Godavari Floods | గోదావరి వరద బాధితులకు అండగా ప్రభుత్వం
Godavari Floods | గోదావరి వరదల ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి సీతక్క భరోసా ఇచ్చారు. మంగపేట మండలంలో గోదావరి వరద పరిస్థితులను శనివారం జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కాకన్, ఐటీడీఏ పీవో లెనిన్ వత్సల్ టొప్పోతో కలిసి పరిశీలించారు.
- ముంపు బాధితులను అన్ని విధాలా ఆదుకుంటాం
- మంగపేట పునరావాస కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి సీతక్క
Godavari Floods | గోదావరి వరదల ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి సీతక్క భరోసా ఇచ్చారు. మంగపేట మండలంలో గోదావరి వరద పరిస్థితులను శనివారం జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కాకన్, ఐటీడీఏ పీవో లెనిన్ వత్సల్ టొప్పోతో కలిసి పరిశీలించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించి బాధితులతో మాట్లాడారు. బ్యాక్‌వాటర్ ప్రభావంతో ముంపునకు గురయ్యే ప్రాంతాల నుంచి 28 కుటుంబాలకు చెందిన 112 మందిని సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించినట్లు అధికారులు మంత్రికి వివరించారు. అక్కడ కల్పించిన ఆహారం, తాగునీరు, వైద్య సేవలు, పారిశుద్ధ్య ఏర్పాట్లను మంత్రి స్వయంగా పరిశీలించి బాధితుల అవసరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోందని, నది పరివాహక ప్రాంతాల్లోకి నీరు చేరే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న ప్రతి కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా భోజనం, తాగునీరు, వైద్య సేవలు, పారిశుద్ధ్య సౌకర్యాలు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అవసరమైన ప్రతి సౌకర్యం బాధితులకు అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ముంపు బాధితులకు శాశ్వత ప్రాతిపదికన గృహాల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి తెలిపారు.
ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి దశలో ప్రభుత్వం వారికి అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. అంతకుముందు మంగపేట వద్ద గోదావరి బ్యారేజీ నిర్మాణ పనుల పురోగతిని మంత్రి సమీక్షించారు. పనులను నిర్ణీత గడువులో పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కల్యాణి, ఆర్డీవో కృష్ణవేణి, తహసీల్దార్ తోట రవీందర్, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Supreme Court | గుడ్లు విసురుతారన్న భయంతో మినహాయింపా? మహువా పిటిషన్‌పై సుప్రీం ఘాటు వ్యాఖ్యలు
- ●POCSO Judgment | 12 ఏండ్ల బాలికపై అఘాయిత్యం చేశాడు.. 10 ఏండ్ల జైలు శిక్ష వేశారు
- ●Minister Sridhar Babu | గ్రామీణ ప్రాంతాలకు హై-స్పీడ్ డిజిటల్ కనెక్టివిటీ
- ●TGCSB | సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే తెలంగాణకు అగ్రస్థానం
- ●Sreeleela | ప్రియుడి కోసం జాన్వీకపూర్‌తో శ్రీలీల ఫైట్ - ఒకే అబ్బాయితో ఇద్దరు ప్రేమలో పడ్డారా?
- ●Neha Bora | నేహా బోరాపై ఇంకుతో దాడి.. దేశ వ్యతిరేకి అంటూ నినాదాలు

Supreme Court | గుడ్లు విసురుతారన్న భయంతో మినహాయింపా? మహువా పిటిషన్‌పై సుప్రీం ఘాటు వ్యాఖ్యలు

POCSO Judgment | 12 ఏండ్ల బాలికపై అఘాయిత్యం చేశాడు.. 10 ఏండ్ల జైలు శిక్ష వేశారు

Minister Sridhar Babu | గ్రామీణ ప్రాంతాలకు హై-స్పీడ్ డిజిటల్ కనెక్టివిటీ

TGCSB | సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే తెలంగాణకు అగ్రస్థానం




