త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Medical Shops | రాష్ట్రంలో 25 వేలకు పైగా మెడిక‌ల్ షాపులు బంద్‌.. వాటికి మిన‌హాయింపు..

Medical Shops | ఆన్‌లైన్ అమ్మ‌కాల‌కు నిర‌స‌న‌గా దేశ‌వ్యాప్తంగా మెడిక‌ల్ షాపులు (Medical Shops) మూత‌ప‌డ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా 25 వేలకు పైగా మెడిక‌ల్ షాపులు బంద్‌ను (Shutdown) పాటిస్తున్నాయి. ఒక్క హైదరాబాద్‌లోనే 12 వేలకుపైగా ఔషధ దుకాణాలు తెర‌చుకోలేదు.

G

Telangana | Published On May 20, 2026, 8.30 am IST

Medical Shops | రాష్ట్రంలో 25 వేలకు పైగా మెడిక‌ల్ షాపులు బంద్‌.. వాటికి మిన‌హాయింపు..
Advertisement

Medical Shops | త్రినేత్ర‌.న్యూస్‌: ఆన్‌లైన్ అమ్మ‌కాల‌కు నిర‌స‌న‌గా దేశ‌వ్యాప్తంగా మెడిక‌ల్ షాపులు (Medical Shops) మూత‌ప‌డ్డాయి. కార్పొరేట్ కంపెనీలు ఇచ్చే డిస్కౌంట్లు, ఆన్ అమ్మ‌కాల‌తో (Online Medicine Sales) చిన్న ఔష‌ధ దుకాణాలపై తీవ్ర ప్ర‌భావం ప‌డుతున్న‌ద‌ని, వాటిని నియంత్రించాల‌ని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా ఆర్గ‌నైజేష‌న్ ఆఫ్ కెమిస్ట్, డ్ర‌గ్గిస్ట్ (AIOCD) ఒక్క‌రోజు స‌మ్మెకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 25 వేలకు పైగా మెడిక‌ల్ షాపులు బంద్‌ను (Shutdown) పాటిస్తున్నాయి. ఒక్క హైదరాబాద్‌లోనే 12 వేలకుపైగా ఔషధ దుకాణాలు తెర‌చుకోలేదు. అయితే ద‌వాఖాన‌ల‌కు అనుబంధంగా ఉన్న మెడికల్ షాపులకు బంద్ నుంచి మినహాయింపు ఇచ్చారు. బంద్ విషయంలో ప్రజలు ఆందోళన చెందవద్దని డీసీఏ ప్రకటించింది.

అన్ని ప్రభుత్వ, కార్పొరేట్‌, ప్రైవేట్ హాస్పిట‌ళ్ల‌లో మెడికల్‌ దుకాణాలు యధావిధిగా పనిచేస్తున్నాయి. గాంధీ, ఉస్మానియా, నిలోఫర్‌, నిమ్స్‌లో మెడికల్‌ దుకాణాలు తెరిచి ఉంటాయని నిర్వాహకులు వెల్లడించారు. అదేవిధంగా అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్లు, బస్తీ దవాఖానాల్లో ఫార్మసీలు తెరిచే ఉంటాయని వైద్యాధికారులు తెలిపారు.

Advertisement
Advertisement