ACB Raids | నిమ్స్ దవాఖానలో ఏసీబీ సోదాలు.. అడిషనల్ సూపరింటెండెంట్‌పై ఆరోపణలు
ACB Raids | హైదరాబాద్‌లోని నిమ్స్ (NIMS) దవాఖానలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు (ACB Raids) నిర్వహిస్తున్నారు. హాస్పిటల్ అదనపు సూపరింటెండెంట్ (Additional Superintendent) డాక్టర్ లక్ష్మీ భాస్కర్‌పై (Dr. Lakshmi Bhaskar) ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో నిమ్స్ సహా మూడు జిల్లాల్లో మంగళవారం ఉదయం ఏకకాలంలో దాడులు చేపట్టారు.
ACB Raids | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్‌లోని నిమ్స్ (NIMS) దవాఖానలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు (ACB Raids) నిర్వహిస్తున్నారు. హాస్పిటల్ అదనపు సూపరింటెండెంట్ (Additional Superintendent) డాక్టర్ లక్ష్మీ భాస్కర్‌పై (Dr. Lakshmi Bhaskar) ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో నిమ్స్ సహా మూడు జిల్లాల్లో మంగళవారం ఉదయం ఏకకాలంలో దాడులు చేపట్టారు. మొత్తం 12 ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. ఆయన నివాసాలతోపాటు కార్యాలయం, ఆయన బంధువులు, సన్నిహితుల ఇండ్లలో సోదాలు కొనసాగుతున్నాయి.
ఆస్తులు, బ్యాంకు లావాదేవీలు, కీలక పత్రాలకు సంబంధించిన వివరాలను పరిశీస్తున్నారు. ఇప్పటికే పెద్ద మొత్తంలో నగదుతోపాటు కొన్ని అక్రమాస్తులను గుర్తించినట్లు తెలుస్తున్నది. కాగా, గతంలో కూడా డాక్టర్ లక్ష్మీ భాస్కర్‌పై భూ లావాదేవీలు, నిధుల మళ్లింపు వంటి తీవ్ర ఆరోపణలపై కేసులు నమోదయ్యాయి. వీటన్నింటి ఆధారంగానే ఆయనపై నిఘాపై పెట్టిన ఏసీబీ అధికారులు.. పక్కా సమాచారంతో ఆకస్మిక దాడులు నిర్వహించినట్లు తెలుస్తున్నది. అయితే ఇటీవల కాలంలో అవినీతి అధికారులపై వరుసగా దాడులు నిర్వహిస్తున్న ఏసీబీ.. రూ.వందల కోట్లలో అక్రమార్కుల ఆస్తులను బయటపెడుతున్నది. ఈ నేపథ్యంలో డాక్టర్ లక్ష్మీ భాస్కర్ వద్ద ఎన్ని రూ.కోట్లు బయటపడతాయో చూడాలి. మరోవైపు నిమ్స్ దవాఖానలో ఏసీబీ దాడులు నిర్వహించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
తాజావార్తలు
- ●Revanth Reddy | ఆదిలాబాద్ రిమ్స్ అగ్నిప్రమాదం.. సీఎం రేవంత్ విచారం
- ●Assam Rifles | పురుషులకు మాత్రమే.. అస్సాం రైఫిల్స్‌లో టెక్నికల్, ట్రేడ్స్‌మ్యాన్ ఉద్యోగాలు..
- ●Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో అగ్నిప్రమాదం.. ఇద్దరు చిన్నారులు మృతి
- ●Revanth Reddy | గ్రీన్ చానల్లో నిధులిస్తున్నా.. పనులు ఎందుకు వేగంగా జరగడంలే?.. వరంగల్ హాస్పిటల్ నిర్మాణంపై సీఎం రేవంత్ అసంతృప్తి
- ●Khairatabad Ganesh | భక్తులకు అలర్ట్.. రేపు రాత్రి వరకే ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం
- ●తెలంగాణలో "మిని" సమరశంఖం: స్థానిక పోరులో గెలుపెవరిది? పార్టీల ప్రాగ్రెస్ రిపోర్ట్‌కు రియల్ టెస్ట్!

Revanth Reddy | ఆదిలాబాద్ రిమ్స్ అగ్నిప్రమాదం.. సీఎం రేవంత్ విచారం

Assam Rifles | పురుషులకు మాత్రమే.. అస్సాం రైఫిల్స్‌లో టెక్నికల్, ట్రేడ్స్‌మ్యాన్ ఉద్యోగాలు..

Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో అగ్నిప్రమాదం.. ఇద్దరు చిన్నారులు మృతి

Revanth Reddy | గ్రీన్ చానల్లో నిధులిస్తున్నా.. పనులు ఎందుకు వేగంగా జరగడంలే?.. వరంగల్ హాస్పిటల్ నిర్మాణంపై సీఎం రేవంత్ అసంతృప్తి






