త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | నిరంకుశ పాలనను ఎదిరించిన కుమ్రం భీమ్.. నిరుపేదల పక్షాన నిలబడ్డ బహుజన పోరాట యోధుడు పండుగ సాయ‌న్న‌: హ‌రీశ్ రావు

Harish Rao | తెలంగాణ పోరాట యోధులు కుమ్రం భీమ్ (Kumram Bheem), పండుగ సాయ‌న్న జ‌యంతి సంద‌ర్భంగా (Birth Anniversary) బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు (Harish Rao) ఘ‌నంగా నివాళులు అర్పించారు. వారి పోరాట స్ఫూర్తి త‌ర‌త‌రాల‌కు ఆద‌ర్శ‌మ‌ని ఎక్స్ వేదిక‌గా తెలిపారు.

G

Telangana | Published On Oct 22, 2026, 10.23 am IST

Harish Rao | నిరంకుశ పాలనను ఎదిరించిన కుమ్రం భీమ్.. నిరుపేదల పక్షాన నిలబడ్డ బహుజన పోరాట యోధుడు పండుగ సాయ‌న్న‌: హ‌రీశ్ రావు
Advertisement

Harish Rao | త్రినేత్ర న్యూస్‌: తెలంగాణ పోరాట యోధులు కుమ్రం భీమ్ (Kumram Bheem), పండుగ సాయ‌న్న జ‌యంతి సంద‌ర్భంగా (Birth Anniversary) బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు (Harish Rao) ఘ‌నంగా నివాళులు అర్పించారు. వారి పోరాట స్ఫూర్తి త‌ర‌త‌రాల‌కు ఆద‌ర్శ‌మ‌ని ఎక్స్ వేదిక‌గా తెలిపారు.

`గిరిజనుల హక్కుల కోసం పోరాడి.. జల్, జంగల్, జమీన్ నినాదంతో నిరంకుశ పాలనను ఎదిరించిన తెలంగాణ వీరుడు కుమ్రం భీమ్. ఆదివాసీల ఆత్మగౌరవం కోసం, వారి హక్కుల సాధన కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయం. ఆ పోరాట స్ఫూర్తి తరతరాలకు ఆదర్శం.

మా గూడెంలో మా రాజ్యం అంటూ నాడు భీమ్ చేసిన నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకొని కేసీఆర్ 3146 గూడేలను, తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి వారి స్వయం పాలన కలను నిజం చేశారు. ఆ మహనీయుడిని గౌరవిస్తూ కుమ్రం భీమ్ పేరుతో కొత్త జిల్లాను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో కుమ్రం భీమ్ ఆత్మగౌరవ భవనాన్ని నిర్మించడంతో పాటు, వారి జయంతిని అధికారికంగా నిర్వహించి భావితరాలకు ఆయన పోరాట స్ఫూర్తిని అందించారు. మహనీయుడు కొమురం భీమ్ గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు.`

`అన్యాయంపై తిరగబడి, నిరుపేదల పక్షాన నిలబడ్డ బహుజన పోరాట యోధుడు పండుగ సాయన్న (Panduga Sayanna) జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు. పాలకుల దోపిడీని ఎదిరించి, పేద ప్రజల ఆకలి తీర్చడం కోసం, బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన సాయన్న పోరాటం తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. వారి పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శం.` అంటూ హ‌రీశ్ రావు ట్వీట్ చేశారు.

Advertisement
Advertisement