్‌ 11 గంటల వరకు ఉంటుంది.

ధ‌ర వివ‌రాలు..

ల్యాప్‌టాప్ ప్రారంభ బరువు 1.38 కిలోలు. ఛార్జింగ్‌ కోసం 65 వాట్ల యూఎస్‌బీ టైప్ సి పవర్‌ అడాప్టర్‌ను అందిస్తున్నారు. నీరు లేదా ద్రవాలు పడినప్పుడు నష్టాన్ని తగ్గించే స్పిల్ రెసిస్టెంట్‌ కీబోర్డ్‌ ఉంది. బ్యాక్‌లిట్‌ కీబోర్డ్‌ను అదనపు ఆప్షన్‌గా ఎంచుకోవచ్చు. ఈ డివైస్ సీఈ, సీబీ, ఎఫ్‌సీసీ, ఎనర్జీ స్టార్‌ 8.0, ఆర్‌ఓహెచ్‌ఎస్‌, విండోస్‌ 11 డబ్ల్యూహెచ్‌క్యూఎల్‌ ప్రమాణాలకు అనుగుణంగా ఉంది. ఏసర్‌ ట్రావెల్‌లైట్‌ టీఎల్‌44-53ఎం-జీ2 ల్యాప్‌టాప్‌ ఏసర్‌ వాణిజ్య, ఎంటర్‌ప్రైజ్‌ విక్రయ మార్గాల ద్వారా అందుబాటులోకి రానుంది. అమెజాన్‌ ఇండియా వంటి ఆన్‌లైన్‌ వేదికలలోనూ కొనుగోలు చేయవచ్చు. దీని ప్రారంభ ధరను రూ.85,990గా నిర్ణయించారు. అయితే ప్రాసెసర్‌, మెమొరీ, స్టోరేజ్‌, ఇతర సదుపాయాల ఆధారంగా వేర్వేరు కాన్ఫిగరేషన్ల ధరలు మారుతాయి.

Advertisement
Advertisement