Revanth Reddy | ట్యాంక్‌బండ్‌పై పండుగ సాయన్న, దొడ్డి కొమురయ్యల విగ్రహాలు పెడతాం
Revanth Reddy | చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, పండుగ సాయన్నల చరిత్రను కనుమరుగు చేశారని.. ట్యాంక్‌బండ్‌పై పండుగ సాయన్న, దొడ్డి కొమురయ్యల విగ్రహాలను ఆవిష్కరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అన్నారు.
- సాయన్న, గద్దర్, అందెశ్రీలు సమాజం కోసమే బతికారు
- బహుజనులు బాగుపడాలంటే రాహుల్ ప్రధాని కావాలి
- వచ్చే ఎన్నికల్లో అండగా ఉండాలి
- పండుగ సాయన్న జయంతి వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి
Revanth Reddy | త్రినేత్ర న్యూస్: చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, పండుగ సాయన్నల చరిత్రను కనుమరుగు చేశారని.. ట్యాంక్‌బండ్‌పై పండుగ సాయన్న, దొడ్డి కొమురయ్యల విగ్రహాలను ఆవిష్కరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అన్నారు. సాయన్న, గద్దర్, అందెశ్రీ వంటి వారు జీవితమంతా సమాజం కోసమే ధారపోశారని కొనియాడారు. ముదిరాజ్‌లకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చే అంశాన్ని పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సూచిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వంలో ముదిరాజ్‌లను భాగస్వాములను చేసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. బహుజనుల జీవితాలు బాగుపడాలంటే రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రధానమంత్రి కావాలన్నారు. వచ్చే ఎన్నికల్లో రాహుల్‌కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. గురువారం రవీంద్ర భారతిలో నిర్వహించిన పండగ సాయన్న జయంతి వేడుకల్లో ఆయన ప్రసంగించారు.
ఆడ పిల్లల పెళ్లిల్లకు సాయం చేశాడు
కొడంగల్ నియోజకవర్గంలో అత్యధిక జనాభా ముదిరాజులే. ముదిరాజులు విశ్వసనీయమైనవారు. భూస్వాములు తన భూమిని ఆక్రమించుకునప్పుడు పండుగ సాయన్న ఎదురుతిరిగారు. నిజాం హయాంలో దొరలు పేదల భూమి ఆక్రమిస్తుంటే పేదలకు అండగా నిలిచాడు. దొరలకు వ్యతిరేకంగా దళాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి పండుగ సాయన్న. సాయన్న ప్రజలకు ధాన్యం పంచడమే కాదు, పేద ఆడ పిల్లల పెళ్లిల్లకు ఆర్థిక సాయం చేసిన ఘనత పండుగ సాయన్నది.
కుల గణనతోనే గళం బలమైంది..
సాయన్నను నిజాం పోలీసులు అరెస్టు చేస్తే నాటి వనపర్తి మహారాణి పెద్ద ఎత్తున నిధులు చెల్లించి విడిపించారు. పండుగ సాయన్నను అన్యాయంగా హత్య చేశారు. ఆయన చనిపోయి వందేళ్లు దాటినా నేటికీ నాట్లు, కోతల సమయంలో పండుగ సాయన్న పాటలు వినిపిస్తున్నాయి. బ్రిటిష్ హయాంలో కుల గణన చేశారు. వందేళ్ల తర్వాత మా ప్రభుత్వం కుల గణన చేపట్టింది. కుల గణన చేసినందునే ఈరోజు ప్రతి కులం తమ గళం బలంగా వినిపిస్తోంది. ఎవరైనా కుల గణనలో తమ జనాభా తక్కువగా ఉందని భావిస్తే పూర్తి వివరాలు ఇస్తే లెక్కలు సవరిస్తాం.
ఆ అంశంపై వచ్చే క్యాబినెట్‌లో చర్చిస్తం..
లెక్కలు లేనందునే ముదిరాజ్ లను బీసీ-డీ నుంచి బీసీ-ఏ కు మార్చలేకపోయారు. ఈ అంశంపై వచ్చే క్యాబినెట్‌లో చర్చిస్తాం. మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసి, పూర్తి స్థాయిలో అధ్యయనం చేయిస్తాం. ఈ అంశంపై ఇతర కులాలకు ఉన్న అపోహలు, అనుమానాలు నివృత్తి చేయాల్సి ఉంది. జఠిలమైన ఎస్సీ వర్గీకరణను అమలు చేశాం. బీసీ కుల గణన చేపట్టాం. పీసీసీ అధ్యక్షుడిని కాగానే శ్రీహరి ముదిరాజ్‌ను డీసీసీ ప్రెసిడెంట్ గా నియమించా. శ్రీహరికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చా.. మంత్రిని చేశా. నీలం మధుకు ఎంపీ ఎంపీ టికెట్ ఇచ్చా.
నాడు ఎన్టీఆర్ రెండు రూపాయల కిలో బియ్యం ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుంది. 3.48 కోట్ల మందికి నేడు సన్న బియ్యం ఇస్తున్నాం. గత ప్రభుత్వాలు చేసిన సంక్షేమానికి రెట్టింపు చేస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తున్నాం.. ప్రతి ఊరిలో ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తున్నాం. తెలంగాణ వచ్చాక తెలంగాణ రాష్ట్ర గీతం అధికారికంగా ప్రకటించుకున్నాం. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్ అమలు చేసిన మంచి పథకాలు అమలు చేస్తూనే రెట్టింపు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. వచ్చే ఎన్నికలు ఎంతో కీలకం.. ఆ ఎన్నికల్లో రాహుల్‌కు అండగా నిలవాలి అని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Dasyam Vinay Bhasker | వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు అండగా ఉంటా
- ●UN | దావూద్ పాకిస్థాన్‌లోనే ఉన్నాడు.. ఐరాసలో భారత్
- ●KTR | విప్లవ సూర్యుడు కుమ్రం భీం : కేటీఆర్
- ●RS Praveen Kumar | మేడిగడ్డది సిట్ వేయాల్సిన కేసు.. డీజీపీకి లేఖ రాస్తం
- ●RBI Bank Locker Gold Limits | బ్యాంకు లాకర్లో ఎంత బంగారం దాచుకోవచ్చు? ఈ ఆర్బీఐ రూల్స్ తెలుసుకోండి.. లేదంటే భారీ నష్టం!
- ●PHP Vulnerability | పీహెచ్పీలో తీవ్ర భద్రతా లోపాలు.. వెబ్సైట్లకు సైబర్ ముప్పు..

Dasyam Vinay Bhasker | వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు అండగా ఉంటా

UN | దావూద్ పాకిస్థాన్‌లోనే ఉన్నాడు.. ఐరాసలో భారత్

KTR | విప్లవ సూర్యుడు కుమ్రం భీం : కేటీఆర్

RS Praveen Kumar | మేడిగడ్డది సిట్ వేయాల్సిన కేసు.. డీజీపీకి లేఖ రాస్తం



