త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NEET UG | 21న నీట్ యూజీ రీ-ఎగ్జామ్‌.. 15 నిమిషాలు పెరిగిన ప‌రీక్షా స‌మ‌యం..

NEET UG | నీట్ యూజీ (NEET UG) రీ-ఎగ్జామ్‌ ఈ నెల 21న జరుగనుంది. ఈ ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యే విద్యార్థులకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) అద‌న‌పు స‌మ‌యం (Exam Duration) ఇవ్వ‌డంతోపాటు మ‌రికొన్ని వెసులుబాట్లు కల్పించింది.

G

Telangana | Published On Jun 13, 2026, 6.35 am IST

NEET UG | 21న నీట్ యూజీ రీ-ఎగ్జామ్‌.. 15 నిమిషాలు పెరిగిన ప‌రీక్షా స‌మ‌యం..
Advertisement

NEET UG | త్రినేత్ర‌.న్యూస్‌: నీట్ యూజీ (NEET UG) రీ-ఎగ్జామ్‌ ఈ నెల 21న జరుగనుంది. ఈ ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యే విద్యార్థులకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) అద‌న‌పు స‌మ‌యం (Exam Duration) ఇవ్వ‌డంతోపాటు మ‌రికొన్ని వెసులుబాట్లు కల్పించింది. బుక్‌లెట్‌లో రఫ్‌ వర్క్‌ చేసుకునేందుకు అద‌నంగా పేజీలను కేటాయించింది.

పెరిగిన స‌మ‌యం..

గతంలో నీట్‌ పరీక్ష వ్యవధి 180 నిమిషాలు (3 గంటలు) ఉండేది. తాజాగా దానిని 195 నిమిషాలకు (3.15 గంటలకు) పెంచింది. దీంతో మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభ‌మ‌య్యే ప‌రీక్ష సాయంత్రం 5.15 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. హాజరు పట్టికలో సంతకాలు తీసుకోవడం లాంటివాటితో విద్యార్థులు పరీక్ష సమయాన్ని కోల్పోకుండా ఉండేందుకే అదనంగా 15 నిమిషాల సమయం ఇస్తున్నట్లు వెల్ల‌డించింది.

ర‌ఫ్ వ‌ర్క‌ర్‌కు అద‌న‌పు పేజీలు..

ఇక రఫ్‌ వర్క్‌ కోసం కేటాయించే పేజీల సంఖ్యను కూడా రెట్టింపు చేసింది. గతంలో ప్రశ్నాపత్రం బుక్‌లెట్‌ చివరన రెండు పేజీలు మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు వాటి సంఖ్యను నాలుగుకు పెంచారు. ఫిజిక్స్‌, కెమెస్ట్రీ విభాగాల్లో గణాంకాలు, రేఖాచిత్రాల కోసం అభ్యర్థులకు మరింత స్థలం అందుబాటులోకి రానుంది.

లెఫ్ట్ హ్యాండ‌ర్స్ కోసం లేఅవుట్ మార్పు..

ఎడమ చేతివాటం ఉన్న అభ్యర్థులకు బుక్‌లెట్‌ చివరన ఉన్న పేజీల్లో రఫ్‌ వర్క్‌ చేసుకోవడం ఇబ్బందిగా మారుతుండ‌టంతో బుక్‌లెట్‌ లేఅవుట్‌ను మార్చింది. ఇన్‌స్ట్రక్షన్స్‌ పేజీ తర్వాత ముందు భాగంలో రెండు పేజీలు, బుక్‌లెట్‌ చివరన మరో రెండు పేజీలను రఫ్‌ వర్క్‌ కోసం కేటాయించింది. ఈ కొత్త ఫార్మాట్ ఇంగ్లిష్‌తోపాటు ఇతర అన్ని ప్రాంతీయ భాషల ప్రశ్నపత్రాలకు వర్తిస్తుంది. నీట్‌ రాసేవారిలో 10 శాతం మంది ఎడమచేతి వాటం వారు ఉన్నారని ఎన్‌టీఏ తెలిపింది.

ట్యాగ్స్:

Advertisement
Advertisement