త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mahesh Goud | ప్రజా తిరుగుబాటుకు స్ఫూర్తిగా నిలిచిన మహనీయుడు పండుగ సాయన్న: మహేశ్‌ కుమార్ గౌడ్

Mahesh Goud | పేదలు, బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన వీరుడు, తెలంగాణ గడ్డపై ప్రజా తిరుగుబాటుకు స్ఫూర్తిగా నిలిచిన మహనీయుడు పండుగ సాయన్న అని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్ గౌడ్ (Mahesh Goud) అన్నారు.

G

Telangana | Published On Oct 22, 2026, 12.49 pm IST

Mahesh Goud | ప్రజా తిరుగుబాటుకు స్ఫూర్తిగా నిలిచిన మహనీయుడు పండుగ సాయన్న: మహేశ్‌ కుమార్ గౌడ్
Advertisement

Mahesh Goud | త్రినేత్ర న్యూస్‌: పేదలు, బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన వీరుడు, తెలంగాణ గడ్డపై ప్రజా తిరుగుబాటుకు స్ఫూర్తిగా నిలిచిన మహనీయుడు పండుగ సాయన్న అని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్ గౌడ్ (Mahesh Goud) అన్నారు. నిజాం పాలనలో దొరలు, జమీందారుల దోపిడీకి వ్యతిరేకంగా సాయన్న (Panduga Sayanna) సాగించిన పోరాటం అణగారిన వర్గాల్లో ఆత్మ గౌరవాన్ని, ధైర్యాన్ని నింపిందని చెప్పారు. నిజామాబాద్ కలెక్టరేట్‌లో జరిగిన పండుగ సాయన్న జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. సామాజిక అసమానతలు, అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలిచిన ఆయన సాహసం తెలంగాణ (Telangana) చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని పేర్కొన్నారు. పండుగ సాయన్న జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని, పేదలు, బలహీన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

సమానత్వం, సామాజిక న్యాయం, ఆత్మగౌరవం కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తున్న‌దని వెల్ల‌డించారు. పండుగ సాయన్న ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణలో సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, పేదల సంక్షేమం కోసం మరింత బలంగా పనిచేయడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని చెప్పారు.

Advertisement
Advertisement