త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Saddula Bathukamma | సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ: సీఎం రేవంత్‌రెడ్డి

Saddula Bathukamma | సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా ఆడబిడ్డలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ ప్రకృతి ఆరాధనకు, మహిళల ఆత్మీయ అనుబంధానికి నిదర్శనమని పేర్కొన్నారు.

P

Telangana | Published On Oct 17, 2026, 6.22 pm IST

Saddula Bathukamma | సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ: సీఎం రేవంత్‌రెడ్డి
Advertisement

Saddula Bathukamma | సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా ఆడబిడ్డలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ ప్రకృతి ఆరాధనకు, మహిళల ఆత్మీయ అనుబంధానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రకృతిని, పూలను పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణ సొంతమని సీఎం అన్నారు. తీరొక్క పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలతో ఆడబిడ్డలంతా ఆటపాటలతో సద్దుల బతుకమ్మ సంబురాలను ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.

పూల పండుగ ప్రతి ఇంటా ఆనందాలను నింపాలని, ప్రతి కుటుంబంలో సిరిసంపదలు, సుఖశాంతులు వెల్లివిరియాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. తెలంగాణ సాంస్కృతిక వైభవం తరతరాల పాటు కొనసాగాలని పేర్కొన్నారు. బతుకమ్మ పండుగ మహిళల ఐక్యతను చాటడంతో పాటు ఎన్నో సామాజిక సందేశాలను అందిస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ వేడుకలను వైభవంగా నిర్వహించుకోవడం సంతోషకరమని సీఎం పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం ఆడబిడ్డల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

Advertisement
Advertisement