త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KCR | నెక్స్ట్ ..సీఎంగా మీరే రావాలె

KCR | నెక్స్ట్ సీఎంగా కేసీఆరే( KCR ) రావాలంటూ అభిమానులు అభిలషించారు. బీఆర్ఎస్‌కు చెందిన వరంగల్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి( Peddi Sudarshan Reddy ) ఆదివారం నాడు తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. కాగా, ఇవాళ పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డిని పరామర్శించేందుకు కేసీఆర్.. సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి( Yashoda Hospital ) వెళ్లారు. ఆయనను చూసేందుకు చాలామంది ఉత్సుకత ప్రదర్శించారు.

S

Telangana | Published On Jul 27, 2026, 7.28 pm IST

KCR | నెక్స్ట్ ..సీఎంగా మీరే రావాలె
Advertisement

సికింద్రాబాద్ య‌శోదా ఆస్ప‌త్రిలో
పేషెంట్ల నినాదాలు
కేసీఆర్‌ను చూడ‌గానే ఉప్పొంగిన ఆనందం

KCR | త్రినేత్ర‌.న్యూస్ : నెక్స్ట్ సీఎంగా కేసీఆరే( KCR ) రావాలంటూ అభిమానులు అభిలషించారు. బీఆర్ఎస్‌కు చెందిన వరంగల్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి( Peddi Sudarshan Reddy ) ఆదివారం నాడు తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. కాగా, ఇవాళ పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డిని పరామర్శించేందుకు కేసీఆర్.. సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి( Yashoda Hospital ) వెళ్లారు. ఆయనను చూసేందుకు చాలామంది ఉత్సుకత ప్రదర్శించారు. ఆస్పత్రి లోపల ఉన్న లిఫ్ట్ వద్దకు చేరుకోగానే పేషెంట్లు కొందరు.. నెక్స్ట్ సీఎంగా మీరే రావాలె.. అని బిగ్గరగా అరిచి.. కేసీఆర్‌కు తమ మద్దతు ప్రకటించారు.

ఇక య‌శోదా ఆస్ప‌త్రి సిబ్బంది కూడా కేసీఆర్‌ను క‌లిసేందుకు సుముఖ‌త చూపారు. కేసీఆర్‌తో క‌రచాల‌నం చేసేందుకు ఆస‌క్తి చూపారు. కేసీఆర్‌ను చూడ‌గానే.. విధుల్లో ఉన్న న‌ర్సులు, ఇత‌ర సిబ్బంది ముఖాల్లో తెలియ‌ని ఆనందం ఉప్పొంగింది. మ‌ళ్లీ సీఎంగా కేసీఆర్‌ను చూడాల‌నే తాప‌త్ర‌యం వారిలో కొట్టొచ్చిన‌ట్టు క‌నిపించింది.

Advertisement
Advertisement