Dudimetla Balaraju Yadav | కేసీఆర్ ఫ్యామిలీపై అబద్ధాలు చెప్పే ఆ ఆరుగురు ఎవరంటే..
Dudimetla Balaraju Yadav | త్రినేత్ర న్యూస్: కేసీఆర్పై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు చేసిన ఆరోపణలపై కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ స్పందించారు.
Dudimetla Balaraju Yadav | త్రినేత్ర న్యూస్: కేసీఆర్పై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు చేసిన ఆరోపణలపై కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ స్పందించారు. చామలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చామలతో సహా మరో ఐదుగురు కేసీఆర్పై అబద్ధాలు చెప్పడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ఆ ఆరుగురు ఎవరనేది తెలంగాణ భవన్ లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో వివరించారు.
కేసీఆర్ కుటుంబంపై అబద్దాలు చెప్పడంలో చామల కిరణ్ కుమార్ రెడ్డి నంబర్ 1, బల్మూరి వెంకట్ నంబర్ 2, అద్దంకి దయాకర్ నంబర్ 3, వేముల వీరేశం నంబర్ 4, బీర్ల అయిలయ్య నంబర్ 5, ఆది శ్రీనివాస్ నంబర్ 6. కేసీఆర్ కుటుంబంపై అబద్దాలు మాట్లాడిన వారికి సీఎం రేవంత్ రెడ్డి ర్యాంకులు ఇస్తున్నారు. కాంగ్రెస్ నేతలు గోబెల్స్ కు తాతలు, ముత్తాతలు అయ్యారు.
రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఎల్ నినో లేదని చామల కిరణ్ రెడ్డి అంటున్నారు. చామలకు బుద్ధి లేదు. వెయ్యి టీఎంసీల నీళ్లను ఏపీకి వదిలేశారు. ఆర్.వి.ఎం కంపెనీ నామా నాగేశ్వరరావుది కాదు. చామల కిరణ్ కుమార్ రెడ్డి మెదడు మోకాళ్ళలో ఉంది. వచ్చే ఎన్నికల్లో చామల కిరణ్ కుమార్ రెడ్డిని చిత్తుగా ఓడించడం ఖాయం. 50 వేల కోట్ల బడ్జెట్ కు కేసీఆర్ సీఎం అయితే 3 లక్షల కోట్ల బడ్జెట్ కు రేవంత్ రెడ్డి సీఎం.
సంఘీ సామ్రాట్ విల్లా వ్యవహారం మాకు తెల్సు..
రైతులకు నీళ్లు ఇవ్వరు.. కానీ కేసీఆర్ పై నిందలు వేస్తారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైల్స్ బయట పెట్టాలా? మునగనూరులో చామల కిరణ్ రెడ్డి అనుచరుడు భూ కబ్జా చేశారు. సంఘీ సామ్రాట్ విల్లా వ్యవహారం మాకు తెలియదా? కేటీఆర్ డైరెక్ట్ గా అమెరికా నుంచి వచ్చి మంత్రి కాలేదు. 2006లో కరీంనగర్ లోక్ సభ ఉప ఎన్నికల్లో కేటీఆర్ తెలంగాణ ఉద్యమంలోకి వచ్చారు. రాహుల్ గాంధీ ఫోర్జరీ సంతకాలు పెట్టి చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయ్యారు.
కేసీఆర్ తొమ్మిదిన్నరేళ్లలో 120 సంక్షేమ పథకాలు పెట్టారు. నిధులు, భూములు అన్నీ కాంగ్రెస్ నేతల జేబుల్లోకి వెళ్తున్నాయి. కేసీఆర్ హయాంలో లక్షా 60 వేల ఉద్యోగాలు ఇచ్చారు. కేసీఆర్ కుటుంబాన్ని తిట్టే వాళ్లకు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి పదవులు ఇస్తున్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ అనే ఇంగిత జ్ఞానం లేకుండా కేసీఆర్ పై కాంగ్రెస్ వాళ్లు మాట్లాడుతున్నారు.
కల్లు తాగిన కోతుల్లా ..
కల్లు తాగిన కోతుల్లా రేవంత్ రెడ్డి సైన్యం వ్యవహరిస్తోంది. సిద్దిపేట జిల్లాలో కరువు ఉందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎంపీగా ఉండి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఒక్క మంత్రి అయినా జిల్లాల్లో పర్యటించారా? చామల డేటా మొత్తం ఉంది. ఆ డేటాను పింక్ బుక్ లో రాస్తున్నాం. కేసీఆర్, కేటీఆర్ పై పిచ్చి పిచ్చిగా మాట్లాడితే గూబ గుయ్యమంటుంది. ఖబర్దార్ చామల కిరణ్ కుమార్ రెడ్డి. అబద్ధపు ప్రచారాలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలబడదు అని బాలరాజు యాదవ్ హితవు పలికారు.
తాజావార్తలు
- ●BCCI | బీసీసీఐ సెలక్టర్ రేసులో వసీం జాఫర్.. చీఫ్ సెలక్టర్ పీఠంపై ఉత్కంఠ!
- ●Anirudh - Kavya Maran | నవంబర్లో అనిరుధ్, కావ్యమారన్ వివాహం - ప్రముఖులకు ఆహ్వానం
- ●PM-AJAY Scheme Adarsh Grams | పీఎం-అజయ్ పథకం ఘనత: 18,093 ఆదర్శ గ్రామాలు.. పూర్తయిన విద్యార్థి హాస్టళ్లు ఇవే!
- ●Director | దర్శకుడిగా కల నెరవేరిన మరుసటిరోజే విషాదం - మలయాళ యంగ్ డైరెక్టర్ హఠాన్మరణం
- ●SIP | ఉద్యోగం కోల్పోతే ఎస్ఐపీకి దెబ్బ.. గ్యాప్ తరువాత ఎంత పెంచాలి..?
- ●West Bengal Voter List Deletion ECI | బెంగాల్లో 5.38 లక్షల ఓట్లు గల్లంతు.. అసలు రహస్యం బయటపడింది!

BCCI | బీసీసీఐ సెలక్టర్ రేసులో వసీం జాఫర్.. చీఫ్ సెలక్టర్ పీఠంపై ఉత్కంఠ!

Anirudh - Kavya Maran | నవంబర్లో అనిరుధ్, కావ్యమారన్ వివాహం - ప్రముఖులకు ఆహ్వానం

PM-AJAY Scheme Adarsh Grams | పీఎం-అజయ్ పథకం ఘనత: 18,093 ఆదర్శ గ్రామాలు.. పూర్తయిన విద్యార్థి హాస్టళ్లు ఇవే!

Director | దర్శకుడిగా కల నెరవేరిన మరుసటిరోజే విషాదం - మలయాళ యంగ్ డైరెక్టర్ హఠాన్మరణం






