KCR | సారే రావాలంటున్నది ఈ సర్వే
KCR | రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేండ్ల సమయం ఉన్నప్పటికీ.. ఇప్పుడు ఎన్నికల వేడి రాజుకుంది. ప్రధాన సర్వే సంస్థలన్నీ ఏ పార్టీ గెలుస్తుందనే దానిపై సర్వేలు విస్తృతంగా నిర్వహిస్తున్నాయి. అయితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే బీఆర్ఎస్ పార్టీకి 62 స్థానాలు వస్తాయని ఈ సర్వే అంచనా వేసింది.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే బీఆర్ఎస్‌కు 62
కాంగ్రెస్‌కు 42, బీజేపీకి 8 స్థానాలు
KCR | త్రినేత్ర న్యూస్ : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేండ్ల సమయం ఉన్నప్పటికీ.. ఇప్పుడు ఎన్నికల వేడి రాజుకుంది. ప్రధాన సర్వే సంస్థలన్నీ ఏ పార్టీ గెలుస్తుందనే దానిపై సర్వేలు విస్తృతంగా నిర్వహిస్తున్నాయి. అయితే తాజాగా OMARG SURVEY (Operational Media & Reach Group) నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 62 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీకి క్షేత్రస్థాయిలో బలమైన పరిస్థితులు ఉన్నట్లు అంచనా వేయగా, కాంగ్రెస్ పార్టీకి 42 స్థానాలు, బీజేపీకి 8 స్థానాలు, ఇతర పార్టీలకు 7 స్థానాల్లో అవకాశాలు ఉన్నట్లు సర్వే విశ్లేషించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4,76,348 మంది నుంచి సర్వే ద్వారా అభిప్రాయాలు సేకరించినట్లు నివేదిక పేర్కొంది.
ప్రధాన పార్టీల మధ్య పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ, కొన్ని నియోజకవర్గాల్లో ప్రజల అభిప్రాయాలు, స్థానిక రాజకీయ పరిస్థితులు, అభ్యర్థుల ప్రభావం ఎన్నికల ఫలితాలపై కీలక ప్రభావం చూపే అవకాశముందని నివేదిక పేర్కొంది. ప్రధాన పార్టీ అభ్యర్థుల పరిస్థితిని పరిశీలిస్తే, 38 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉండగా, 34 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ రెండవ స్థానంలోనూ, 14 స్థానాల్లో బీజేపీ పార్టీ ప్రజల అభిప్రాయాలను ప్రభావితం చేస్తున్నట్లు నివేదికలో పేర్కొన్నారు.
సీఎం రేవంత్ పనితీరుపై 44 శాతం మంది వ్యతిరేకం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరుపై ప్రజల్లో 44 శాతం మంది వ్యతిరేక అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సర్వే వెల్లడించింది. మరోవైపు, రాష్ట్ర రాజకీయాల్లో కీలక నాయకుల పనితీరు, ప్రభుత్వ విధానాలు, ప్రజలకు అందుతున్న సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల అభిప్రాయాలు భిన్నంగా ఉన్నట్లు సర్వే విశ్లేషణ సూచిస్తోంది.
కేసీఆర్‌కు 47 శాతం మంది మద్దతు
రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్‌కు 47 శాతం మంది ప్రజలు కొంత మద్దతు ఇస్తున్నట్లు నివేదిక పేర్కొంది. అయితే, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్న తీరుపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజా సమస్యలపై పార్టీ చేస్తున్న పోరాటాలు, ప్రభుత్వ విధానాలపై విమర్శలు, ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాల విషయంలో పార్టీ మరింత ప్రభావవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉందని సర్వే సూచిస్తున్నట్లు నివేదిక పేర్కొంది.
చర్చానీయాంశంగా కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వ పాలనపై ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల అమలులో విఫలం చెందడం, హైడ్రా వంటి పాలనా అంశాలు, 22A నిషేధిత భూముల సమస్యలు, ప్రభుత్వ భూముల అమ్మకాలపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు సర్వే విశ్లేషించింది. అలాగే, కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు, రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ప్రభావం, హైదరాబాద్ నగరం అభివృద్ధి, నగర వనరుల వినియోగం వంటి అంశాలు ప్రజల్లో చర్చనీయాంశాలుగా మారుతున్నట్లు నివేదిక పేర్కొంది.
మంత్రుల పనితీరుపై ప్రజల్లో విమర్శలు
మంత్రుల పనితీరు, ప్రభుత్వ నిర్ణయాలపై ప్రజల్లో విమర్శలు ఉన్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే వర్గాలు కూడా ఉన్నాయని నివేదిక వెల్లడించింది. మంత్రులపై వ్యక్తిగత విమర్శలు, స్థానిక సమస్యల పరిష్కారంలో జాప్యం, ప్రజలకు అందుబాటులో ఉండే విధానం వంటి అంశాలు రాజకీయంగా ప్రభావం చూపుతున్నాయని సర్వే సూచిస్తోంది.
సంక్షేమ పథకాలు.. ఎన్నికల సమయంలో కీలకంగా మారే అవకాశం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ పాలనకు అనుగుణంగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ వంటి నిత్యావసర వస్తువుల ధరల అంశాలను ప్రచారంలో ప్రస్తావిస్తున్నప్పటికీ, సామాన్య, మధ్యతరగతి ప్రజలు తమ ఆర్థిక పరిస్థితి, జీవన వ్యయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు నివేదిక పేర్కొంది. ప్రజల సమస్యలు, ధరల పెరుగుదల, ఉపాధి, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలు ఎన్నికల సమయంలో కీలకంగా మారే అవకాశముందని విశ్లేషించింది.
తాజావార్తలు
- ●One Way | సైబరాబాద్‌లో వన్‌వే రోడ్లు.. స్పెషల్‌గా బస్ లేన్లు!
- ●Constitution Day | రాజ్యాంగాన్ని అర్థం చేసుకోండి.. పరిరక్షించండి..
- ●KTR | ఉద్యోగాలపై ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?
- ●Manne Krishank | బావర్చి హోటల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల ఘర్షణ
- ●Moosapet | మూసాపేట లేఅవుట్ ఈ-వేలానికి లైన్ క్లియర్.. హైకోర్టు స్టే లేదన్న అధికారులు..!
- ●CM Revanth Reddy | అచ్చంపేటలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్

One Way | సైబరాబాద్‌లో వన్‌వే రోడ్లు.. స్పెషల్‌గా బస్ లేన్లు!

Constitution Day | రాజ్యాంగాన్ని అర్థం చేసుకోండి.. పరిరక్షించండి..

KTR | ఉద్యోగాలపై ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?

Manne Krishank | బావర్చి హోటల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల ఘర్షణ





