Shashi Tharoor | నేనేమీ ట్రావెల్ ఏజెంట్‌ను కాదు.. రాహుల్ విదేశీ పర్యటనపై శశిథరూర్ వ్యాఖ్యలు
Shashi Tharoor | ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) విదేశీ పర్యటనపై కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor) తనదైన శైలిలో స్పందించారు. తానేమీ ట్రావెల్ ఏజెంట్‌ను కాదంటూ విలేకరుల ప్రశ్నకు ఘాటుగా సమాధానమిచ్చారు.
Shashi Tharoor | త్రినేత్ర న్యూస్ : సర్ వ్యవహారం, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ (CEC Gyanesh Kumar) రాజీనామాకు డిమాండ్ చేస్తూ దేశంలో విపక్షాల ఆందోళనలు కొనసాగుతున్న వేళ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) విదేశీ పర్యటనకు వెళ్లడం రాజకీయ దుమారం రేపుతోంది. రాహుల్ పర్యటనపై అధికార ఎన్డీయే, విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాహుల్ వియత్నాం పర్యటనపై కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor) తనదైన శైలిలో స్పందించారు. తానేమీ ట్రావెల్ ఏజెంట్‌ను కాదంటూ విలేకరుల ప్రశ్నకు ఘాటుగా సమాధానమిచ్చారు.
ప్రస్తుతం కేరళ పర్యటనలో ఉన్న థరూర్‌ను విలేకరులు రాహుల్ గాంధీ విదేశీ పర్యటనపై ప్రశ్నించారు. అయితే, ఈ అంశంపై మాట్లాడేందుకు నిరాకరించిన థరూర్.. "నేనేమీ ట్రావెల్ ఏజెంట్ కాదు. నన్ను ఆ ప్రశ్న అడగడంలో అర్థమే లేదు. నేను ఢిల్లీ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చానో.. అలానే ప్రతీ ఒక్కరికీ కొన్ని బాధ్యతలు ఉంటాయి. రాహుల్ పర్యటన వెనుక కూడా ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది" అని తనదైన శైలిలో సమాధానమిచ్చారు.
రాహుల్ విదేశీ పర్యటన..
కాగా, సర్‌కు వ్యతిరేకంగా సీఈసీ రాజీనామా డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీలో నిరసనలు కొనసాగుతున్న వేళ రాహుల్ గాంధీ నాలుగు రోజుల పాటూ వియత్నాం పర్యటకు వెళ్లడం రాజకీయ దుమారం రేపుతోంది. ఢిల్లీలో అబద్ధాలు వ్యాప్తి చేసి అలసిపోయిన రాహుల్.. విరామం కోసం విదేశీ పర్యటనకు వెళ్లారంటూ బీజేపీ ఆరోపించింది. ఆయన వియత్నాం వెళ్లే ఫ్లైట్ ఎక్కారంటూ వీడియో షేర్ చేసింది.
జార్జ్ సోరస్ నుంచి కోచింగ్ తీసుకుంటున్నారు
రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లి దేశంలో పాలనా మార్పు కోసం కుట్రలు పన్నుతున్నారంటూ బీజేపీ నేత సంబిత్ పాత్ర ఆరోపించారు. జార్జ్ సోరస్ నుంచి ఆయన పాఠాలు నేర్చుకుంటున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. "రాహుల్ గాంధీ.. భారతదేశాన్ని ఎలా నాశనం చేయాలి, పాలనా మార్పును ఎలా తీసుకురావాలి అనే అంశాలపై జార్జ్ సోరస్, ఆయన కంపెనీ నుంచి కోచింగ్ క్లాసులు తీసుకునేందుకు విదేశాలకు వెళ్లారు" అని సంబిత్ పాత్ర ఆరోపించారు.
రాహుల్‌కి చాలా బాధ్యతలు ఉన్నాయి
బీజేపీ ఆరోపణలు హస్తం పార్టీ తిప్పికొట్టింది. ఆయనకు కొన్ని బాధ్యతలు ఉన్నాయని స్పష్టం చేసింది.
ఈ రోజుల్లో ఎవరూ విదేశాలకు వెళ్లడం లేదా..? అంటూ ప్రశ్నించింది. లోక్‌సభలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్‌కు కొన్ని బాధ్యతలు ఉన్నాయని పేర్కొంది. ఆయన లండన్, యేల్ యూనివర్సిటీల్లో విద్యార్థులతో సంభాషించడం, మేధావులతో చర్చలు జరుపుతారని తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీలా కాకుండా రాహుల్ ప్రెస్ ఇంటర్వ్యూలు కూడా ఇస్తారని చెప్పుకొచ్చింది. అలాంటప్పుడు రాహుల్ విదేశీ పర్యటనతో బీజేపీకి సమస్య ఏంటి? అని ప్రశ్నించింది.
Also Read..
ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సోనియా గాంధీ.. తొలి పోస్ట్ ఇదే..!
పండుగ సీజన్.. గ్రే కాలర్ ఉద్యోగులకు విపరీతమైన డిమాండ్
సంబంధిత వార్తలు

Dharmapuri Arvind | ఒకరినొకరు కాపాడుకుంటున్న కేసీఆర్, రేవంత్ రెడ్డి: ఎంపీ ధర్మపురి అరవింద్
అక్టోబర్ 22, 2026

Akhilesh Yadav Slams BJP | అక్రమాలకు పాల్పడితే జైలుకే: విద్యాశాఖ అధికారులకు అఖిలేష్ యాదవ్ స్ట్రాంగ్ వార్నింగ్
అక్టోబర్ 21, 2026

Mallikarjun Kharge | ప్రస్తుత సీట్లలోనే మహిళా రిజర్వేషన్లను అమలు చేయొచ్చు : ఖర్గే
అక్టోబర్ 21, 2026
తాజావార్తలు
- ●Dharmapuri Arvind | ఒకరినొకరు కాపాడుకుంటున్న కేసీఆర్, రేవంత్ రెడ్డి: ఎంపీ ధర్మపురి అరవింద్
- ●Reliance Industries | జియో ఐపీఓకు భారీ స్పందన.. అయినా పతనంలో రిలయన్స్ షేరు..
- ●Sonia Gandhi | ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సోనియా గాంధీ.. తొలి పోస్ట్ ఇదే..!
- ●Grey-Collar Jobs | పండుగ సీజన్.. గ్రే కాలర్ ఉద్యోగులకు విపరీతమైన డిమాండ్
- ●Indus Valley Civilisation Collapse | వరదలు కాదు, యుద్ధాలూ కాదు.. సింధూ నాగరికత అంతం వెనుక 4,000 ఏళ్ల మిస్టరీని ఛేదించిన సైంటిస్టులు
- ●Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.17వేలు తగ్గిన పసిడి ధర.. మళ్లీ మొదలైన టెన్షన్..?

Dharmapuri Arvind | ఒకరినొకరు కాపాడుకుంటున్న కేసీఆర్, రేవంత్ రెడ్డి: ఎంపీ ధర్మపురి అరవింద్

Reliance Industries | జియో ఐపీఓకు భారీ స్పందన.. అయినా పతనంలో రిలయన్స్ షేరు..

Sonia Gandhi | ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సోనియా గాంధీ.. తొలి పోస్ట్ ఇదే..!

Grey-Collar Jobs | పండుగ సీజన్.. గ్రే కాలర్ ఉద్యోగులకు విపరీతమైన డిమాండ్



