త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sony Xperia 10 VIII | సోనీ కొత్త ఫోన్.. 2 రోజుల వ‌ర‌కు బ్యాటరీ బ్యాక‌ప్‌.. ప‌వ‌ర్‌ఫుల్ డిస్‌ప్లే..

Sony Xperia 10 VIII | ఎల‌క్ట్రానిక్స్ త‌యారీ సంస్థ సోనీ తన మిడ్‌రేంజ్‌ 10 సిరీస్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ ఎక్స్‌పీరియా10 8ని పరిచయం చేసింది. రోజువారీ వినియోగం, సౌకర్యం, అందుబాటు ధరను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ ఫోన్‌లో గత మోడల్‌తో పోలిస్తే డిస్‌ప్లే బ్రైట్‌నెస్, స్టీరియో ఆడియో, హార్డ్‌వేర్‌ షార్ట్‌కట్‌ కంట్రోల్స్‌, బ్యాటరీ సామర్థ్యంలో గణనీయమైన అప్‌గ్రేడ్లు ఇచ్చారు.

S

Technology | Published On Aug 26, 2026, 12.21 pm IST

Sony Xperia 10 VIII | సోనీ కొత్త ఫోన్.. 2 రోజుల వ‌ర‌కు బ్యాటరీ బ్యాక‌ప్‌.. ప‌వ‌ర్‌ఫుల్ డిస్‌ప్లే..
Advertisement

Sony Xperia 10 VIII | ఎల‌క్ట్రానిక్స్ త‌యారీ సంస్థ సోనీ తన మిడ్‌రేంజ్‌ 10 సిరీస్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ ఎక్స్‌పీరియా10 8ని పరిచయం చేసింది. రోజువారీ వినియోగం, సౌకర్యం, అందుబాటు ధరను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ ఫోన్‌లో గత మోడల్‌తో పోలిస్తే డిస్‌ప్లే బ్రైట్‌నెస్, స్టీరియో ఆడియో, హార్డ్‌వేర్‌ షార్ట్‌కట్‌ కంట్రోల్స్‌, బ్యాటరీ సామర్థ్యంలో గణనీయమైన అప్‌గ్రేడ్లు ఇచ్చారు. ఈ ఫోన్‌లో 6.1 ఇంచుల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. గత మోడల్‌తో పోలిస్తే ఈ స్క్రీన్‌ సుమారు 50 శాతం ఎక్కువ కాంతిని అందిస్తుంది. ముఖ్యంగా సూర్య‌కాంతిలో ఫోన్‌ వినియోగించే సమయంలో స్క్రీన్‌పై కంటెంట్‌ స్పష్టంగా కనిపించేలా దీన్ని రూపొందించారు. చుట్టుపక్కల వెలుతురు స్థాయిని గుర్తించి రంగులను ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేసే వ్యవస్థను కూడా సోనీ ఇందులో అందించింది. మ్యాప్స్‌ చూడటం, సూర్య‌కాంతిలో చదవడం వంటి సందర్భాల్లో కాంట్రాస్ట్‌, కలర్‌ బ్యాలెన్స్‌ను ఈ ఫీచర్ ఆటోమేటిగ్గా ఆప్టిమైజ్‌ చేస్తుంది. అలాగే 120 హెడ్జ్ రిఫ్రెష్‌ రేట్ ను ఇచ్చారు. స్క్రీన్‌కు కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ విక్టస్‌ 2 రక్షణ కల్పించారు.

2 రోజుల వ‌ర‌కు బ్యాట‌రీ బ్యాక‌ప్‌..

ఆడియో విషయంలోనూ సోనీ మార్పులు చేసింది. ఫోన్‌లో ముందు వైపు అమర్చిన స్టీరియో స్పీకర్లను రీట్యూన్‌ చేశారు. గత తరంతో పోలిస్తే మొత్తం సౌండ్‌ అవుట్‌పుట్‌ సుమారు 15 శాతం పెరిగింది. అలాగే తక్కువ ఫ్రీక్వెన్సీ బాస్‌ స్పందన 30 శాతానికి పైగా మెరుగుపడింది. స్టీరియో సెపరేషన్‌, వాయిస్‌ క్లారిటీని కూడా పెంచడంతో బాహ్య స్పీకర్లు లేదా హెడ్‌ఫోన్లు లేకుండానే మీడియా ప్లేబ్యాక్‌ను మెరుగ్గా ఆస్వాదించవచ్చు. ఈ ఫోన్‌లో 360 రియాలిటీ ఆడియో సర్టిఫికేషన్‌, 360 రియాలిటీ ఆడియో అప్‌మిక్స్‌, డీఎస్‌ఈఈ అల్టిమేట్‌, స్టీరియో రికార్డింగ్‌, క్వాల్‌కామ్‌ ఏప్ట్‌ఎక్స్‌ అడాప్టివ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. 3.5 ఎంఎం ఆడియో జాక్‌ను కూడా ఇచ్చారు. ఇందులో 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే సాధారణ వినియోగంలో రెండు రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్‌ లభిస్తుందని సోనీ చెబుతోంది. యూఎస్‌బీ పవర్‌ డెలివరీ ద్వారా 30 వాట్ల వరకు ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు ఫోన్ స‌పోర్ట్ ఇస్తుంది.

ప‌వ‌ర్‌ఫుల్ కెమెరాలు..

ఈ ఫోన్లో క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 6 జెన్ 3 ప్రాసెస‌ర్‌ను ఇచ్చారు. ఫోన్‌లో 8 జీబీ ఫిజికల్‌ ర్యామ్‌ ఉండగా, అదనంగా 6 జీబీ వరకు వర్చువల్‌ మెమరీని ఉపయోగించుకోవచ్చు. దీంతో ఒకేసారి పలు యాప్‌లను వినియోగించడం, వాటి మధ్య మారడం సులభంగా ఉంటుంది. 128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ అందించారు. మైక్రోఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 2 టీబీ వరకు పెంచుకోవచ్చు. ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఆండ్రాయిడ్‌ 15 ఉంటుంది. నాలుగు ఆపరేటింగ్‌ సిస్టమ్‌ అప్‌గ్రేడ్లు, ఆరు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్లను సోనీ అందించనుంది. వెనుక భాగంలో 50 మెగాపిక్స‌ల్‌ ప్రధాన కెమెరా, 13 మెగాపిక్స‌ల్‌ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరాల‌ను ఇచ్చారు. ముందు భాగంలో 8 మెగాపిక్స‌ల్‌ కెమెరాను ఇచ్చారు. ఫోన్‌ సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌తో వస్తుంది. నీరు, దుమ్ము నుంచి రక్షణ కోసం ఐపీ65, ఐపీ68 రేటింగ్‌ ఉంది. డ్యుయల్‌ సిమ్‌, నానో సిమ్‌, ఈ-సిమ్‌ సదుపాయాలు ఉన్నాయి. 5జి, వైఫై 802.11 ఏసీ, బ్లూటూత్‌ 5.4, జీపీఎస్‌, గ్లోనాస్‌, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి 2.0 కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

ధ‌ర ఎంతంటే..

సోనీ ఎక్స్‌పీరియా10 8 ధర 599 యూరోలు ఉండ‌గా, భార‌త కరెన్సీలో రూ.66,850కు సమానంగా ఉంటుంది. యూకేలో దీని ధరను 549 పౌండ్లుగా నిర్ణయించారు. యూరప్‌, యూకే మార్కెట్లలో సెప్టెంబర్‌ నుంచి ఈ ఫోన్‌ను విక్ర‌యించ‌నున్నారు. ప్రస్తుతం భారత్‌లో ఈ ఫోన్‌ విడుదలకు సంబంధించిన వివరాలను సోనీ వెల్లడించలేదు.

Advertisement
Advertisement