MLA Anirudh Reddy | కోమటిరెడ్డి కోసం ప్రాణాలిస్తా.. నీళ్లను తరలిస్తే ఆయనతోనే యుద్ధం చేస్తా
MLA Anirudh Reddy | తన రాజకీయ గురువు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోసం ప్రాణాలైనా ఇస్తానని.. పాలమూరు నీళ్లను తరలిస్తే మాత్రం ఆయనతోనే యుద్ధం చేస్తానని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
- ఏదుల రిజర్వాయర్ నుంచి డిండి ఎత్తిపోతలకు నీటిని తరలించే ప్రతిపాదనను అంగీకరించం
- జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
MLA Anirudh Reddy | త్రినేత్ర న్యూస్: తన రాజకీయ గురువు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోసం ప్రాణాలైనా ఇస్తానని.. పాలమూరు నీళ్లను తరలిస్తే మాత్రం ఆయనతోనే యుద్ధం చేస్తానని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రాంత ప్రయోజనాలే ముఖ్యమన్నారు. తమకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పాలమూరు ఎమ్మెల్యేలంతా కలిసి పోరాడతామని.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసుకుంటామని చెప్పారు. జడ్చర్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
పాలమూరు నీళ్ల విషయంలో వెనక్కి తగ్గేదే లేదు. నా రాజకీయ గురువు అయిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోసం నా తలనైనా నరుక్కుంటా. కానీ నీళ్ల కోసం అదే గురువుతో యుద్ధం చేస్తా. పాలమూరుకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదు. నీళ్లను తరలించుకుపోతే సహించబోం. ఏదుల రిజర్వాయర్ నుంచి డిండి ఎత్తిపోతలకు నీటిని తరలించే ప్రతిపాదనను అంగీకరించం.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా పాలమూరుకు నీళ్లు అందించాలి. ఆ తర్వాతే డిండి ప్రాజెక్టుకు నీటిని ఇవ్వాలి. బీఆర్ఎస్ హయాంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు కేవలం 60 శాతమే జరిగాయి. ఏదుల నుంచే డిండి ఎత్తిపోతలకు నీటిని తరలిస్తామని అప్పటి సీఎం కేసీఆర్ అసెంబ్లీలోనే చెప్పారు. ప్రతిపక్షాలు అప్పుడు మౌనంగా ఉండి ఇప్పుడు రాజకీయం చేయడం సరికాదు. జేఏసీ ఆధ్వర్యంలో చేపడుతున్న జల దీక్షకు నా మద్దతు ఉంటుంది. రేవంత్ రెడ్డి పాలమూరుకే కాదు.. ఈ రాష్ట్రానికి సీఎం. ప్రతి విషయంలో ఆయనను బద్నాం చేయొద్దు అనిరుధ్‌రెడ్డి వ్యాఖ్యనించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు వంశీచారి, మాజీ ఎంపీపీ నిత్యానందం, అశోక్ యాదవ్, మాలిక్ షాకీర్, భాస్కర్ రెడ్డి, కుమ్మరి రాజు, మార్కెట్ కమిటీ, వైస్ ప్రెసిడెంట్ రాజు గౌడ్, సర్పంచ్ గిరి ప్రసాద్, కరీం, రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
తాజావార్తలు
- ●CJI Justice Surya Kant | న్యాయం కోసం ధైర్యంగా నిలబడాలి
- ●IRDAI | లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీదారులకు ఐఆర్డీఏఐ ఊరట.. ప్రీమియం చెల్లింపులకు రుణాలు..
- ●Ntr | జైలర్ 2 డైరెక్టర్‌తో ఎన్టీఆర్ పాన్ ఇండియన్ మూవీ - టైటిల్ ఇదేనా?
- ●CMC | సరిపోదా శనివారం.. పాత ఫర్నీచర్ కోసం
- ●DMK | బ్యాలెట్ పేపర్‌తో ఎన్నికలు జరపండి.. ఈవీఎంలు ఇక చాలు : డీఎంకే
- ●KTR | వినయ్! నేనున్నా భయపడకు.. మంచి వైద్యమిప్పిస్తా

CJI Justice Surya Kant | న్యాయం కోసం ధైర్యంగా నిలబడాలి

IRDAI | లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీదారులకు ఐఆర్డీఏఐ ఊరట.. ప్రీమియం చెల్లింపులకు రుణాలు..

Ntr | జైలర్ 2 డైరెక్టర్‌తో ఎన్టీఆర్ పాన్ ఇండియన్ మూవీ - టైటిల్ ఇదేనా?

CMC | సరిపోదా శనివారం.. పాత ఫర్నీచర్ కోసం





