MLA Sanjay | ప్రమీల చాలా మంది పసిబిడ్డలను కాపాడారు
MLA Sanjay | ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్‌లో పసిబిడ్డలు ప్రాణాలు కోల్పోయారని కోరుట్ల ఎమ్మెల్యే డా.సంజీవ్, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆవేదన వ్యక్తం చేశారు.
Flash news | Published On Sep 28, 2026, 4.20 pm IST
- నిమ్స్‌లో ప్రమీలను పరామర్శించిన కోరుట్ల ఎమ్మెల్యే డా.సంజీవ్, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, బీఆర్ఎస్‌వీ నేతలు
MLA Sanjay | త్రినేత్ర న్యూస్: ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్‌లో పసిబిడ్డలు ప్రాణాలు కోల్పోయారని కోరుట్ల ఎమ్మెల్యే డా.సంజీవ్, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో నర్స్ ప్రమీల ధైర్య సాహసాలు ప్రదర్శించి చాలా మంది చిన్నారులను కాపాడడం అభినందనీయమన్నారు. కేటీఆర్ ఆదేశాల మేరకు సోమవారం నాయకులతో కలిసి నర్స్ ప్రమీలను హైదరాబాద్ నిమ్స్‌లో వారు పరామర్శించారు. బాధిత కుటుంబాలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
రిమ్స్ హాస్పిటల్ లో షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన ప్రమాదంలో 27 మంది చిన్నారులలో నర్స్ ప్రమీల చాలా మందిని కాపాడారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే పసిబిడ్డలు ప్రాణాలు కోల్పోయారు. బాధితులకు ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలి. బీఆర్ఎస్ తరఫున అన్ని విధాలా అండగా ఉంటాం అని ఎమ్మెల్యే సంజయ్ తెలిపారు.
ఈ పరామర్శలో జడ్పీ మాజీ చైర్మన్లు తుల ఉమ, బిందు, బీఆర్ఎస్‌వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పడాల సతీష్, రాష్ట్ర నాయకులు హరిబాబు, సాయి తేజ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ●Ashika Ranganath | ఏజ్ గ్యాప్‌పై ట్రోల్స్ - అజిత్ సినిమా నుంచి శ్రీలీల ఔట్ - కన్నడ బ్యూటీకి ఛాన్స్
- ●Supreme Court | టీఎంసీ పార్టీ గుర్తు, పేరుపై వివాదం.. ఎన్నికల సంఘానికి సుప్రీం కీలక ఆదేశాలు
- ●Stock Markets | రూ.6 లక్షల కోట్లు ఆవిరి.. స్టాక్ మార్కెట్లలో వాటర్ ఫాల్.. భారీగా అమ్మకాలు..
- ●Congress Leaders Rally | సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలి
- ●Esha Singh | షూట్ఆఫ్స్లో అదరగొట్టిన ఈషా.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో పతకం..
- ●Delhi Pollution | పార్కింగ్ ఛార్జీలు రెట్టింపు, 50% సిబ్బందికి వర్క్‌ఫ్రమ్ హోమ్.. శీతాకాలానికి సిద్ధమవుతున్న ఢిల్లీ

Ashika Ranganath | ఏజ్ గ్యాప్‌పై ట్రోల్స్ - అజిత్ సినిమా నుంచి శ్రీలీల ఔట్ - కన్నడ బ్యూటీకి ఛాన్స్

Supreme Court | టీఎంసీ పార్టీ గుర్తు, పేరుపై వివాదం.. ఎన్నికల సంఘానికి సుప్రీం కీలక ఆదేశాలు

Stock Markets | రూ.6 లక్షల కోట్లు ఆవిరి.. స్టాక్ మార్కెట్లలో వాటర్ ఫాల్.. భారీగా అమ్మకాలు..

Congress Leaders Rally | సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలి





