త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | కంటి మీద కునుకు లేదు.. రాష్ట్రాభివృద్ధి కోసం నిరంత‌రం శ్ర‌మిస్తున్నా

CM Revanth Reddy | ఈ మూడేండ్ల కాలంలో ఏ ఒక్క‌రోజు కూడా సెల‌వు తీసుకోకుండా రాష్ట్రాభివృద్ధి కోసం శ్ర‌మిస్తున్నాన‌ని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ 34 నెల‌ల్లో ఒక్క రోజైనా, ఒక్క గంట అయినా సెల‌వు తీసుకున్నానా..? మీరే చెప్పండి అని ప్ర‌జ‌ల‌ను అడిగారు. ఎన్నో కార్య‌క్ర‌మాలు చేస్తున్నామ‌ని తెలిపారు.

S

Telangana | Published On Nov 26, 2026, 8.31 pm IST

CM Revanth Reddy | కంటి మీద కునుకు లేదు.. రాష్ట్రాభివృద్ధి కోసం నిరంత‌రం శ్ర‌మిస్తున్నా
Advertisement

34 నెల‌ల్లో ఒక్క‌రోజైనా, ఒక్క గంటైనా సెల‌వు తీసుకున్నానా..?
అచ్చంపేట బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌శ్నించిన సీఎం రేవంత్

CM Revanth Reddy | త్రినేత్ర న్యూస్ : ఈ మూడేండ్ల కాలంలో ఏ ఒక్క‌రోజు కూడా సెల‌వు తీసుకోకుండా రాష్ట్రాభివృద్ధి కోసం శ్ర‌మిస్తున్నాన‌ని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ 34 నెల‌ల్లో ఒక్క రోజైనా, ఒక్క గంట అయినా సెల‌వు తీసుకున్నానా..? మీరే చెప్పండి అని ప్ర‌జ‌ల‌ను అడిగారు. ఎన్నో కార్య‌క్ర‌మాలు చేస్తున్నామ‌ని తెలిపారు.

అచ్చంపేట బ‌హిరంగ స‌భ‌లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబం ప‌దేండ్ల‌లో 8 ల‌క్ష‌ల 11 వేల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని దివాళా తీయించి అప్ప‌జెప్పితే.. జీత‌భ‌త్యాలు ఇవ్వ‌లేని ప‌రిస్థితి. డిసెంబ‌ర్ 7న అధికారంలోకి వ‌చ్చాం.. విధ్వంస‌మైన రాష్ట్రం.. మ‌న‌ల్ని న‌మ్మే ప‌రిస్థితి లేదు. అక్క‌డ్నుంచి మొద‌లుపెట్టి.. ఆనాటి నుంచి ఈనాటి వ‌ర‌కు ఉద్యోగుల‌కు సునామీ, భూకంపం వ‌చ్చినా.. మొద‌టి తారీఖు నాడు జీత‌భ‌త్యాలు ఇచ్చినా. ప‌దోన్న‌తులు, బ‌దిలీలు, నియామ‌కాలు చేప‌ట్టినం. విధ్వంస‌మైన తెలంగాణ‌ను వికాసం వైపు న‌డిపించ‌డానికి కంటి మీద కునుకు లేకుండా నిరంత‌రం ప్ర‌య‌త్నం చేస్తున్నా. ఈ 34 నెల‌ల్లో ఒక్క రోజైనా, ఒక్క గంట అయినా సెల‌వు తీసుకున్నానా.. ఎన్నో కార్య‌క్ర‌మాలు చేస్తున్నాం. అప్పుల‌పాలై ఆత్మ‌హ‌త్య చేసుకున్న రైతుల‌కు భ‌రోసా ఇచ్చి 500 బోన‌స్ ఇచ్చి ప్ర‌తి గింజ‌ను కొంటున్నాం. మ‌క్క‌లు, సోయాబీన్, పొద్దు తిరుగుడుకు గిట్టుబాటు ధ‌ర క‌ల్పించి కొనుగోలు చేశామ‌ని సీఎం తెలిపారు.

Advertisement
Advertisement