త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Bar Council | బార్ కౌన్సిల్‌లో 323 మంది ప‌ట్ట‌భ‌ద్రుల రిజిస్ట్రేష‌న్‌.. ప్ర‌మాణం చేయించిన క‌మిటీ

Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్‌లో 323 మంది న్యాయ పట్టభద్రులు న్యాయవాదులుగా నమోదు చేసుకున్నారు. 223 మంది న్యాయవాదులుగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక ఎన్‌రోల్‌మెంట్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జ‌రిగింద‌ని తెలంగాణ బార్ కౌన్సిల్ కార్యదర్శి వీ నాగలక్ష్మి గురువారం తెలిపారు.

P

Telangana | Published On Nov 26, 2026, 8.30 pm IST

Telangana Bar Council | బార్ కౌన్సిల్‌లో 323 మంది ప‌ట్ట‌భ‌ద్రుల రిజిస్ట్రేష‌న్‌.. ప్ర‌మాణం చేయించిన క‌మిటీ
Advertisement

Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్‌లో 323 మంది న్యాయ పట్టభద్రులు న్యాయవాదులుగా నమోదు చేసుకున్నారు. 223 మంది న్యాయవాదులుగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక ఎన్‌రోల్‌మెంట్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జ‌రిగింద‌ని తెలంగాణ బార్ కౌన్సిల్ కార్యదర్శి వీ నాగలక్ష్మి గురువారం తెలిపారు. ఈ కమిటీకి తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ సముల రామ్‌రెడ్డి నేతృత్వం వహించగా.. వైస్ చైర్మన్ వెంకట్ యాదవ్ చలకాని, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెలంగాణ సభ్యుడు జీ కిరణ్ కుమార్ సభ్యులుగా వ్యవహరించారు. అనంతరం బార్ కౌన్సిల్ సభ్యురాలు పూర్ణా షణిగరం కార్యక్రమానికి హాజరై నూతనంగా నమోదైన న్యాయవాదులను అభినందించారు. న్యాయవృత్తిలోకి అడుగుపెడుతున్న వారు వృత్తిపరమైన విలువలు, బాధ్యతలను పాటించాలని స‌ల‌హాలు సూచ‌న‌లు ఇచ్చారు.

Advertisement
Advertisement