త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dharmapuri Arvind | ఒక‌రినొక‌రు కాపాడుకుంటున్న కేసీఆర్‌, రేవంత్ రెడ్డి: ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్‌

Dharmapuri Arvind | కేసీఆర్‌, రేవంత్ రెడ్డి ఒక‌రినొక‌రు కాపాడుకుంటున్నార‌ని నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్ (Dharmapuri Arvind) విమ‌ర్శించారు. కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) పార్టీలు భవిష్యత్తులో కలవడం ఖాయమని చెప్పారు. 2029 ఎన్నికల్లో ఆ రెండు పార్టీలను రాజకీయంగా గల్లంతు చేస్తామని స్ప‌ష్టం చేశారు.

G

Telangana | Published On Oct 22, 2026, 12.31 pm IST

Dharmapuri Arvind | ఒక‌రినొక‌రు కాపాడుకుంటున్న కేసీఆర్‌, రేవంత్ రెడ్డి: ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్‌
Advertisement

Dharmapuri Arvind | త్రినేత్ర న్యూస్‌: కేసీఆర్‌, రేవంత్ రెడ్డి ఒక‌రినొక‌రు కాపాడుకుంటున్నార‌ని నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్ (Dharmapuri Arvind) విమ‌ర్శించారు. కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) పార్టీలు భవిష్యత్తులో కలవడం ఖాయమని చెప్పారు. 2029 ఎన్నికల్లో ఆ రెండు పార్టీలను రాజకీయంగా గల్లంతు చేస్తామని స్ప‌ష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ (BJP)సునామీ సృష్టిస్తుందని, ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని వెల్ల‌డించారు. పార్టీ ఎమ్మెల్యేలు, నాయ‌కుల‌తో క‌లిసి నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో రైతుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లుగా మారిందన్నారు. ప్ర‌పంచం మొత్తం ఎల్‌నినో ప్ర‌భావం ఉంది. ఎల్‌నినో ప్రభావం ఉంటుందని తెలిసినా కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టడంలో విఫలమైందని విమ‌ర్శించారు. రైతులకు ఎకరానికి రూ.50 వేల పరిహారం ప్రకటించిన తర్వాతే క్రాప్ హాలిడే గురించి నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సాగునీటి ప్రాజెక్టుల డిజైన్ల మార్పుల వెనుక భారీ అవినీతి ఉందని ఆరోపించారు. కాళేశ్వ‌రంలో మూడు బ్యారేజీల‌ను ప‌నికిరాకుండా క‌ట్టార‌ని విమ‌ర్శించారు. గ్రావిటీతో నీరు పారేలా ప్రాణ‌హిత-చేవెళ్ల ప్రాజెక్టును డిజైన్ చేశారు. దానిని ప‌క్క‌కు పెట్టి కూలిపోయే, ప‌గుళ్లు ప‌ట్టిన కాళేశ్వ‌రం (Kaleshwaram Project) క‌ట్టార‌ని విమ‌ర్శించారు. ఎలాంటి అనుమ‌తులు లేకుండానే ప్రాజెక్టునే నిర్మించారు. 2019లో ప్రాజెక్టుల్లో నీళ్లు నింప‌డంతోనే ప‌ర్రెలు వ‌చ్చాయ‌ని, అప్పుడే గ‌మ‌నించి రిపేర్లు చేసిన‌ట్ల‌యితే ఈ ప‌రిస్థితి రాక‌పోతుండెన‌ని చెప్పారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి ఒకరినొకరు కాపాడుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు భవిష్యత్తులో కలవడం ఖాయమన్నారు. గ‌డ్డం పెంచుకున్నంత మాత్రాన కేటీఆర్‌ ముఖ్యమంత్రి కాలేరని ఎద్దేవా చేశారు. హేర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసుకుని, గ‌డ్డానికి రంగేసుకున్నంత మాత్రాన సీఎం కాలేవ‌న్నారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టు, ఆయుష్మాన్ భార‌త్‌, జాబ్ క్యాలండ‌ర్లు బంద్ కావ‌డానికి, హౌసిండ్ శాఖ బంద్ కావ‌డానికి ఎవ‌రు స‌మాధానం చెబుతార‌ని ప్ర‌శ్నించారు.

రేవంత్ రెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్‌గా ఉందని వ్యాఖ్యానించారు. వ‌చ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను రాజకీయంగా గల్లంతు చేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ సునామీ సృష్టిస్తుందని (Safran Tsunami) చెప్పారు. కాషాయ సునామీలో ఆ రెండు పార్టీలు కొట్టుకుపోతాయ‌న్నారు. ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌కు ఓటు వేయ‌డం అంటే మీ పిల్ల‌ల‌ను మీరు శపించిన‌ట్లేన‌ని చెప్పారు. బీజేపీ అధికారంలోకి రాగానే ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై కార్యాచరణ చేపడతామని వెల్ల‌డించారు.

Advertisement
Advertisement